ETV Bharat / bharat

​ఫైజల్ అనర్హతపై సుప్రీం విచారణ.. రాహుల్​ గాంధీ కేసుపై ప్రభావమెంత?

author img

By

Published : Mar 27, 2023, 12:25 PM IST

Updated : Mar 27, 2023, 1:35 PM IST

లక్షద్వీప్ మాజీ ఎంపీ మహ్మద్​ ఫైజల్ పిటిషన్​పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. తనను అనర్హుడిగా ప్రకటిస్తూ.. లోక్‌సభ సచివాలయం జారీ చేసిన నోటిఫికేషన్‌పై మహ్మద్ ఫైజల్​ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేరళ హైకోర్టు స్టే విధించినప్పటికీ తన సభ్యత్వాన్ని పునరుద్ధరించకపోవడాన్ని సవాల్ చేస్తూ చేస్తూ ఆయన సుప్రీంలో పిటిషన్​ ధాఖలు చేశారు.

lakswadeep mp faisal
lakswadeep mp faisal

తనను అనర్హుడిగా ప్రకటిస్తూ.. లోక్‌సభ సచివాలయం జారీ చేసిన నోటిఫికేషన్‌పై లక్షద్వీప్ మాజీ ఎంపీ, ఎన్​సీపీ నేత మహ్మద్​ ఫైజల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఫైజల్‌ పిటిషన్​పై మంగళవారం విచారణ జరపడానికి సీజేఐ డీవై చంద్రచూడ్ ధర్మాసనం అంగీకరించింది. తనపై లోక్​సభ సచివాలయం విధించిన అనర్హతను వెంటనే తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఫైజల్​ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఫైజల్​ పిటిషన్​ను అంగీకరించి సుప్రీంకోర్టు మంగళవారం దీనిపై విచారణ జరపనున్నట్లు వెల్లడించింది. ఓ హత్య కేసులో ఫైజల్‌కు రెండేళ్ల శిక్ష విధించింది ట్రయల్‌ కోర్టు. ఈ కోర్టు తీర్పు వెలువడిన వెంటనే ఫైజల్​పై లోక్​సభ అనర్హత వేటు వేసింది.

అయితే ఈ శిక్షపై కేరళ హైకోర్టు స్టే విధించనప్పటికీ లోక్​సభ ఫైజల్​పై విధించిన అనర్హత వేటును ఉపసంహరించుకోలేదు. దీంతో ఫైజల్​ ప్రతిరోజు పార్లమెంట్​కు వెళ్లినా సరే అక్కడ భద్రతా సిబ్బంది ఆయన్ను సభ లోపలికి అనుమతించేవారు కాదు. దీంతో ఫైజల్​పై​ తనపై వేసిన అనర్హత వేటును వెంటనే తొలగించేలా చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు.

అసలేంటీ ఫైజల్​ కేసు?
ఎన్​సీపీ నేత మహ్మద్ ఫైజల్.. లక్షద్వీప్ లోక్​సభ నియోజకవర్గం నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించేవారు. 2009 సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్ర మాజీ మంత్రి అల్లుడు, కాంగ్రెస్ నాయకుడు అయిన మహ్మద్ సలీహ్​పై ఫైజల్​తోపాటు మరికొందరు దాడి చేశారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఫలితంగా దీనిపై కేసు నమోదై కోర్టులో సుదీర్ఘకాలం విచారణను ఎదుర్కొన్నారు ఫైజల్.

అయితే 2023 జనవరి 10న కవరట్టి సెషన్స్ కోర్టు మహ్మద్​ ఫైజల్​ను దోషిగా తేల్చుతూ తీర్పు నిచ్చింది. దీంతో ఫైజల్​కు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది దిగువ కోర్టు. ఈ తీర్పు వెలువడిన వెంటనే.. జనవరి 13న ఫైజల్​పై అనర్హత వేటు వేస్తున్నట్లు లోక్​సభ సచివాలయం ఓ నోటిఫికేషన్​ విడుదల చేసింది. దోషిగా తేలిన రోజు నుంచే ఆయనపై చర్యలు అమల్లోకి వస్తాయని లోక్​సభ తెలిపింది. అనర్హత వేటుతో ఖాళీ అయిన లక్షద్వీప్ లోక్​సభ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరిపేందుకు.. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా​ విడుదల చేసింది.

అయితే.. హత్యాయత్నం కేసులో దోషిగా తేల్చడాన్ని, శిక్ష విధించడాన్ని సవాలు చేస్తూ మహ్మద్​ ఫైజల్​ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన కేరళ హైకోర్టు ఈ ఏడాది జనవరి 25న తన తీర్పును వెల్లడించింది. ఫైజల్​ తన పిటిషన్​లో కోరినట్టుగా హత్యాయత్నం కేసులో ఆయన్ను దోషిగా తేల్చడాన్ని, శిక్ష విధించడాన్ని నిలుపుదల చేస్తూ స్టే విధించింది కేరళ హైకోర్టు. ఈ కోర్టు తీర్పు ఫలితంగా ఫైజల్​పై పడిన అనర్హత వేటును లోక్​సభ తొలగించాలి. కానీ లోక్​సభ ఆయనపై ఉన్న అనర్హత వేటును తొలగించలేదు. దీంతో ఫైజల్​ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఫైజల్​ను దోషిగా తేల్చడంపై స్టే ఇచ్చి, అనర్హత వేటు వర్తించదని కేరళ హైకోర్టు స్పష్టం చేసిన తర్వాత.. కేంద్ర ఎన్నికల సంఘం లక్షద్వీప్ ఉపఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అయితే.. ఫైజల్​ సభ్యత్వాన్ని మాత్రం ఇంకా లోక్​సభ పునరుద్ధరించకపోవడం గమనార్హం. దోషిగా తేలిన వెంటనే అనర్హత వేటు పడుతుందని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టం చేస్తుంటే.. ప్రజాప్రతినిధిని దోషిగా తేల్చడంపై స్టే విధిస్తే.. అనర్హత వేటు వర్తించదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి సందిగ్ధతల నడుమ.. ఇప్పుడు రాహుల్​ గాంధీ అపీల్​కు వెళ్తే ఏం జరుగుతుందో అని సర్వత్రా ఆసక్తికరంగా మారింది.

రాహుల్​ గాంధీపై ప్రభావమెంత?
కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ అయిన రాహుల్​ గాంధీపై లోక్​సభ సచివాలయంలో అనర్హత వేటు పడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసి, పరువు నష్టం కేసులో సూరత్​ కోర్టు రాహుల్​ గాంధీకు రెండేళ్లు జైలుశిక్ష విధించింది. కోర్టు తీర్పు ఆధారంగా రాహుల్​ గాంధీ లోక్​సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు లోక్​సభ సచివాలయం ఓ నోటీఫికేషన్​ విడుదల చేసింది. తీర్పు వెలువడిన మార్చి 23నే రాహుల్ గాంధీ ఎంపీ పదవికి అనర్హుడైనట్లు ఓ ప్రకటనలో ద్వారా తెలియజేసింది.

Last Updated : Mar 27, 2023, 1:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.