ETV Bharat / bharat

Best 5 Train Ticket Booking Apps : ఆన్​లైన్​లో ట్రైన్ టికెట్స్.. బెస్ట్ యాప్స్ ఇవే!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 28, 2023, 12:45 PM IST

Best 5 Online Train Ticket Booking Apps : జనాలు కౌంటర్​లో ట్రైన్​ టికెట్స్​ రిజర్వ్​ చేసుకోవడం మాగ్జిమమ్ తగ్గించేశారు. ఫోన్​ ఓపెన్ చేసి.. టికెట్స్ బుక్ చేసేస్తున్నారు. మరి, ఏ యాప్స్​లో బుక్ చేస్తున్నారు..? ది బెస్ట్ యాప్స్ ఏంటి..??

Train Ticket Booking Apps
Best 5 Train Ticket Booking Apps

Best 5 Apps for Booking Train Tickets Online : దూర ప్రాంతాలకు ట్రైన్ ప్రయాణం అంటే ముందస్తు అప్రమత్తత కంపల్సరీ. టికెట్స్ లభిస్తే సరి.. లేదంటే నానా అవస్థలు పడాల్సిందే. అందుకే.. ఫోన్​ ద్వారానే టికెట్ బుక్ చేసుకునేందుకు యాప్స్ వచ్చేశాయి. మరి, అందులో సూపర్ యాప్స్ (Train Ticket Booking Apps)​ గురించి ఈ స్టోరీలో చూద్దాం.

IRCTC రైల్ కనెక్ట్(IRCTC Rail Connect) : IRCTC అనేది భారతీయ రైల్వే అధికారిక యాప్. ఈ యాప్ 100% నమ్మదగినది. మీ ఫోన్​ నుంచే వేగంగా సులభంగా రైలు టికెట్లను బుకింగ్, రద్దు చేసుకోవచ్చు. అలాగే PNR చెకప్, యాప్ ద్వారా రైలు ఎక్కడుందో ట్రాక్ చేయవచ్చు. అలాగే ఈ యాప్ IRCTC ఎయిర్, IRCTC టూరిజం కోసం టికెట్లను బుక్ చేసుకోవడం వంటి అదనపు సౌకర్యాలను కూడా అందిస్తోంది. మీ కోచ్ వివరాలు, బెర్త్ నంబర్‌ను ఎంచుకోవడం ద్వారా ఆహారాన్ని కూడా ఆర్డర్ చేయవచ్చు.

How to Book IRCTC Tatkal Tickets : తత్కాల్ టికెట్లు.. ఎలా బుక్ చేయాలో తెలుసా..?

UTS(Unreserved Ticket Booking System) : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భారతీయ రైల్వే.. యూటీఎస్(అన్‌ రిజర్వ్‌డ్‌ టికెటింగ్‌ సిస్టమ్‌) అనే మొబైల్‌ యాప్‌ను తీసుకొచ్చింది. ఫోన్‌లోనే ఈ అప్లికేషన్‌ సాయంతో జనరల్‌ టికెట్లు, నెలవారీ సీజనల్‌ టికెట్లు, ప్లాట్‌ఫాం టికెట్లు బుక్‌ చేయొచ్చు, రద్దు చేయవచ్చు. ఇది లోకల్ రైళ్లలో ప్రయాణించే వారికి చాలా ఉపయోగకరం.

అయితే.. ఇందులో టికెట్లు బుక్ చేసుకోవడానికి మీరు మీ సమీప రైల్వే స్టేషన్‌కి నిర్దిష్ట పరిధిలో అంటే స్టేషన్‌ వెలుపల 5 కి.మీల పరిధిలో మాత్రమే టికెట్‌ తీసుకోవచ్చు. స్టేషన్‌ లోపల, రైల్లో ఉన్నప్పుడు కుదరదనే విషయం గుర్తుంచుకోవాలి. దీంట్లో మీ ప్రయాణం రోజునే టికెట్లు బుక్ చేసుకోవచ్చు.

ఇక్సిగో (Ixigo) : ఈ యాప్ ప్రత్యేక ఫీచర్ రైళ్ల స్మార్ట్ ట్రాకింగ్, లైవ్ అప్‌డేట్‌లను అందించడంగా చెప్పుకోవచ్చు. ఇక్సిగో ద్వారా కూడా సులువుగా రైలు టికెట్లను బుకింగ్, రద్దు చేసుకోవచ్చు. అలాగే.. ఇది ఎప్పటికప్పుడు రైలు లైవ్​ స్థితిని, ప్లాట్‌ఫారమ్ నంబర్‌లు, కోచ్ స్థానాల గురించి మీకు అప్‌డేట్‌లను అందిస్తోంది. ఈ యాప్ ద్వారా PNR స్టేటస్ తెలుసుకోవచ్చు. అలాగే ఇంటర్నెట్ లేనప్పుడు కూడా మీ రైలు నిజ-సమయ స్థితిని దీని ద్వారా కనుగొనవచ్చు.

How to Cancel IRCTC Train Tickets Online : ఐఆర్​సీటీసీలో.. ట్రైన్ టికెట్స్ రద్దు చేసుకోవడం ఎలా..?

రైలుయాత్రి(RailYatri) : ఈ రైలు యాత్రి యాప్ ప్రత్యేక ఫీచర్ రైళ్ల నిజ-సమయ GPS ట్రాకింగ్‌ను అందించడం. ఇది రైలు షెడ్యూల్‌లు, సీట్ల లభ్యత, నిజ-సమయ రైలు స్థితి గురించి సమాచారం, PNR ప్రిడిక్షన్ అందిస్తుంది. అలాగే దీంట్లో బస్సులను కూడా బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీ టికెట్ కన్ఫర్మ్ అవుతుందా లేదా అనేది, రైలు సమయానికి చేరుకుందా లేదా అనేది కూడా ఇది మీకు తెలియజేస్తుంది. దీంట్లోనూ ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు.

Make My Trip : ఈ యాప్ ద్వారా రైలు బుకింగ్‌లను మాత్రమే కాకుండా విమాన, హోటల్ బుకింగ్‌లను కూడా చేసుకోవచ్చు. ఇది రైళ్ల గురించి ముఖ్యమైన సమాచారాన్నంతా అందిస్తుంది. దీని సులభంగా టికెట్ బుకింగ్, రద్దులు, అప్​డేట్​లు చేసుకోవచ్చు. దీని ద్వారా మీరు కేవలం 2 నిమిషాల్లో రైలు టికెట్ పొందవచ్చు. అన్ని యాప్​ల మాదిరిగానే దీంట్లోనూ ఆహారాన్ని సులభంగా ఆర్డర్ చేయవచ్చు. లైవ్ ట్రైన్ స్టేటస్, PNR స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఇది మీ రైలు పూర్తి షెడ్యూల్‌ను అందిస్తుంది. మరో విషయం ఏమిటంటే, MakeMyTrip IRCTCతో పని చేస్తుంది. అంటే మీ రైలు టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ఇది కూడా సురక్షితమైనది, నమ్మదగినది.

పైన పేర్కొన్న యాప్​లన్నింటిలో టికెట్ బుకింగ్ చెల్లింపులు ఆర్‌-వ్యాలెట్‌, పేటీఎం వ్యాలెట్ లేదా ఇతర ఆన్‌లైన్‌ పేమెంట్‌ వ్యవస్థ(క్రెడిట్‌, డెబిట్‌ కార్డులు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, డిజిటల్‌ పేమెంట్‌ యాప్స్‌), ఇతర పద్ధతులను ఉపయోగించి పేమెంట్ చేయవచ్చు. అలాగే వీటితో పాటు రెడ్ రైల్, పేటీఎం లాంటి యాప్​లలో కూడా చాలా సులభంగా రైలు టికెట్లను బుక్ చేసుకునే సౌకర్యం అందుబాటులో ఉంది.

IRCTCలో రైలు టికెట్స్​ బుక్​ అవ్వట్లేదా.. అమెజాన్, పేటీఎంల్లో ట్రై చేయండి!

రైలు ప్రయాణం వాయిదా పడిందా? ఇలా చేస్తే క్యాన్సిలేషన్‌ ఛార్జీలు ఉండవ్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.