మండుటెండలో పండుటాకుల పాట్లు- పింఛన్​ సొమ్ము అందక కన్నీళ్లతో ఇళ్లకు - Pensioners FACING PROBLEMS

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 1, 2024, 5:32 PM IST

thumbnail

Pension Beneficiaries Are Getting Facing to Problems: ప్రభుత్వ తీరుతో పింఛన్ లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సచివాలయం, బ్యాంకుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా పింఛన్ డబ్బులు చేతికి రావడంలేదని వృద్ధులు, వికలాంగులు వాపోతున్నారు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర నగర పంచాయతీ పరిధిలోని శివాపురం ప్రాంతంలోని వృద్ధులు, వికలాంగులు పింఛన్ కోసం రచ్చబండ వద్ద పడిగాపులు కాస్తున్నారు. నడవలేని, కనుచూపులేని వృద్ధులు పింఛన్ డబ్బు వస్తుందో రాదో అని ఆందోళన చెందుతున్నారు. రోజు గడుస్తున్నా పింఛన్ సొమ్ము ఇవ్వలేదని పింఛన్​దారులు మండిపడుతున్నారు. 

గంటల తరబడి రచ్చబండ వద్ద వేచి చూసినా పింఛన్ సొమ్ము ఇవ్వటానికి సచివాలయ సిబ్బంది రాకపోవడంతో కన్నీళ్లతో ఇళ్లకు వెనుదిరిగారు. పింఛన్ డబ్బులు మీదనే ఆధారపడి బతుకుతున్నామని వృద్ధులు చెప్పారు. ఎక్కడ పింఛన్ ఇస్తారో చెప్పకుండా తిప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫించను డబ్బులపైనే ఆధారపడి జీవిస్తున్నామని ప్రతినెల ఏదో ఒక కొత్త విధానం తెచ్చి తమను ఇబ్బంది పెట్టడం సరికాదని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.