మద్యం మత్తులో మహిళపై దాడి, ఆపై కానిస్టేబుల్​పై పిడిగుద్దులు - వ్యక్తిపై కేసు నమోదు

By ETV Bharat Telangana Team

Published : Mar 11, 2024, 4:51 PM IST

thumbnail

Drunken Man Fight with Police in Hyderabad  : మద్యం మత్తులో ఓ వ్యక్తి ఓ హోటల్ యజమానురాలిపై, అడ్డు వచ్చిన పోలీస్ కానిస్టేబుల్‌పై దాడి చేసిన ఘటన హైదరాబాద్‌ కేపీహెచ్​బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 10వ తేదీన రాత్రి జలవాయు విహార్ రోడ్డులోని సిరి టిఫిన్స్ సెంటర్ దగ్గరకు రాజు యాదవ్ అనే వ్యక్తి మద్యం సేవించి వచ్చాడు. తనకు టిఫిన్ ఉచితంగా పెట్టాలని, హోటల్ యజమానురాలు కుమారిని డిమాండ్ చేశాడు.

కుమారి అందుకు నిరాకరించడంతో, ఆమెను దుర్భాషలాడుతూ హెల్మెట్​తో దాడి చేశాడు. దీంతో ఆమె 100కు డయల్ చేసి ఫిర్యాదు చేసింది. వెంటనే అక్కడికి చేరుకున్న కానిస్టేబుల్ శశికాంత్, రాజు యాదవ్​ను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. మద్యం మత్తులో ఉన్న రాజు యాదవ్ కానిస్టేబుల్​పై పిడి గుద్దులు కురిపించాడు. అతి బలవంతం మీద రాజు యాదవ్‌ను అడ్డుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.