దాబాలో షార్ట్​ సర్క్యూట్​తో చెలరేగిన మంటలు - తప్పిన పెను ప్రమాదం - Fire Accident In Dhaba

By ETV Bharat Telangana Team

Published : Apr 5, 2024, 7:38 PM IST

thumbnail

Fire Accident In Dhaba : ఓ దాబాలో షార్ట్​ సర్క్యూట్ జరగడంతో భారీ ఎత్తున మంటలు చెలరేగిన ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదం కారణంగా ఎవరికీ ఎలాంటి గాయాలు కానప్పటికీ  రూ.లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లినట్లుగా సమాచారం.  

స్థానికుల వివరాల ప్రకారం వరంగల్ జిల్లా వరంగల్ మండలం బొల్లికుంటలోని వాగ్దేవి కళాశాల ఎదురుగా ఓ దాబా ఉంది. కస్టమర్లను ఆకర్షించాలనే ఉద్దేశంతో జేపీ దావత్​ను దాబా నిర్వాహకులు అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఇందులో భాగంగానే కంటైనర్ గదులను ఏర్పాటు చేశారు. మండుతున్న ఎండలకు తోడు విద్యుత్​ షార్ట్ సర్క్యూట్​ కావడంతో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి.  

 స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆదుపుచేశారు. సకాలంలో గ్యాస్​ సిలిండర్లు పేలకుండా నివారించగలిగారు. దాబాలో మంటలు చెలరేగిన ఘటనతో కస్టమర్లు, స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.