ETV Bharat / bharat

గోవా టూర్​ వెళ్లిన కుర్రాళ్లకు బిగ్ షాక్.. హింసించి, అర్ధనగ్న వీడియోలు తీసి..

author img

By

Published : Jun 1, 2022, 3:22 PM IST

Youth robbed in Goa: గోవా పర్యటనకు వెళ్లిన 11 మంది యువకులకు చేదు అనుభవం మిగిలింది. కొందరు దుండగులు వీరిని అడ్డగించి.. అర్ధనగ్న వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డారు. డబ్బులు, బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు.

youth robbed in Goa
youth robbed in Goa

Youth robbed in Goa: హాయిగా ఎంజాయ్ చేసి వద్దామని ఎన్నో ఆశలు పెట్టుకొని గోవాకు వెళ్లిన కొందరు యువకులకు తీవ్ర నిరాశ ఎదురైంది. గోవా నుంచి తిరిగి వస్తుండగా కొందరు దుండగులు యువకులను అడ్డగించి లూటీ చేశారు.
ఏమైందంటే...?: మహారాష్ట్ర కొల్హాపుర్ జిల్లాలోని చాంద్​గడ్ తాలుకాకు చెందిన 11 మంది యువకులు రెండ్రోజుల క్రితం గోవాకు వెళ్లారు. గోవాలోని వివిధ పర్యటక ప్రదేశాలను, వాటి అందాలను ఆస్వాదించారు.

తిరుగుపయనమైన యువకులను.. గోవా సమీపంలోని బాడుగేశ్వర్ మందిరం వద్ద కొందరు వ్యక్తులు అడ్డగించారు. తమ హోటల్​లో మంచి భోజనం పెట్టిస్తామని చెప్పి వీరిని తీసుకెళ్లారు. అనంతరం ఓ గదిలో బంధించారు. యువకుల దుస్తులు విప్పేసి కొట్టారు. అర్ధనగ్నంగా ఉన్న యువకుల వీడియోలు తీసి బ్లాక్​మెయిల్ చేశారు. డబ్బులు, మొబైల్ ఫోన్లు, బంగారపు ఉంగరాలు, చైన్లు లాగేసుకున్నారు. వీడియోలను ఆన్​లైన్​లో పెడతామని బెదిరించారు.

స్వస్థలానికి తిరిగివచ్చిన తర్వాత రెండ్రోజులు భయంభయంతో గడిపిన యువకులు.. అనంతరం పోలీసులను ఆశ్రయించారు. చాంద్​గడ్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. తమకు రక్షణ కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.