ETV Bharat / state

కానిస్టేబుల్‌ అభ్యర్థులకు గుడ్​న్యూస్ - నేడు ఎంపిక పత్రాలు అందజేయనున్న సీఎం రేవంత్

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 14, 2024, 9:27 AM IST

Telangana Constable Jobs Appointment Letters : తెలంగాణలో కానిస్టేబుళ్ల స్థాయి పోస్టుల నియామక ప్రక్రియను పోలీసు నియామక మండలి పూర్తిచేసింది. ఈరోజు ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వారికి ఎంపిక ప్రతాలను అందజేయనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను హోంశాఖ పూర్తి చేసింది. మరోవైపు సీఎం కార్యక్రమం దృష్ట్యా ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

CM Revanth reddy
CM Revanth reddy

Telangana Constable Jobs Appointment Letters : రాష్ట్రంలో కానిస్టేబుళ్ల స్థాయి పోస్టుల నియామక ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) నేడు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో ఎంపిక పత్రాలను అందజేయనున్నారు. ఈమేరకు హోంశాఖ ఏర్పాట్లు చేసింది. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి(టీఎస్ఎల్‌పీఆర్‌బీ) 2022 ఏప్రిల్లో నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసింగే. ఈమేరకు గత సంవత్సరం అక్టోబరులోనే తుది ఎంపిక జాబితా ప్రకటించింది.

Revanth Job Letters For Constables : పోలీస్, జైళ్లు, ఎక్సైజ్, అగ్నిమాపక, రవాణా,స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పీఎఫ్) విభాగాలకు సంబంధించి 16,604 పోస్టులకుగాను 12,866 మంది పురుషులు, 2884 మంది మహిళ అభ్యర్ధులను ఎంపిక చేసింది. అర్హులు లేకపోవడంతో మిగిలిన 854 పోస్టులను బ్యాక్‌లాగ్‌గా పరిగణించింది. పోలీస్ రవాణా సంస్థలో 100 డ్రైవర్ పోస్టులతోపాటు అగ్నిమాపకశాఖలో 225 డ్రైవర్ ఆపరేటర్ పోస్టులకు సంబంధించిన తుది ఎంపిక ఫలితాలను మాత్రం న్యాయస్థానాల్లో వ్యాజ్యాల కారణంగా వెల్లడించలేదు.

మోదీ దీపావళి గిఫ్ట్.. 70వేల మందికి నియామక పత్రాలు.. మరో 10లక్షల మందికి..

అయితే ఇంతకాలం న్యాయస్థానాల్లో వ్యాజ్యాల కారణంగా ఆలస్యం నెలకొంది. తాజాగా ఆ అడ్డంకులు తొలిగిపోవడంతో ఎంపిక పత్రాలను అందజేయాలని హోంశాఖ నిర్ణయించింది. కానిస్టేబుల్ (Telangana Constable) సివిల్ 4965 పోస్టులకు గాను 3298 మంది పురుషులు, 1622 మంది మహిళలు ఎంపికయ్యారు, ఏఆర్‌లో 4423 పోస్టులకు గాను 2982 మంది పురుషులు, 948 మహిళలు ఎంపికయ్యారు ఇలా పలు విభాగాల్లో ఎంపికైన వారంతా నేడు నియామక పత్రాలు పొందనున్నారు. ఈ కార్యక్రమం సందర్భంగా ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 9:00 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఈ మేరకు వాహనాదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.

ఇదీ విభాగాల వారీగా కానిస్టేబుళ్ల జాబితా

క్రమసంఖ్యపోస్టుమొత్తం ఖాళీల సంఖ్యఎంపికైన పురుషులు ఎంపికైన మహిళలు
1సివిల్496532981622
2ఏఆర్44232982948
3ఎస్ఏఆర్ సీపీఎల్100100-
4టీఎస్‌ఎస్‌పీ50104725-
5ఎస్‌పీఎఫ్390382-
6ఫైర్‌మెన్లు610599-
7వార్డర్లు(పురుషులు)136134-
8వార్డర్లు(మహిళలు)10-10
9ఐటీ అండ్ కమ్యూనికేషన్ 26217186
10పోలీస్ రవాణా సంస్థ2121-
11రవాణాశాఖ (ప్రధాన కార్యాలయం)642
12రవాణాశాఖ(ఎల్‌సీ)574413
13ఎక్సైజ్614406203
మొత్తం16,60412,8662884

ఇటీవలే వైద్య, ఆరోగ్యశాఖలో తొమ్మిది విభాగాల్లో ఎంపికైన 6,956 మంది స్టాఫ్‌నర్సులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నియామక పత్రాలను అందించారు. వైద్య విద్య డైరెక్టరేట్‌ (డీఎంఈ) పరిధిలోని వివిధ ఆసుపత్రులు, గురుకులాల్లో స్టాఫ్‌నర్సుల ఉద్యోగాలకు మొత్తం 40,000 మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. గత సంవత్సరం ఆగస్టు 2న రాతపరీక్ష నిర్వహించారు.

గతంలో నిర్వహించిన గ్రూప్​-1 రద్దు - అదనంగా మరో 60 ఖాళీలతో త్వరలోనే కొత్త నోటిఫికేషన్ : సీఎం రేవంత్​రెడ్డి

71వేల మందికి మోదీ 'జాబ్ లెటర్స్'​.. 16 కోట్ల ఉద్యోగాల సంగతేంటన్న కాంగ్రెస్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.