ETV Bharat / bharat

తీగ లాగితే కదిలిన డొంక.. రూ.1300 కోట్ల విలువైన డ్రగ్స్​​​ సీజ్​

author img

By

Published : May 1, 2022, 7:27 PM IST

Heroin seized in UP
రూ.1300 కోట్లు విలువైన డ్రగ్స్​​​ సీజ్​

Heroin seized in UP: ఉత్తర్​ప్రదేశ్​లోని ముజఫర్​నగర్​లో భారీగా హెరాయిన్​ పట్టుకున్నారు అధికారులు. దాని విలువ అంతర్జాతీయ మార్కెట్లు సుమారు రూ.1300 కోట్లుగా ఉంటుందని తెలిపారు. మూడు రోజుల క్రితం దిల్లీలో పట్టుబడిన మత్తుపదార్థాల కేసు విచారణంలో.. యూపీ విషయం బయటపడినట్లు చెప్పారు.

Heroin seized in UP: మాదకద్రవ్యాల ముఠాపై గుజరాత్​ ఏటీఎస్​ ఉక్కుపాదం మోపుతోంది. కొద్ది రోజులుగా వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేస్తూ కోట్ల రూపాయలు విలువ చేసే మత్తు పదార్థాలను పట్టుకుంది. తీగ లాగితే డొంక కదిలినట్లు తాజాగా ఓ నిందితుడిని విచారించగా.. భారీగా మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఉత్తర్​ప్రదేశ్​, ముజఫర్​నగర్​ జిల్లా మొహళ్ల కిద్వాయినగర్​ ప్రాంతంలో గుజరాత్​ ఏటీఎస్​ తనిఖీలు చేపట్టింది. సుమారు రూ.1300 కోట్ల విలువైన హెరాయిన్​ పట్టుకుంది.

ఇదీ జరిగింది: మూడు రోజుల క్రితం దిల్లీ షాహీన్​బాగ్​లో అఫ్గానిస్థాన్​ నుంచి నగరానికి వచ్చిన 97 కిలోల హెరాయిన్​ సహా రూ.30 లక్షల నగదు స్వాధీనం చేసుకుంది ఎన్​సీబీ. ఈ కేసులో ఖైరానాకు చెందిన అహ్మద్​, ఇద్దరు అఫ్గానిస్థానీలను అరెస్ట్​ చేసింది. అహ్మద్​ను విచారించగా.. ఉత్తర్​ప్రదేశ్​లోని ముజఫర్​నగర్​కు చెందిన హైదర్​ పేరు బయటకు వచ్చింది. దీంతో హైదర్​ను అదుపులోకి తీసుకుని విచారించాయి ఎన్​సీబీ, గుజరాత్​ ఏటీఎస్​. ఈ క్రమంలో ముజఫర్​నగర్​లోని తన ఇంటిలో డ్రగ్స్​ దాచినట్లు ఒప్పుకున్నాడు నిందితుడు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు కిద్వాయి నగర్​కు ఓ టీమ్​ వెళ్లి అతడి ఇంట్లో సోదాలు నిర్వహించగా.. భారీగా డ్రగ్స్​ బయటపడ్డాయి. హైదర్​తో పాటు ఇమ్రాన్​ అనే వ్యక్తి ఈ కేసులో ఉన్నట్లు తెలిసింది.

హైదర్​ అలియాస్​ చున్ను 30 ఏళ్ల క్రితం పెయింటర్​గా పని చేసేవాడు. 20 ఏళ్ల క్రితం దిల్లీకి వెళ్లి ఓ దొంగతనం కేసులో జైలుకు వెళ్లివచ్చాడు. ఆ తర్వాత షాహీన్​బాగ్​లో నివాసం ఉంటున్నాడు. మాదకద్రవ్యాలు విక్రయిస్తూ కొన్నేళ్లలోనే మిలియనీర్​గా అవతరించాడు. కిద్వాయి నగర్​లో విలాసవంతమైన ఓ ఇంటిని నిర్మించాడు. ఇటీవల గుజరాత్​ తీరంలో పట్టుకున్న డ్రగ్స్​ కేసులోనూ హైదర్​ పేరు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చూడండి: రూ.1439 కోట్ల విలువైన హెరాయిన్​ పట్టివేత

భారత్​లో పట్టుబడే డ్రగ్స్​ వెనుక ఉగ్రవాదం ఉందా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.