ETV Bharat / bharat

కారులో DMK మాజీ ఎంపీ దారుణ హత్య.. అల్లుడే స్నేహితులతో కలిసి..

author img

By

Published : Dec 30, 2022, 7:50 PM IST

Updated : Dec 30, 2022, 9:25 PM IST

డీఎంకే మాజీ ఎంపీ మస్తాన్ కొద్దిరోజుల క్రితం మరణించారు. అయితే ఆయనది సహజమరణం కాదని.. హత్య అని పోలీసుల విచారణలో తేలింది. ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.

former mp masthan murder case
మస్తాన్ హత్య కేసు

డీఎంకే మాజీ ఎంపీ మస్తాన్ కారులో వస్తుండగా ఇటీవలే మరణించారు. అయితే అది సాధారణ మరణంగా అందరూ భావించారు. కానీ పోలీసుల విచారణలో మస్తాన్​ది హత్యగా తేలింది. డబ్బుల లావాదేవీల విషయంలో గొడవ వల్ల మస్తాన్​ను​.. ఆయన తమ్ముడి అల్లుడు ఇమ్రాన్​తో పాటు మరో నలుగురు కలిసి ఈ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు.. నజీర్​, ఇమ్రాన్ భాషా, తౌఫిక్ అహ్మద్​, లోకేశ్​, తమీమ్​లను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు.

ఇదీ జరిగింది..
డిసెంబరు 22న తన కుమారుడి వివాహానికి పార్టీ నేతలు, పలువురు ప్రముఖులను ఆహ్వానించేందుకు మస్తాన్(66) తన కారులో తిరుచ్చి వెళ్లాడు. మస్తాన్​ వెంట అతని తమ్ముడి అల్లుడు ఇమ్రాన్​, డ్రైవర్ లోకేశ్ ఉన్నారు. ఇంటి తిరిగి వచ్చే సమయంలో ఇమ్రాన్​ తన స్నేహితులతో కలిసి మస్తాన్​ను గొంతు నులిమి హత్య చేశాడు. ఈ హత్యను సహజ మరణంగా చిత్రీకరించేందుకు మస్తాన్​కు ఛాతీలో నొప్పి వచ్చిందని గుడవంచెరిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మస్తాన్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రస్తుతం మస్తాన్​.. తమిళనాడు మైనారిటీ కమిషన్ వైస్​ ఛైర్మన్​గా ఉన్నారు.

former mp masthan murder case
మస్తాన్​ను హత్య చేసిన నిందితులు

తన తండ్రి మృతిపై అనుమానం ఉందంటూ మస్తాన్‌ కుమారుడు.. గుడవంచెరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితులను పట్టుకున్నారు. మస్తాన్ వద్ద నుంచి ఇమ్రాన్.. డబ్బులను అప్పుగా తీసుకున్నాడని తెలిపారు. ఈ డబ్బులను తిరిగి ఇమ్మని అడిగినందుకు తన స్నేహితులతో కలిసి మస్తాన్​ను ఇమ్రాన్ హత్య చేసినట్లు వెల్లడించారు.

"పోస్టుమార్టం నివేదికలో మస్తాన్ శరీరంపై గాయాలున్నట్లు తేలింది. గొంతునులిమి ఊపిరాడకుండా చేసినట్లు వెల్లడైంది. అలాగే మస్తాన్​తో కారులో ప్రయాణించిన అతని తమ్ముడి అల్లుడు ఇమ్రాన్ వాంగ్మూలం అనుమానాస్ఫదంగా ఉంది. మస్తాన్​.. ఛాతీ నొప్పితో మరణించినట్లు ఇమ్రాన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు.. కానీ ఊపిరాడక చనిపోయినట్లు శవపరీక్షలో తేలింది. అందుకే అనుమానం వచ్చి ఇమ్రాన్ కాల్​డేటాను పరిశీలించి అతడి స్నేహితులను అరెస్ట్ చేశాం. ఇమ్రాన్​ సహా అతని స్నేహితులు కలిసి మస్తాన్​ను గాయపరిచి కారులోనే గొంతు నులిమి హత్య చేశారు."

--పోలీసులు

Last Updated :Dec 30, 2022, 9:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.