హైదరాబాద్​లో స్కూబా డైవింగ్ - ఎక్కడో తెలుసా? - Scuba Diving in Hyderabad

By ETV Bharat Telangana Team

Published : Apr 29, 2024, 9:26 AM IST

thumbnail

Scuba Diving in Hyderabad : సముద్ర అంతర్భాగంలో జీవులు ఎలా ఉంటాయో చూసే విధంగా హైదరాబాద్ కూకట్ పల్లిలో స్కూబా డైవింగ్​ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఒక రోజు 15 మంది ఈ డైవ్ చేసే విధంగా టనైల్ రూపొందించారు. దేశంలోనే మొదటిసారిగా డబుల్ డెక్కర్ వాటర్ ఫిషింగ్ టనైల్ కూడా ఈ ప్రదర్శనలో నిర్మాణం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పిల్లలకు విద్యతో పాటు విజ్ఞానం పెంపొందించే విధంగా సముద్ర జలాల్లో ఉండే చేపలు జీవరాసులను గురించి ప్రదర్శనలో తెలుసుకునే విదంగా ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. 

ఈ ప్రదర్శన 60 రోజుల పాటు కొనసాగుతుందని, ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే స్కూబా డ్రైవ్ కొనసాగుతుందని నిర్వాహకులు రాజారెడ్డి తెలిపారు. సింగపూర్, మలేషియా, దుబాయ్ తరహాలో ఈ టనైల్ నిర్మాణం ఏర్పాటు చేయబడిందని ఆయన చెప్పారు. స్కూబా డ్రైవ్ కోసం ముందుగా స్లాట్ బుక్ చేసుకునే అవకాశం కూడా ఉందన్నారు. ఈ ప్రదర్శన పూర్తిగా ఏసీతో కూడుకున్నదిగా, వేసవిలోనూ  సందర్శనకు అనుకూలంగా ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ ప్రదర్శనలో పలు దేశాలకు చెందిన పక్షులు సర్పాలు వంటివి కూడా వీక్షించేందుకు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.