ETV Bharat / bharat

NFC Apprentice Jobs : ఐటీఐ అర్హతతో.. హైదరాబాద్​లోని ఎన్​ఎఫ్​సీలో అప్రెంటీస్​ జాబ్స్​.. అప్లై చేసుకోండిలా!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 18, 2023, 10:28 AM IST

NFC RECRUITMENT 2023
NFC Apprentice Jobs 2023

NFC Apprentice Jobs : హైదరాబాద్​లోని న్యూక్లియర్​ ఫ్యూయల్​ కాంప్లెక్స్​ (NFC) 206 అప్రెంటీస్​ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు సెప్టెంబర్​ 30లోపు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు తదితర పూర్తి వివరాలు మీ కోసం..

NFC Apprentice Jobs : ఐటీఐ చేసి ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. భారత అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్​లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కంప్లెక్స్​ (NFC) 206 అప్రెంటీస్ ఖాళీల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్​ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు వివిధ విభాగాలు/ ట్రేడ్​ల్లో ఏడాదిపాటు అప్రెంటీస్​ శిక్షణ ఇస్తుంది.

ఖాళీల వివరాలు

  • ఫిట్టర్​ - 42
  • టర్నర్​ - 32
  • లేబరేటరీ అసిస్టెంట్​ (కెమికల్ ప్లాంట్​) - 6
  • ఎలక్ట్రీషియన్​ - 15
  • మెషినిస్ట్​ - 16
  • మెషినిస్ట్ (గ్రైండర్​) - 8
  • అటెండెంట్ ఆపరేటర్​ (కెమికల్ ప్లాంట్​) - 15
  • కెమికల్ ప్లాంట్ ఆపరేటర్​ - 14
  • ఇన్​స్ట్రుమెంట్​ మెకానిక్​ - 7
  • స్టెనోగ్రాఫర్​ (ఇంగ్లీష్​) - 2
  • కంప్యూటర్ ఆపరేటర్​ అండ్ ప్రోగ్రామింగ్​ అసిస్టెంట్​ - 16
  • వెల్డర్ - 16
  • మెకానిక్ (డీజల్)​ - 4
  • కార్పెంటర్​ - 6
  • ప్లంబర్​ - 4
  • మొత్తం - 206 పోస్టులు

విద్యార్హతలు
NFC Apprentice Qualification : అభ్యర్థులు 10వ తరగతితో పాటు సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి
NFC Apprentice Age Limit : అభ్యర్థుల వయస్సు అప్లికేషన్​ చివరి తేదీ​ నాటికి 18 ఏళ్ల కంటే తక్కువ ఉండరాదు.

దరఖాస్తు రుసుము
అభ్యర్థులు.. అప్రెంటీస్​ పోస్టులకు ఎలాంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎంపిక విధానం
NFC Apprentice Selection Process : అభ్యర్థులను 10వ తరగతి, ఐటీఐలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అయితే ఎలక్ట్రీషియన్​, వెల్డర్​ ట్రేడ్​లకు మాత్రం ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేయడం జరుగుతుంది. ఇలా ఎంపికైన అభ్యర్థులకు ఈ -మెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు. వీరు అప్రెంటీస్​ ట్రైనింగ్​లో చేరేటప్పుడు కచ్చితంగా మెడికల్ ఫిట్​నెస్ సర్టిఫికేట్​ను సమర్పించాల్సి ఉంటుంది.

ట్రైనింగ్​ పీరియడ్​
ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్​లోని ఎన్​ఎఫ్​సీలో ఒక ఏడాది పాటు అప్రెంటీస్​ శిక్షణ అందిస్తారు.

స్టైపెండ్​
NFC Apprentice Salary : అప్రెంటీస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.7,700 నుంచి రూ.8,050 చొప్పున స్టైపెండ్ అందిస్తారు.

దరఖాస్తు విధానం
ఆసక్తి గల అభ్యర్థులు నేషనల్​ అప్రెంటీస్​షిప్​ ప్రమోషన్​ స్కీమ్​ (NAPS) అధికారిక వెబ్​సైట్​ https://www.apprenticeshipindia.gov.in/ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు
NFC Apprentice Application Last Date : ఆన్​లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ 2023 సెప్టెంబర్ 30

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.