ETV Bharat / bharat

భారత్​లో పట్టుబడే డ్రగ్స్​ వెనుక ఉగ్రవాదం ఉందా?

author img

By

Published : Apr 29, 2022, 4:15 PM IST

Narco Terrorism Module In India: దేశంలో డ్రగ్స్​ వాడకం రోజురోజుకు పెరిగిపోతోంది. డ్రగ్స్​కు అతిపెద్ద మార్కెటైన భారత్​ను.. ఉగ్రవాదానికి పావులా వాడుకుంటున్నాయి. భారత్​లో డ్రగ్స్​ విక్రయించగా వచ్చిన ఆదాయాన్ని సంఘవిద్రోహ కార్యకలాపాలకు వినియోగిస్తున్నాయి ఉగ్రవాద సంస్థలు. దేశంలో డ్రగ్స్​ వినియోగం పెరగడం వెనుక ఉగ్రవాద సంస్థల హస్తం ఉందటున్నారు ఎన్సీబీ డైరెక్టర్ జనరల్ ఎస్​ఎన్​ ప్రధాన్.

Narco Terrorism Module In India
Narco Terrorism Module In India

ఇవన్నీ దేశంలో తాజాగా డ్రగ్స్ పట్టుబడిన ఘటనలు.. ఇంతలా డ్రగ్స్​ లభ్యమవడం వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా? ఏదైనా మాఫియా ఉందా? లేక ఉగ్రవాదం ఉందా? అన్న ప్రశ్నలు తలెత్తుతుండగా.. అవుననే సమాధానం ఇస్తున్నారు మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్​సీబీ) డైరెక్టర్ జనరల్ ఎస్​ఎన్​ ప్రధాన్. తాజాగా జరుగుతున్న ఘటనలు నార్కో టెర్రరిజానికి (మాదక ద్రవాల ఉగ్రవాదం) అవకాశం ఉందంటున్నారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల నెట్‌వర్క్‌ను తొలగించడానికి పటిష్ఠమైన చట్టాన్ని అమలు చేయాల్సి ఉందని ఉద్ఘాటించారు.

దేశంలో మాదక ద్రవ్యాల వినియోగం అధికం కావడం వల్ల దానిని ఆసరాగా తీసుకుంటున్నాయి ఉగ్రవాద సంస్థలు. డ్రగ్స్​ను పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేసి భారత్​కు సరఫరా చేస్తున్నాయి. దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తున్నాయి. ఈ డ్రగ్స్​ కేసుల్లో పట్టుబడుతున్న వారిలో పాకిస్థాన్, అఫ్గానిస్థాన్​ దేశాలకు చెందిన వారే అధికంగా ఉంటున్నారు. సముద్ర, భూ సరిహద్దు మార్గాల ద్వారా భారత్​లోకి అక్రమంగా డ్రగ్స్​ను రవాణా చేస్తున్నారు. వివిధ వస్తువుల్లో హెరాయిన్​ను దాచి అక్రమంగా భారత్​కు తరలిస్తున్నారు. ఇటీవల జరిగిన ఘటనలో భారత్​కు డ్రగ్స్​ను సరఫరా చేసే అఫ్గానిస్థాన్​ డ్రగ్స్​ రాకెట్​ను పట్టుకున్నారు అధికారులు. వీరి వద్ద నుంచి రూ. 30 లక్షల నగదు, 47 కిలోల మాదక ద్రవ్యాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.

"పాకిస్థాన్​, అఫ్గానిస్థాన్​ దేశాల నుంచి డ్రగ్స్ అక్రమంగా సరఫరా అవుతున్నాయి. ఆ దేశాలకు సంబంధించిన వ్యక్తులు పట్టుబడుతున్నారు. దీని వెనుక నార్కో టెర్రరిజానికి అవకాశం ఉంది. దీనిపై మరింత విచారణ చేయాల్సిన అవసరం ఉంది. గతంలో అఫ్గానిస్థాన్​లో తాలిబన్ల ఆధ్వర్యంలో నల్లమందు విరివిగా సాగు చేసేవారు. కానీ అఫ్గానిస్థాన్​లోని తాలిబన్​ ప్రభుత్వం ఇటీవలే నల్లమందు సాగుపై నిషేధాన్ని ప్రకటించింది. నిషేధాన్ని ముందే పసిగట్టిన ఉగ్రవాదులు.. విదేశాల్లో తయారుచేసి అక్రమ రవాణా చేస్తున్నారు."

-ఎస్​ఎన్​ ప్రధాన్, డైరెక్టర్ జనరల్ మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్సీబీ)

తాజాగా దిల్లీలోని షాహీన్​బాగ్​ అపార్ట్​మెంట్​లో ఏటీఎస్​ అధికారులు దాడి చేయగా సంచలన విషయాలు బయటపడ్డాయి. ఇక్కడ హెరాయిన్​ సరఫరా చేయడమే కాకుండా.. నల్లమందును ఉపయోగించి హెరాయిన్​ను తయారు చేస్తున్నారు. భారత్​ లాంటి పెద్ద మార్కెట్​ను లక్ష్యంగా పెట్టుకున్నారు ఉగ్రవాదులు. ఇక్కడ హెరాయిన్​ను విక్రయించగా వచ్చిన నగదును హవాలా రూపంలో దుబాయ్​కు తరలిస్తున్నారు. ఈ హవాలా డబ్బును అక్రమ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నారా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల గుజరాత్​ కాండ్లాలో భారీగా డ్రగ్స్​ లభ్యమయ్యాయి. దీనిలో కూడా ఏమైనా కుట్ర కోణం ఉందని ఆరా తీస్తున్నాయి దర్యాప్తు సంస్థలు.

drugs seized in shaheen bagh
పట్టుబడ్డ నగదు, మాదక ద్రవ్యాలు

దిల్లీలో 100 కోట్ల డ్రగ్స్ పట్టివేత: దిల్లీ షాహీన్​బాగ్​లోని ఓ అపార్ట్​మెంట్​లో భారీ మొత్తంలో హెరాయిన్​ను పట్టుకున్నారు ఏటీఎస్​ అధికారులు. అధికారులు తనిఖీల్లో 50 కిలోల హెరాయిన్​, 47 కిలోల మాదక ద్రవ్యాల పదార్థాలు, రూ. 30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ నుంచి పంజాబ్​, హరియాణా, ఉత్తరప్రదేశ్​, ఉత్తరాఖండ్​ రాష్టాలకు సరఫరా చేస్తున్నట్లు ఎన్​సీబీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఆపరేషన్స్) సంజయ్ కుమార్ సింగ్ తెలిపారు. తెలిపారు. అఫ్గానిస్థాన్​ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు.​ సముద్ర మార్గం, అట్టారీ-వాఘా సరిహద్దు నుంచి అక్రమంగా దిగుమతి చేసుకుంటున్నట్లు వెల్లడించారు. డ్రగ్స్​ను బ్యాగుల్లో, ఈ కామర్స్ సంస్థల ప్యాకెట్లలో దాచినట్లు చెప్పారు. మాదక ద్రవ్యాల పదార్థాలను పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపినట్లు తెలిపారు.

ఇదీ చదవండి: శివసేన ర్యాలీలో ఉద్రిక్తత.. రెండు వర్గాల రాళ్ల దాడులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.