ETV Bharat / state

నో ఎఫ్​ఐఆర్​ - ఓన్లీ యాక్షన్​, ఈ-పెట్టీ కేసు విధానంతో ఆకతాయిలకు అడ్డుకట్ట - E petty Case System in Telangana

author img

By ETV Bharat Telangana Team

Published : May 25, 2024, 7:29 PM IST

Updated : May 25, 2024, 7:49 PM IST

E petty Case System in Telangana : చిన్న చిన్న గొడవలు అయితే ఏముందిలే కాస్త జరిమానా కట్టేసి బయటకు రావచ్చు అనుకునే రోజులు పోయాయి. ఆ ఆలోచనలకు కాలం చెల్లింది. మాటల్లేవ్ మాట్లాడుకోవడాలు లేవంటూ కటకటాల వెనక్కి అనేలా ఓ విధానం అమల్లోకి వచ్చింది. కాలనీల్లో మంచినీటి కోసం గొడవ జరిగినా ట్యాబ్‌లో వివరాలు నమోదు చేయడంతో ఊచలు లెక్కించేలా చేసేంత కఠినంగా అమలవుతోంది.

E petty Case System in Telangana
Police Solving Most Of Cases Through E Petty Case System (ETV Bharat)

Police Solving Most Of Cases Through E Petty Case System : నగర పోలీస్ శాఖలో గతేడాది వచ్చిన ఈ-పెట్టీ విధానం సత్ఫలితాలు రాబడుతోంది. చేసిన తప్పు మళ్లీ మళ్లీ చేస్తూ జరిమానాతో బయటపడొచ్చులే అనుకుంటున్న ఆకతాయిలకు అడ్డుకట్ట వేస్తోంది. చేసిన తప్పు పునరావృతం చేస్తే ఊచలు లెక్కెట్టాల్సిందే అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. రోడ్డు వెంట వెళ్లే యువతులను మహిళలను ఇబ్బంది పెట్టే వారికి సైతం ఈ-పెట్టీ విధానం ద్వారా జైలుకు పంపించేందుకు వీలు కలుగుతోంది. చిన్నచిన్న ఈవ్​ టీజింగ్‌ అని తీసిపారేయలేకుండా చేసిందీ విధానం. తల్లిదండ్రులను వేధించినా ఈ పెట్టీ కేసుతో జైలుకు పంపిస్తున్నారు.

బంజారాహిల్స్‌ ఠాణా పరిధిలో నలుగురు నిందితులకు 15 రోజుల పాటు జైలు శిక్ష పడినట్లు బంజారాహిల్స్ పోలీసులు వెల్లడించారు. మరోవైపు నార్త్‌జోన్‌లో కూడా ఓ వ్యక్తి కత్తి పట్టుకుని బెదిరిస్తుండగా ఈ పెట్టీ కేసు నమోదు చేస్తే న్యాయస్థానం 60 రోజులు జైలుశిక్ష విధించిందని నార్త్‌జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు.

"ఈ పెట్టీ కేసు విధానంతో చిన్న తరహా నేరాలను ఆపవచ్చు. కేసు నమోదు చేసినప్పుడే దానికి సంబంధించి ఆధారాలను కూడా పోలీసులు ట్యాబ్​లో రికార్డ్​ చేస్తారు. ఈ కేసులను పరిష్కరించడానికి ఉదయం కోర్టు ఉంటుంది. నేరాన్ని బట్టి శిక్ష విధిస్తారు. ఈ విధానంతో చిన్నపాటి కేసులు సులువుగా పరిష్కరిస్తున్నారు. దీంతో చిన్న తప్పు చేసినవారు ఇంకోసారి చేయడానికి ముందుకు రారు. ఎఫ్పైఆర్​ ఆనేది పెద్ద ప్రాసెస్​ ఇది అలా కాదు. కేసులు తొందరగా సాల్వ్​ అవుతాయి." - రోహిణి ప్రియదర్శిని, నార్త్​జోన్​ డీసీపీ

దూషించినందుకు వారం రోజులు జైలు : గతంలో ఇలాంటి సంఘటనలే నగరంలో జరిగాయి. నగరానికి చెందిన వీరేందర్‌, ఆల్తాఫ్‌ మద్యం సేవించి రోడ్లపై వెళ్లేవారిని దూషించేవారు. కాగా వారిపై గతంలోనే న్యూసెన్స్‌ కేసు నమోదైంది. కానీ ప్రవర్తనలో ఎలాంటి మార్పు లేదు. 70 సి కింద పోలీసులు కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరిస్తే వారం రోజుల జైలు శిక్ష విధించారు.

నో ఎఫ్​ఐఆర్​ ఓన్లీ యాక్షన్​ ఈ-పెట్టీ కేసు విధానంతో ఆకతాయిలకు అడ్డుకట్ట (ETV Bharat)

తాళం వేసిన ఇళ్లే ఆదొంగల టార్గెట్ - నగరంలో బెంబేలెత్తిస్తున్న వరుస చోరీలు - Massive theft in Shameerpet

Pub Owner Arrested Through Petty Case : మరోకేసులో జూబ్లీహిల్స్‌కి సంబంధించిన ఓ పబ్‌ యజమానికి ఈ విధానంతోనే చెక్ పెట్టింది . పబ్‌ను అర్ధరాత్రి 12 గంటలకు మూసివేయాలి. మూసివేయకుండా అలానే ఉంచడం, పోలీసులు కేసు నమోదు చేయడం, పబ్‌ యజమాని కోర్టుకు వెళ్లి వెయ్యి రూపాయలు జరిమానా కట్టడం పరిపాటైపోయింది. లక్షల రూపాయలు వస్తున్నప్పుడు వెయ్యి పోతే ఓ లెక్కనా అన్నట్లుగా ఉండే ఆ యజమాని ప్రవర్తనకు కోర్టు చెక్‌పెట్టింది. ఈసారి వెయ్యి రూపాయలు కాకుండా ఆరు రోజుల కారాగార శిక్ష విధించింది. ఇవన్నీ ఈ పెట్టీ విధానంతోనే సాధ్యమయ్యాయని పోలీసులు చెబుతున్నారు. ఇది రావడం వల్ల పోలీసులకు పనిభారం తప్పడంతో పాటు నిందితుల్లో భయం పెరిగిందని నార్త్‌జోన్‌ డీసీపీ రోహిణి ప్రియదర్శిని వెల్లడించారు.

కేసుతో పాటు వెంటనే ఆధారాలు : ఈ పెట్టీ విధానంలో సాధారణ కేసుల్లాగా ఎఫ్‌ఐఆర్​లు ఉండవు. నగర పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గతేడాది ఈ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. పోలీస్‌ శాఖ నగరంలో ఎస్సై స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు ప్రతీ ఒక్కరికి ట్యాబ్‌లు ఇచ్చింది. ఏ చిన్న కేసు అయినా ఈ-పెట్టీ కేసు నమోదు చేసి కోర్టు ఎదుట హాజరు పరుస్తున్నారు. నేరం జరిగిందని రుజువు చేసేలా ఆధారాలు ట్యాబ్‌లోనే అప్లోడ్‌ చేస్తున్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్‌ 1348 ప్రకారం 70(ఎ) (బి) (సి) తోపాటు 323, మోటార్ వెహికిల్ చట్టం సహా సుమారు 219 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి సత్ఫలితాలు పొందుతున్నారు.

Jubilee Hills Thief Found : జూబ్లీహిల్స్ దొంగ దొరికాడు... గోడలు ఎత్తు తక్కువ ఉన్నాయని చూసి చోరీకి వచ్చాడు..

Cyber Crime Gangs Arrest : హలో.. అంటూ అందినకాడికి దోచేస్తున్న ముఠాలు అరెస్టు

Last Updated : May 25, 2024, 7:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.