ETV Bharat / bharat

మహిళ మెడలో గోల్డ్​ చైన్​ చోరీ.. తప్పించుకునేందుకు గొలుసు​ మింగేసిన దొంగ.. చివరకు..

author img

By

Published : May 28, 2023, 12:52 PM IST

మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును దొంగిలించారు ఇద్దరు యువకులు. అనంతరం పోలీసులకు పట్టుబడ్డారు. తాము దొంగతనం చేయలేదని తప్పించుకునేందుకు అందులో ఒక చైన్​ స్నాచర్​ వినూత్నంగా ఆలోచించాడు. చోరీ చేసిన బంగారు గొలుసును మింగేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?

Thief swallows gold chain
Thief swallows gold chain

ఝార్ఖండ్..​ రాంచీలో దొంగలు బీభత్సం సృష్టించారు. రోడ్డు మీద వెళ్తున్న మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును ఇద్దరు చైన్ స్నాచర్లు లాక్కెళ్లారు. వీరిని పోలీసులు కిలోమీటరు వెంబడించి పట్టుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

సల్మాన్​, జాఫర్​ అనే ఇద్దరు చైన్ స్నాచర్లు రాంచీలోని దిబ్దిహ్ వంతెన సమీపంలో రోడ్డుపై వెళ్తున్న మహిళ మెడలో నుంచి గొలుసును దొంగిలించి బైక్​పై వెళ్లిపోయారు. దీంతో బాధితురాలు అరవడం మొదలుపెట్టింది. ఆమె అరుపులు విన్న పోలీసులు.. నిందితుల బైక్​ను వెంబడించారు. కి.మీ తర్వాత ఛేజ్​ చేసి నిందితులు సల్మాన్​, జాఫర్​ను పట్టుకున్నారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు సల్మాన్.. మహిళ మెడలో నుంచి దొంగిలించిన బంగారు గొలుసును మింగేశాడు.

Thief swallows gold chain
నిందితులు జాఫర్, సల్మాన్

వెంటనే అతడిని పోలీసులు రాంచీలోని రిమ్స్​ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు సల్మాన్​కు వైద్యులు ఎక్స్​రే తీయగా అసలు విషయం బయటపడింది. అతడి ఛాతీ భాగంలో బంగారు గొలుసు ఇరుక్కుపోయినట్లు వైద్యులు తెలిపారు. బంగారు గొలుసు.. నిందితుడు ఛాతీలో ఎక్కువ సేపు ఉంటే ఇన్​ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉందని కూడా చెప్పారు. తనను కాపాడాలని వైద్యులు, పోలీసులను సల్మాన్ విజ్ఞప్తి చేశాడు.

Thief swallows gold chain
నిందితుడు సల్మాన్​ ఛాతీలో ఇరుక్కిపోయిన బంగారు గొలుసు

సల్మాన్, జాఫర్​ రాంచీలో గత 2 నెలల కాలంలో అనేక దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఒంటరిగా వెళ్తున్న మహిళలే టార్గెట్​గా వీరు దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులిద్దరూ దొంగతనానికి వాడిన బైక్​ కూడా చోరీ చేసిందనేని వెల్లడించారు. జాఫర్​ ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉండగా.. మరో నిందితుడు సల్మాన్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

రెండు బస్తాల వెంట్రుకలు చోరీ..
కొద్ది రోజుల క్రితం గుజరాత్​లో ఆశ్చర్యకరమైన దొంగతనం జరిగింది. కొందరు దొంగలు కలిసి రెండు బస్తాల వెంట్రుకలను చోరీ చేశారు. ఈ వెంట్రుకల బరువు 40 కిలోలు ఉంటుందని.. వాటి ధర దాదాపు రూ.2 లక్షలని పోలీసులు తెలిపారు. వెంట్రుకలు చోరీకి పాల్పడిన ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. అలాగే వారి నుంచి రెండు బస్తాల వెంట్రుకలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
రాజ్‌కోట్​.. పిప్లియా ప్రాంతంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన పుష్పేంద్ర సింగ్ అనే వ్యాపారి రెండు బస్తాల వెంట్రుకలతో బైక్​పై మోర్బీకి వెళ్తున్నాడు. ఆ రెండు బస్తాల్లో దాదాపు 40 కిలోల బరువున్న వెంట్రుకలు ఉన్నాయి. అయితే ముగ్గురు దుండగులు ఆటోలో వచ్చి పుష్పేంద్ర సింగ్ ఉన్న వెంట్రుకల బస్తాలను దోచుకెళ్లారు. వారికి మరో ఇద్దరు సహకరించారు. వెంటనే పుష్పేంద్ర సింగ్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ చోరీపై కేసు నమోదు పోలీసులు.. నిందితుల కోసం గాలించారు. రాజ్‌కోట్ సమీపంలోని పిప్లియా గ్రామంలో వెంట్రుకల బస్తాలను చోరీ చేసిన నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు వెంట్రుకల బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.