పంటలకు సాగునీరందించాలని బీఆర్ఎస్ నాయకుల ధర్నా- గంటసేపు నిలిచిపోయిన వాహనాలు - BRS Leaders Dharna In Karimnagar

By ETV Bharat Telangana Team

Published : Mar 31, 2024, 1:51 PM IST

thumbnail

BRS Leaders Dharna In Gangadhara Mandal : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద కాలువలోకి నీటిని విడుదల చేయాలని కరీంనగర్ జిల్లా గంగాధర మండలం  కురిక్యాల వంతెనపై బీఆర్ఎస్ నాయకులు ధర్నా నిర్వహించారు. యాసంగి పంటలకు సాగునీరు లేక పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నాయని బీఆర్ఎస్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు రైతులకు వెంటనే సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. 

BRS Leaders  Fires On Govt : కాంగ్రెస్ హయాంలో రైతుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారని ప్రభుత్వంపై  బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. సాగునీరందక ఎండిపోయిన పంటలకు తక్షణమే పరిహారం అందించి రైతులను ఆదుకోవాలని బీఆర్​ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఎండిన పంటలకు ఎకరానికి రూ.25 వేలు చెల్లించాలని కోరారు. నాయకులు రోడ్డుపై బైఠాయించడంతో  ట్రాఫిక్​కు అంతరాయం కలిగింది. సుమారు గంటసేపు ఇరువైపులా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళన కారులను అదుపులోనికి తీసుకున్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.