ETV Bharat / business

లాభాలతో ముగిసిన మార్కెట్లు- సెన్సెక్స్ @38,800

author img

By

Published : Aug 24, 2020, 9:53 AM IST

Updated : Aug 24, 2020, 3:49 PM IST

stocks-live
లాభాల్లో స్టాక్​ మార్కెట్లు

15:44 August 24

నిఫ్టీ 95+

వారంలో మొదటి రోజును భారీ లాభాలతో ముగించాయి స్టాక్ మార్కెట్లు. సోమవారం సెషన్​లో సెన్సెక్స్ 364 పాయింట్లు వృద్ధి చెంది 38,799 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 95 పాయింట్లు బలపడి 11,466 వద్దకు చేరింది.

ఆర్థిక షేర్ల జోరు, అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూలతలు లాభాలకు ప్రధాన కారణం.

ఇండస్​ఇండ్ బ్యాంక్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఐసీఐసీ బ్యాంక్, భారతీ ఎయిర్​టెల్ షేర్లు లాభాల్లో ప్రధానంగా ఉన్నాయి.  

పవర్​గ్రిడ్, టెక్ మహీంద్రా, ఎం&ఎం, టైటాన్​, నెస్లే, ఎన్​టీపీసీ షేర్లు నష్టపోయాయి.

12:03 August 24

లాభాల్లో స్థిరంగా సూచీలు..

స్టాక్ మార్కెట్లు మిడ్​ సెషన్​లోనూ లాభాల్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 250 పాయింట్లకుపైగా వృద్ధితో 38,685 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 70 పాయింట్లకుపైగా బలపడి 11,446 వద్ద కొనసాగుతోంది.

ఆర్థిక షేర్లు లాభాలకు దన్నుగా నిలుస్తున్నాయి.

  • కోటక్ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఇండస్​ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • ఎన్​టీపీసీ, పవర్​గ్రిడ్, భారతీ ఎయిర్​టెల్, ఎం&ఎం, టెక్ మహీంద్రా, ఏషియన్​ పెయింట్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

09:28 August 24

లాభాల్లో స్టాక్​ మార్కెట్లు

ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల పవనాలకు తోడు, వాహన, బ్యాంకింగ్​ రంగ షేర్ల దూకుడుతో.. దేశీయ స్టాక్​ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి.  

బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 177 పాయింట్ల లాభంతో 38,612 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.  

జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 58 పాయింట్ల లాభంతో 11,430 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.  

లాభనష్టాల్లోనివి..

ఐచర్​ మోటార్స్​, కొటక్​ మహీంద్రా బ్యాంక్​, గ్రాసిమ్​, టాటా స్టీల్​, అదానీ పోర్ట్స్​ లాభాల్లో కొనసాగుతున్నాయి.  

హెచ్​సీఎల్​ టెక్​, టెక్​ మహీంద్రా, టైటాన్​ కంపనీ, హీరో మోటోకార్ఫ్​, హిందాల్కోలు భారీ నష్టాల్లోకి వెళ్లాయి.  

రూపాయి..

అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకపు విలువ డాలర్​తో పోలిస్తో..రూ.74.84 వద్ద కొనసాగుతోంది. 

Last Updated : Aug 24, 2020, 3:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.