ETV Bharat / state

'ఒక దళిత బిడ్డ దిల్లీ వెళ్లి బొటనవేలు కోసుకునే దుస్థితి ఎందుకు వచ్చిందో సీఎం జగన్​ చెప్పాలి' - Varla Ramaiah on Woman cut Thumb

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 23, 2024, 5:00 PM IST

varla_ramaiah_on_woman_chopped_her_thumb_in_delhi
varla_ramaiah_on_woman_chopped_her_thumb_in_delhi

Varla Ramaiah on Woman Chopped Her Thumb In Delhi : మాజీ హోంమంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సుచరిత అనుయాయుల ఆరాచకాలపై దిల్లీలో ఫిర్యాదు చేసేందుకు తన బృందంతో కలిసి దిల్లీ వెళ్లిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి తన వేలును నరుక్కోవడం కలకలం రేపింది. ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలు దేశ ప్రజల దృష్టికి తెచ్చేందుకు ఆమె ఈ విధంగా చేశారు. ఈ ఘటన ఆదివారం ఢిల్లీలో జరిగింది.

'ఒక దళిత బిడ్డ దిల్లీ వెళ్లి బొటనవేలు కోసుకునే దుస్థితి ఎందుకు వచ్చిందో సీఎం జగన్​ చెప్పాలి'

Varla Ramaiah on Woman Chopped Her Thumb In Delhi : రాష్ట్రంలో మహిళలకు జరుగుతున్న అన్యాయంతో పోల్చితే బొటనవేలు కోసుకున్న బాధ పెద్దది కాదని బాధితురాలు కోపూరి లక్ష్మీ ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు స్వర్ణభారతి నగర్​లో వైఎస్సార్సీపీ నేతలు మైనర్ పిల్లల్ని గంజాయికి అలవాటు చేసి వారిని మాదకద్రవ్యాలకు బానిసలుగా మార్చారని ఆరోపించారు. ఒక దళిత బిడ్డ దిల్లీ వెళ్లి బొటనవేలు కోసుకునే దుస్థితి ఎందుకు వచ్చిందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందనటానికి లక్ష్మీ ఉదంతమే ఉదాహరణని అన్నారు.

Andhra Pradesh Woman Chopped Her Thumb In Delhi : మాజీ హోంమంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సుచరిత అనుయాయుల ఆరాచకాలపై దిల్లీలో ఫిర్యాదు చేసేందుకు తన బృందంతో కలిసి దిల్లీ వెళ్లిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీలక్ష్మి తన వేలును నరుక్కోవడం కలకలం రేపింది. ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలు దేశ ప్రజల దృష్టికి తెచ్చేందుకు ఆమె ఈ విధంగా చేశారు. ఈ ఘటన ఆదివారం ఢిల్లీలో జరిగింది. దీనికి సంబంధించి బాధితురాలు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేకతోటి సుచరిత అనుయాయులు కొందరు గుంటూరు నగర శివారు స్వర్ణభారతినగర్, అడవితక్కెళ్లపాడు పరిదిలో భూదందాలకు పాల్పడ్డారు.

మేకతోటి సుచరిత అనుచరుల అక్రమాలు - దేశం దృష్టికి తెచ్చేందుకు బొటన వేలు నరుక్కున్న మహిళ - Lakshmi Cuts Off Thumb of Left Hand

పేదల భూములకు నకిలీ హక్కు పత్రాలు సృష్టించి విక్రయిస్తూ ఆసలైన హక్కుదారులను రోడ్డున పడేశారు. వారి అన్యాయాలను స్థానికంగా ఉన్న ఆదర్శ మహిళా మండలి సభ్యులు ప్రశ్నించి కలెక్టర్, ఎస్పీ, డీజీపీ, సీఐడీ విభాగాలకు ఫిర్యాదు చేశారు. వాటిపై వారు స్పందించకపోగా తిరిగి శ్రీలక్ష్మి పైనే కేసులు పెట్టారు. దీంతో ఆమె కొందరు మహిళలతో కలిసి రాష్ట్రపతి, ప్రధాని, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేయడానికి ఢిల్లీ వెళ్లారు. ఆయా కార్యాలయాలకు వెళ్లి ఆమె వినతిపత్రాలు అందజేశారు. అలాగే ఈ వ్యవహారం దేశం దృష్టిని ఆకర్షించాలని నిర్ణయించుకుని. శ్రీలక్ష్మి తన ఎడమ చేతి బొటన వేలును నరుక్కున్నారు. అనంతరం రాష్ట్రపతి భవన్ ముందు సెల్ఫీ వీడియో తీసుకుని నియోజ కవర్గంలో చోటుచేసుకున్న భూకబ్జాలు, దందాలు, గంజాయికి బానిసలవుతున్న యువత పరిస్థితిని తెలియజేశారు.

సొంత బాబాయ్‌నే చంపిన వారు- వేలు కోసుకుంటే స్పందిస్తారా: లోకేశ్​ - Lokesh Reaction on Kovuru Lakshmi

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.