కారు చోరీ చేసిన బీటెక్​ స్టూడెంట్స్​.. స్టార్ట్​ కాలేదని 17 కి.మీ నెట్టుకుంటూనే..

author img

By

Published : May 24, 2023, 7:05 PM IST

car stolen by pushing in kanpur

మీరు ఎన్నో దొంగతనాలు చూసి ఉంటారు కానీ.. ఇలాంటి చోరీ గురించి ఎక్కడా విని ఉండరు. ఓ కారును దొంగిలించిన ముగ్గురు దొంగలు.. అది స్టార్ట్ కాకపోవడం వల్ల నెట్టుకుంటూ వెళ్లారు. ఇలా ఒకటి.. రెండు కాదు ఏకంగా 17 కిలోమీటర్ల దూరం తోసుకుంటూనే వెళ్లారు. ఈ వింత ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

ఉత్తర్​ప్రదేశ్​ కాన్పుర్​లో వింత దొంగతనం జరిగింది. ఓ కారును దొంగిలించిన ముగ్గురు దొంగలు.. దానిని సుమారు 17 కిలోమీటర్ల మేర నెట్టుకుంటూ వెళ్లారు. దొంగిలించిన అనంతరం కారు స్టార్ట్ కాకపోవడం వల్ల అంత దూరం తోసుకుంటూనే వెళ్లారు దొంగలు. కారు యజమాని ఫిర్యాదు చేయడం వల్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు దొంగలను పట్టుకోగా వీరిలో ఇద్దరు బీటెక్​ విద్యార్థులు ఉన్నారని పోలీసులు చెప్పారు.

ఇదీ జరిగింది
దబౌలి ప్రాంతానికి చెందిన సత్యం కుమార్​, అమన్​ బీటెక్​ చదువుతున్నారు. వీరద్దరూ వెబ్​సైట్​ క్రియేట్​ చేసి ఆన్​లైన్​ ప్రమోషన్లు చేస్తుంటారు. ఈ క్రమంలోనే వీరికి అపార్ట్​మెంట్​లో పనిచేసే అమిత్​తో పరిచయం ఏర్పడింది. ముగ్గురూ ఓ పాన్​ షాప్​ వద్ద కలుసుకున్నారు. ఆ తర్వాత వీరి ముగ్గురి మధ్య స్నేహం పెరిగింది. తక్కువ సమయంలోనే ధనవంతులు కావాలని ఆశపడ్డారు. అందుకోసం వాహనాలను దొంగతనం చేయడం ప్రారంభించారు.

ఈ క్రమంలోనే బర్రా పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఓ మారుతీ కారును మే 22 తేదీ రాత్రి దొంగిలించేందుకు ప్రణాళిక రచించారు ముగ్గురు దొంగలు. అక్కడికి వెళ్లి కారును స్టార్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఎంత ప్రయత్నించినా కారు స్టార్ట్ కాకపోవడం వల్ల సుమారు 17 కిలోమీటర్ల మేర నెట్టుకుంటూనే వెళ్లారు. బాగా అలసిపోయిన దొంగలు.. కారును ఓ నిర్మానుష్య ప్రాంతంలో పార్క్ చేసి వెళ్లారు. ఆ తర్వాత వచ్చి కారును గ్యారెజ్​కు తీసుకెళ్లారు. కారు బాగయ్యాక దానిని వాడడం మొదలుపెట్టారు.

కారు యజమాని​ ఫిర్యాదు చేయడం వల్ల ఈ విషయం బయటపడింది. ఈ ముగ్గురితో పాటు వీరికి సహకరించిన మరో నిందితుడు రోషన్​ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. వీరి వద్ద నుంచి దొంగిలించిన కారు సహా మరో రెండు బైక్​లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేశామని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

car stolen by pushing in kanpur
ముగ్గురు నిందితులు

కుక్కను దొంగతనం చేసిన బీటెక్ స్టూడెంట్స్
ఓ పెట్ షాపులోని కుక్కపిల్లను చాకచక్యంగా దొంగిలించారు ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు. ఈ శునకాన్ని హెల్మెట్​లో పెట్టి ఎత్తుకెళ్లిపోయారు. ఈ ఘటన జనవరి 28న కేరళలోని కొచ్చిలో జరిగింది. బోనులో ఉన్న కుక్కపిల్ల కనిపించకపోవడం వల్ల దుకాణదారుడు షాపులోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాడు. అప్పుడు అసలు విషయం బయటపడింది. వెంటనే దుకాణదారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కర్ణాటకకు చెందిన 23 ఏళ్ల నిఖిల్​, 23 ఏళ్ల శ్రేయను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి కుక్కపిల్లను స్వాధీనం చేసుకుని యజమానికి అప్పగించారు. అపహరణకు గురైన కుక్కపిల్ల స్విఫ్ట్​ జాతికి చెందినదని పెట్ షాపు యజమాని తెలిపాడు. దాని ధర రూ.20 వేలు ఉంటుందని చెప్పాడు. పూర్తి వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవీ చదవండి : ATM నుంచి డబ్బులకు బదులు పాములు!.. జనం పరుగో పరుగు

అప్పుడు నెహ్రూ.. ఇప్పుడు మోదీ.. పార్లమెంట్​లో పెట్టే 'సెంగోల్' కథేంటో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.