నిర్మాణ కార్మికుల కోసం- కూటమి అధికారంలోకి రాగానే కన్‌స్ట్రక్షన్ అకాడమీ ఏర్పాటు : లోకేశ్ - Nara Lokesh met with workers

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 7, 2024, 7:40 PM IST

thumbnail

Nara Lokesh Met with Workers in Guntur District: మంగళగిరిలో నిర్మాణ కార్మికులకు మెరుగైన శిక్షణ కోసం కన్​స్ట్రక్షన్ అకాడమీ ఏర్పాటు చేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ హామి ఇచ్చారు. గుంటూరు జిల్లాలోని చిర్రావూరు, ప్రాతూరు, గుండిమెడ, పెదకొండూరు, గొడవర్రు గ్రామాలకు చెందిన బైక్ మెకానిక్​లు, ఇసుక ముఠా కార్మికులతో లోకేశ్​ భేటీ అయ్యారు. పాత ఇసుక విధానంతో నిర్మాణ రంగానికి గతవైభవం తెస్తామని అన్నారు. బైక్ మెకానిక్​లకు ఆధునాతన వాహనాలపై శిక్షణ అందిస్తామన్నారు. జగన్ పాలనలో మొదటి బాధితులు భవన నిర్మాణరంగం కార్మికులేనని వాపోయారు. పనుల్లేక వందలాది మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. గతంలో కార్మిక బోర్డు ద్వారా వివిధ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు. నేడు జగన్ పాలనలో కార్మిక బోర్డు నిధులు 2500 కోట్ల రూపాయలు పక్కదారి పట్టించారని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక కార్మిక సంక్షేమ బోర్డును ప్రక్షాళన చేయడంతో పాటు చంద్రన్న బీమా పథకం, పనిముట్లు అందజేస్తామని లోకేశ్​ భరోసా ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.