ETV Bharat / bharat

యువ వైద్యురాలు అనుమానాస్పద మృతి.. చేతికి ఇంజెక్షన్​!

author img

By

Published : Jul 11, 2022, 4:19 PM IST

http://10.10.50.85//maharashtra/11-July-2022/mh-kop-02-doctor-suicide-story-2022-7204450_11072022093559_1107f_1657512359_196.jpg
http://10.10.50.85//maharashtra/11-July-2022/mh-kop-02-doctor-suicide-story-2022-7204450_11072022093559_1107f_1657512359_119.jpg

భావితరాలకు వైద్య సేవలు అందించాల్సిన ఓ యువ వైద్యురాలు.. అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. బాధితురాలి చేతికి ఇంజెక్షన్​ గుచ్చి ఉండడం వల్ల ఆమె ఓవర్​డోస్​ ఇంజెక్షన్​తో ఆత్మహత్య చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని కొల్హాపుర్​లో జరిగింది.

మహారాష్ట్రలోని కొల్హాపుర్​లో యువవైద్యురాలి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. వైద్యురాలి మృతదేహానికి ఇంజెక్షన్​ గుచ్చి ఉండడం వల్ల పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఓవర్​డోస్​ ఇంజెక్షన్​ తీసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

పోలీసుల వివరాలు ప్రకారం.. కొల్హాపుర్​కు చెందిన గైనకాలజిస్ట్​ డా. ప్రవీణ్​ చంద్ర హెంద్రే కుమార్తె డా.అపూర్వ హెంద్రే(30).. స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రిలో ప్రాక్టీస్​ చేస్తోంది. శనివారం రాత్రి ఆమె ఓ కార్యక్రమానికి హజరై కాస్త ఆలస్యంగా ఇంటికి చేరుకుంది. అనంతరం కాసేపటికే మళ్లీ బయటకు వెళ్లింది. కానీ ఈ సారి వెళ్లేటప్పుడు ఇంటి తలుపులకు బయట నుంచి తాళం వేసుకుని వెళ్లింది. వెంటనే గమనించిన తల్లిదండ్రులు.. పెరటి ద్వారం ద్వారా బయటకు వచ్చి రాత్రంతా ఆమె కోసం వెతికారు. ఎక్కడా ఆమె ఆచూకీ లభించలేదు.

DOCTOR COMMITS SUICIDE
మృతి చెందిన యువవైద్యురాలు

చేసేదేం లేక ఆదివారం ఉదయం.. అపూర్వ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి బయలుదేరాడు. ఈ లోపల ఆయనకు ఓ కాల్​ వచ్చింది. ' మీ కుమార్తె నడిరోడ్డుపై విగతజీవిగా పడి ఉంది' అని ఎవరో ఫోన్​లో చెప్పారు. వెంటనే అతడు పోలీసుల దగ్గరకు వెళ్లి విషయాన్ని చెప్పి.. వారితో ఘటనాస్థలికి చేరుకున్నాడు. ఆ సమయంలో ఆమె చేతికి ఇంజెక్షన్​ గుచ్చి ఉంది. వెంటనే ఆమెను స్థానికంగా ఉన్న సీపీఆర్​ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధరించారు. దాంతోపాటు అపూర్వ హ్యాండ్​బాగ్​లో మెడిసిన్​ బాటిల్​, మరో రెండు ఇంజెక్షన్లు కూడా లభ్యమవ్వడం వల్ల పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.

అసలు ఆ మెడిసిన్​ ఏంటి? ఓవర్​ డోస్​ ఇంజెక్షన్​ తీసుకోవడం వల్లనే ఆమె చనిపోయిందా? లేక ఎవరైనా హత్య చేశారా? అనే పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ప్రస్తుతానికి పోలీసులు.. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. భవిష్యత్తు తరాలకు వైద్య సేవలు అందించాల్సిన యువ వైద్యురాలు మృతి చెందడం వల్ల ఆమె కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇవీ చదవండి: హిందువుకు ముస్లింల అంత్యక్రియలు.. బక్రీద్ రోజు వెల్లివిరిసిన మతసామరస్యం

పన్నీర్​సెల్వంకు షాక్.. పార్టీ నుంచి బహిష్కరణ.. పళనిస్వామికి పగ్గాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.