హన్మకొండలో క్రేజీ గర్ల్ - బైక్​పై డేంజరస్ స్టంట్స్​తో దడ పుట్టిస్తున్న లేడీ

By ETV Bharat Telangana Team

Published : Mar 8, 2024, 5:35 PM IST

thumbnail

Jetty Biker Girl Stunts Viral Video : నేటి కాలంలో యువతను ఊరిస్తున్న అంశం సోషల్ మీడియా క్రేజ్. ఇందుకోసం చాలా మంది నానా ప్రయత్నలు చేస్తున్నారు. కానీ సోషల్ ​మీడియాలో క్రేజ్ రావాలంటే మామూలు విషయం కాదు. ట్రెండింగ్ కోసం ఏదైనా కొత్తగా చేయాల్సిందే. అలా ప్రయత్నించి ఓవర్​నైట్ స్టార్స్ అయినవారు చాలా మంది ఉన్నారు. కొందరు కంటెంట్​ను నమ్ముకుంటే, మరికొందరు స్టంట్స్​తో అకట్టుకుంటున్నారు. వీటన్నింటిని రీల్స్, షార్ట్స్​ రూపంలో నెట్​లోకి వదులుతూ నానా హంగామా చేస్తున్నారు. 

Woman Bike Rider in Hanmakonda Stunts Video : తాజాగా హనుమకొండ జిల్లాకు చెందిన ఓ యువతి, సోషల్​ మీడియాలో క్రేజ్ కోసం బైక్​లపై దిమ్మతిరిగే స్టంట్స్ చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. సదరు యువతి వివిధ రకాల బైకులపై విన్యాసాలు చేస్తూ, వీడియోలను జెట్టీ బైకర్ ​గర్ల్ ఛానల్​లో అప్​లోడ్ చేస్తోంది. వీటిని చూసిన కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేయగా, మరికొందరు జాగ్రత్త బ్యూటీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ యువతి వృత్తిరీత్యా డాక్టర్ అని సమాచారం. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.