కాలినడకన పది కిలోమీటర్లు డోలీలో గర్భిణీని మోసుకెళ్లిన సీఆర్​పీఎఫ్ జవాన్లు

By ETV Bharat Telangana Team

Published : Feb 10, 2024, 7:13 PM IST

thumbnail

CRPF Jawans Helps Pregnant Lady : సీఆర్​పీఎఫ్ జవాన్లు​ విధులతో పాటు మంచి మనసు ఉందని నిరూపించుకుంటున్నారు. ప్రసవ వేదనతో బాధపడుతున్న గర్భిణీని పది కిలోమీటర్లు డోలీలో కాలినడకన మోసుకువచ్చి అంబులెన్స్​ దగ్గరకి చేర్చారు. అనంతరం ఆమెను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి వైద్య సిబ్బంది తీసుకెళ్లింది. ఛత్తీస్​​గఢ్​లోని నక్సల్స్ ప్రభావిత దంతేవాడలో సీఆర్​పీఎఫ్(CRPF)​ జవాన్లు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో వారు మారుమూల గ్రామమైన లోహాకు చేరుకున్నారు. అక్కడ ఓ గర్బిణీ ప్రసవ వేదనతో బాధపడడం గమనించారు. వెంటనే ఆమెకు సైనికులు సాయం చేశారు. 

CRPF Polices Carry Pregnant Woman : సైనికులు గర్బిణీ కోసం డోలీ​ తయారు చేసి ఆమెను ప్రధాన రహదారి వద్దకు తీసుకువచ్చారు. ఈ ప్రయాణంలో వారు పది కిలోమీటర్లు డోలీని మోసుకుంటూ కాలినడకన వచ్చారు. ప్రధాన రహదారిపై అంబులెన్స్​లో ఎక్కించి దగ్గరగా ఉన్న కిరండూల్‌ ఆస్పత్రికి తరలించారు. ఓ వైపు ప్రాణాలకు తెగించి మావోయిస్టులతో పోరాటం చేస్తూ, మరోవైపు మానవతా దృక్పథాన్ని చాటుకున్నారని స్థానికులు ప్రశంసించారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.