ETV Bharat / technology

గుంతలు, స్పీడ్​ బ్రేకర్స్ నుంచి ఇలా బయటపడండి - రోడ్డు ప్రమాదాల్లేకుండా సేఫ్ జర్నీ! - What is MAPPLS App and Its Benefits

author img

By ETV Bharat Telugu Team

Published : May 18, 2024, 2:47 PM IST

MAPPLS App: చాలా సార్లు కొత్త దారిలో ప్రయాణిస్తుంటారు. ఆ దారిలో ఎక్కడ గుంత ఉందో, ఎక్కడ స్పీడ్ బ్రేకర్​ ఉందో, ఇంకెక్కడ మలుపు ఉందో తెలియదు. దగ్గరికి వెళ్లిన తర్వాత సడన్​గా బ్రేక్స్​ వేయాల్సి వస్తుంది. ఏ మాత్రం ఆలస్యమైనా కారు బోల్తా పడడం ఖాయం. అయితే.. అలా జరగకుండా కాస్త ముందుగానే మనకు హెచ్చరికలు కనిపిస్తే ఎలా ఉంటుంది? సూపర్ కదా! ఇలాంటి మరెన్నో ఫెసిలిటీస్ అందిస్తోంది మాపిల్స్ యాప్ (MAPPLS App). ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

Mappls App Benefits
Mappls App Benefits (Etv Bharat)

What is MAPPLS App and its Benefits : గూగుల్​ మ్యాప్స్ అందరికీ తెలుసు. మరి.. MAPPLS యాప్ గురించి మీకు తెలుసా? ఇందులో ఎన్నో అత్యాధునిక ఫీచర్స్ ఉన్నాయి. ఎదురుగా ఉన్న గంతలు, స్పీడ్ బ్రేకర్స్​ మొదలు.. మీరు వెళ్లాలనుకునే గమ్యస్థానానికి ఎంత పెట్రోల్ ఖర్చవుతుందో కూడా తెలుపుతుంది. ఇలాంటి మరెన్నో సేవలు అందులో ఉన్నాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.

3D వ్యూ మ్యాపింగ్​: మాపిల్స్​ యాప్​లో 3D వ్యూ అనేది సూపర్ ఫీచర్. ఉదాహరణకు.. కొత్త ప్రాంతాన్ని సెర్చ్ చేస్తూ వెళ్తున్న మనకు ఫ్లై ఓవర్ ఎదురైతే.. దాని పక్క నుంచి వెళ్లాలా? ఫ్లైఓవర్ ఎక్కాలా? అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. జంక్షన్ ఎదురైతే.. ఎటువైపు వెళ్లాలి అనేది ఇబ్బందిగా ఉంటుంది. కానీ.. మాపిల్స్​ యాప్​లోని 3D వ్యూ ద్వారా ఆ సమస్య ఉండదు. ఇందులో మొత్తం మార్గాన్ని 3D వ్యూలో చూపిస్తుంది. ఎటు వెళ్లాలనేది మార్క్ చేసిన లైన్​తో చూపిస్తుంది. ఒకవేళ తర్వాత ఏదైనా జంక్షన్ ఉన్నా కూడా.. దాన్ని సైతం 3D వ్యూలో చూపిస్తుంది.

స్పీడ్​ బ్రేకర్స్ : మనం ప్రయాణించే దారిలో గుంతలు, స్పీడ్​ బ్రేకర్లు ఉంటే.. వాటికి కాస్త దూరం ఉండగానే ఆ సమాచారాన్ని అందిస్తుంది. కొన్ని మీటర్ల దూరంలోనే మనకు వాయిస్ ఇన్ఫర్మేషన్​ ఇస్తుంది. ఈ ఫీచర్​ కారణంగా ​గుంతల ద్వారా వాహనానికి కలిగే నష్టం, రోడ్డు ప్రమాదాలు చాలా వరకు తగ్గుతాయి. ముఖ్యంగా రాత్రివేళ రోడ్డు ప్రమాదాలను తప్పించుకోవచ్చు. ఇంకా.. రోడ్డు​ బ్లాక్​ అయినా, మనం వెళ్తున్న రోడ్డులో ఏమైనా మెయింటనెన్స్​ పనులు జరుగుతున్నా కూడా చెప్పేస్తుంది.

క్రెడిట్​, డెబిట్​ కార్డ్​ యూజర్లకు అలర్ట్​ - ఈ కామన్​ 'పిన్స్​'ను వెంటనే మార్చండి - లేకుంటే ఇక అంతే! - Most Common PIN Patterns

స్పీడ్​ కంట్రోల్​: కొన్నిసార్లు మనం తొందరలో రోడ్లపై చాలా ఫాస్ట్​గా డ్రైవ్​ చేస్తాం. దాంతో హై స్పీడ్ కెమెరాలు.. మన వేగాన్ని గుర్తిస్తాయి. ఫైన్​ పడుతుంది. ఆ పరిస్థితి రాకుండా ఈ యాప్ కాపాడుతుంది. రోడ్డుపై ఎక్కడ స్పీడ్ కెమెరాలు ఉన్నాయి? ఆ రోడ్డు మీద ఎంత స్పీడ్​తో​ వెళ్లాలి? అనే వివరాల్ని కూడా ముందుగానే ఈ యాప్ తెలియజేస్తుంది. దాంతో మనం వెంటనే స్పీడ్​ను కంట్రోల్​ చేసుకోవచ్చు.

టోల్​ గేట్స్​ ఇన్ఫర్మేషన్​: మనం వెళ్లే దారిలో ఎన్ని టోల్‌ గేట్స్ వస్తాయో, ఏ టోల్‌లో ఎంత డబ్బు చెల్లించాలో కూడా ఈ యాప్ ముందుగానే చెబుతుంది. అలాగే మనం వెళ్లే దారిలో ఎన్ని పెట్రోల్​, డీజిల్​ బంక్స్​ ఉన్నాయి? ఎన్ని EV స్టేషన్స్​ ఉన్నాయి? ఎంత దూరంలో ఉన్నాయి? మన గమ్యస్థానికి ఎంత ఇంధనం ఖర్చు అవుతుంది? అనే వివరాలు కూడా ముందుగానే అందిస్తుంది.

కంటి చూపుతోనే స్క్రీన్​ను ఆపరేట్ చేసేలా - యాపిల్ నయా ఫీచర్స్​! - Apple Accessibility Features

అమ్మాయిలూ - మీ ఫోన్‌లో ఈ ఒక్క యాప్‌ ఉంటే చాలు! ఎక్కడికెళ్లినా సేఫ్‌గా ఉండొచ్చు! - my safetipin app

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.