'కనులు కనులను దోచాయంటే' సినిమాలోని ఏటీఎం చోరీ సీన్​ రిపీట్ ​- చివరకు?

By ETV Bharat Telangana Team

Published : Feb 16, 2024, 10:41 AM IST

thumbnail

ATM Robbery Case in Adilabad : నగదు చోరీలో దొంగలు విభిన్న పంథాలను ఎంచుకుంటున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా మావల మండలంలోని దస్నాపూర్ ఏటీఎంలో ముగ్గురు దుండగులు చాకచక్యంగా నగదు కాజేశారు. 'కనులు కనులను దోచాయంటే' సినిమాలో హీరో ఓ పుల్లతో ఏటీఎంలోని డబ్బులు కాజేస్తాడు. అలాంటి ఘటనే ఆదిలాబాద్​లో జరిగింది. కాగా ఈ ఘటన నగదు కోల్పోయిన బాధితుడి ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని బ్రాహ్మణవాడకు చెందిన సతీశ్​ దేశ్‌పాండే ఏటీఎంకు వెళ్లి రూ.5 వేలు డ్రా చేశాడు. ఖాతా నుంచి డబ్బులు తీసుకున్నట్లుగా చరవాణికి సమాచారం వచ్చినా, ఎంతకీ నగదు (ATM Chori) రాలేదు. దీంతో ఆయన బ్యాంకు యాజమాన్యానికి, మావల పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

Money Withdraw Using Plastic Cover in ATM : రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించగా దుండగుల బండారం బయటపడింది. ఏటీఎంలో నగదు బయటకు వచ్చే అర వద్ద నిందితులు ఒక ప్లాస్టిక్‌ ముక్కను ఎవరికీ అనుమానం రాకుండా అంటించినట్లుగా పోలీసులు గుర్తించారు. బాధితులు వెళ్లాక ఆ ముక్కను తొలగించి ఆ నగదును తీసుకుంటున్నారని తెలిపారు. ఈ మేరకు గుర్తు తెలియని ముగ్గురు దుండగులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.