ETV Bharat / bharat

Central Railway Recruitment 2023 : రైల్వేలో స్పోర్ట్స్ కోటా జాబ్స్.. మేనేజర్ ఉద్యోగాలు కూడా.. అప్లై చేశారా?

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 21, 2023, 11:32 AM IST

Central Railway Recruitment 2023 : సెంట్రల్‌ రైల్వేలో వివిధ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌. కేవలం 10వ తరగతి అర్హతతోనే ఈ ఉద్యోగాలు భర్తీ చేయనుంది. అదే విధంగా నేషనల్​ స్మాల్​ ఇండస్ట్రీస్​ కార్పోరేషన్ కూడా తమ సంస్థలో వివిధ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

central-railway-recruitment-2023-and-nsic-recruitment-2023
సెంట్రల్ రైల్వే ఉద్యోగాలు 2023

Central Railway Recruitment 2023 : ముంబయిలోని సెంట్రల్‌ రైల్వే.. రైల్వే రిక్రూట్‌మెంట్‌ సెల్‌ ఆధ్వర్యంలో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 10వ తరగతి దీనికి కనీస అర్హతగా నిర్ణయించింది. స్పోర్ట్స్‌ కోటాలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది.

దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
మొత్తం 62 ఖాళీలున్నట్లు సెంట్రల్‌ రైల్వే ప్రకటించింది. ఈ ఉద్యోగాలు పూర్తిగా స్పోర్ట్స్‌ కోటాకు చెందినవి అని తెలిపింది. బ్యాడ్మింటన్‌, టేబుల్‌ టెన్నిస్‌, బాస్కెట్‌బాల్‌, బాడీబిల్డింగ్‌, సైక్లింగ్‌, హాకీ, ఖో-ఖో, పవర్‌లిఫ్టింగ్‌, స్విమ్మింగ్‌, వాటర్‌పోల్‌, అథ్లెటిక్స్‌ తదితర విభాగాలకు చెందిన క్రీడాకారులు ఈ ఉద్యోగాలకు అర్హులని పేర్కొంది.

విద్యార్హతలు..
సంబంధిత స్పెషలైజేషన్‌లో 10వ తరగతి/ ఐటీఐ/ 12వ తరగతి/ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత అయి ఉండాలి.

ఇతర విషయాలు..
వయసు 18-25 ఏళ్లు మధ్య ఉండాలి. ట్రయల్స్‌, ఇతర నిబంధనల ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఆన్‌లైన్‌ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేది.. 2023 అక్టోబర్​17.

ఎన్​ఎస్​ఐసీలో ఉద్యోగాలు..
NSIC Recruitment 2023 : మరోవైపు, భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్​ స్మాల్​ ఇండస్ట్రీస్​ కార్పొరేషన్.. తమ కంపెనీలో ఖాళీగా ఉన్న వివిధ రకాలు పోస్టులను భర్తీకి చేసేందుకు సిద్ధమైంది. అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు సైతం ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగాలను కనీస అనుభవం కూడా ఉండాలని చెప్పింది. ఈ ఉద్యోగ వివరాలు ఇలా ఉన్నాయి.

సంస్థలో మొత్తం 20 ఖాళీలు ఉన్నట్లు నేషనల్​ స్మాల్​ ఇండస్ట్రీస్ కార్పొరేషన్​ తెలిపింది. జనరల్​ మేనేజర్​, చీఫ్​ మేనేజర్​, డిప్యూటీ మేనేజర్​ స్థాయిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అభ్యర్థులు ఎల్​ఎల్​బీ/ బీఈ/ బీటెక్​/ గ్రాడ్యుయేషన్​/ సీఏ/ సీఎంఏ/ ఎంబీఏ చదివి ఉండాలని పేర్కొంది.

కనీసం మూడు నుంచి ఏడేళ్ల పని అనుభవం ఉండాలని తన ఉద్యోగ నోటిఫికేషన్​లలో సూచించింది నేషనల్​ స్మాల్​ ఇండస్ట్రీస్​ కార్పొరేషన్​. వయసు మాత్రం 31-47 మధ్య ఉండాలని పేర్కొంది. మొదట రాత పరీక్ష నిర్వహించి.. తరువాత పర్సనల్​ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు పేర్కొంది. దరఖాస్తు ఫీజు రూ.1500గా నిర్ణయించింది ఎన్​ఎస్​ఐసీ. ఆన్​లైన్​, ఆఫ్​లైన్​ రెండు విధాలుగా ఉద్యోగానికి దరఖాస్తు చేయోచ్చని వెల్లడించింది. దరఖాస్తుకు చివరి తేది.. 2023 అక్టోబర్​ 6.

NFC Apprentice Jobs : ఐటీఐ అర్హతతో.. హైదరాబాద్​లోని ఎన్​ఎఫ్​సీలో అప్రెంటీస్​ జాబ్స్​.. అప్లై చేసుకోండిలా!

RBI Assistant Notification 2023 : డిగ్రీ అర్హతతో.. ఆర్​బీఐలో 450 అసిస్టెంట్​ ఉద్యోగాలు.. అప్లై చేసుకోండిలా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.