ప్రభుత్వ వైఖరిపై ఏపీఎన్జీవోలు ఆగ్రహం - ఈనెల 11న ఉద్యమ కార్యాచరణ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 8, 2024, 9:26 PM IST

thumbnail

APNGO Association Fires on YSRCP: ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పట్ల ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుందని ఏపీఎన్జీవోల సంఘం ఆరోపించింది. తమ డిమాండ్లు పరిష్కరించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని, ఆఖరికి తాము దాచుకున్న జీపీఎఫ్ నుంచి సైతం రుణాలు ఇవ్వడం లేదని ఏపీఎన్టీవో సంఘ నేతలు ఆరోపించారు. 11వ పీఆర్సీలో వేతనాలు, భత్యాలు పెరగాల్సింది పోయి ఇంటి అద్దె, ఫిట్​మెంట్ వంటి వాటిని కుదించారని ఏపీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్, కార్యదర్శి ఇక్బాల్ ఆరోపించారు. 

వారం రోజుల్లో సీపీఎస్ ఇస్తామన్న సీఎం జగన్ మోహన్ రెడ్డి హామీ అమలు కాలేదని, ఓపీఎస్ అమలుపై ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుందని ఆరోపించారు. ఉద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఉద్యమ కార్యాచరణకు నడుం బిగించినట్లు చెప్పారు. ఈ మేరకు ఈ నెల 11వ తేదీన విజయవాడలో ఉద్యోగ, ఉపాధ్యాయుల ఐకాస విస్తృత సమావేశం జరగనుందని విద్యాసాగర్ చెప్పారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే తాము రోడ్డుపైకి వస్తున్నామని తెలిపారు. దీనికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.