ETV Bharat / state

ఏదైనా యాప్​ లాగిన్​ అయినప్పుడు ఆటోఫిల్​ వస్తుందా? - వదిలేస్తే మీ సమాచారం సైబర్​ నేరగాళ్ల చేతిలో పడ్డట్టే! - Password Safety Guidelines

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 31, 2024, 1:28 PM IST

Cyber Crime safety Measures
Social Media Password Safety Guidelines

Social Media Password Safety Guidelines : సోషల్​ మీడియా యాప్స్​ లాాగిన్ అయ్యేటప్పుడు ఆటోఫిల్​ పాస్​వర్డ్​ను కాకుండా వ్యక్తిగతంగా పాస్​వర్డ్​ టైప్​ చేయాలని హైదరాబాద్​ ఆచార్యులు అంకిత్​ గంగ్వాల్​ సూచించారు. ఆటోఫిల్​ చేయడం వల్ల వ్యక్తిగత సమాచారం సైబర్​ నేరగాళ్లు కొత్తగా ఏర్పాటు చేస్తున్న యాప్స్​ రహస్య పేజీలోకి వెళ్తాయని తెలిపారు.

Social Media Password Safety Guidelines : ఫేస్​బుక్​, యాప్​ల లాగిన్​ పాస్​వర్డ్​లు సైబర్​ నేరస్థుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ట్రిపుల్​ ఐటీ హైదరాబాద్​ ఆచార్యులు అంటున్నారు. ఫేస్​బుక్​, యాప్​లలోకి వినియోగదారులు ప్రవేశించేపటప్పుడు పేరు, వివరాలు, పాస్​వర్డ్​లు ఆటోఫిల్​ (వాటంతటవే) అవుతున్నాయి. దీన్ని గమనించకుండా కొందరు అలాగే వదిలేస్తున్నారని, ఇలా చేయడం వల్ల మొబైల్​ ఆపరేటింగ్​ వ్యవస్థల పాస్​వర్డ్​ మేనేజర్ల సామర్థ్యం తగ్గిపోతుందని ఆచార్యులు అంకిత్ గంగ్వాల్​ పరిశోధించారు.

ఆయన పరిశోధనను ఆటోస్పిల్​: క్రెడెన్షియల్​ లీకేజ్​ ఫ్రమ్​ మొబైల్​ పాస్​వర్డ్​ మేనేజర్ పేరుతో తన పరిశోధన పత్రాన్ని 4 నెలల క్రితం లండన్​లో జరిగిన సైబర్ భద్రత సదస్సులో సమర్పించారు. ఈ పరిశోధన (Autospill Research) పత్రానికి ఇప్పటికే ఏసీఎం సదస్సులో ఉత్తమ పత్రంగా బహుమతిని గెలుచుకుంది. దీంట్లో వినియోగదారుల వ్యక్తిగత సమాచారం సైబర్​ నేరాగాళ్లకు ఎలా వెళుతుందనే సమాచారం ఉంటుంది. దాని ద్వారా ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలన్న అంశాలు, క్లుప్తంగా ఉంటాయి. చరవాణి ద్వారా ఫేస్​బుక్​, సామాజిక మాధ్యమాలు, మొబైల్​ యాప్​లలో లాగిన్​ అయ్యేప్పుడు ఆటోఫిల్​ కాకుండా సొంతంగా (వ్యక్తిగతంగా) టైప్​ చేయాలని సూచించారు.

Facebook Hacked Account Recovery : మీ ఫేస్​బుక్ ఖాతా హ్యాక్ అయిందా?.. అయితే ఈ టిప్స్​తో ఈజీగా రికవర్​ చేయండి!

Cyber Crime safety Measures : సైబర్​ నేరాలకు పాల్పడుతున్న నేరస్థులు చరవాణుల ద్వారా ఫేస్​బుక్​, సామాజిక మాధ్యమాల్లోకి ప్రవేశిస్తున్న వారి వ్యక్తిగత వివరాలు, పాస్​వర్డ్​లను తెలుసుకునేందుకు ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, గూగుల్‌తో పాటు స్పాటిఫై, బుక్‌ మై షో వంటి మొబైల్‌ యాప్‌ల అధికారిక పేజీల కింద రహస్యంగా మరో పేజీని (Fake Pages on Apps) ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని సాంకేతిక పరిభాషలో ఆటోస్పిల్​ దాడి అంటారు. వీటి ద్వారానే వినియోగదారులు వ్యక్తిగత సమాచారం సైబర్​ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుంది.

పాస్​వర్డ్​ సేవ్​ చేయకుండా 'బ్రౌజర్​' నియంత్రణ ఎలా?

Facebook Password Login Safety Tips : చరవాణి ద్వారా ఫేస్​బుక్​లోకి వెళ్లేందుకు లాగిన్ అయినప్పుడు పేరు, వివరాలన్నీ ఆటోఫిల్​ రూపంలో వస్తాయి. కానీ పాస్​వర్డ్ మాత్రం మనమే టైప్​ చేయాలి. పాస్​వర్డ్​ టైప్​ చేసినప్పుడు వివరాలన్నీ అప్పటికే ఏర్పాటు చేసిన రహస్య పేజీలోకి (Social Media Fake Pages) వెళ్తాయి. ఆ పాస్​వర్డ్​ ద్వారా సైబర్ నేరస్థులు బ్యాంక్​ ఖాతాల్లో నగదులు బదిలి చేసుకునే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత ఫొటోలు తీసకుని వాటిని మార్ఫింక్ చేస్తామంటూ బెదిరించేందుకు అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైనా సామాజిక్ మాధ్యమాల్లో లాగిన్ అయ్యేటప్పుడు వ్యక్తిగతంగా పాస్​వర్డ్​ పెట్టుకోవడం ఉత్తమం అని అంటున్నారు. ఇలా చేస్తే వినియోగదారుల డేటా ఇతరులు దొంగలించడానికి ఉండదని తెలిపారు.

పాస్​వర్డ్​ ఇలా ఉంటే హ్యాక్​ అసాధ్యమే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.