ETV Bharat / state

అడుగుకో గొయ్యి - గజానికో గుంతో అధ్వానంగా రాష్ట్ర రహదారులు - Road conditions in Krishna district

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 4, 2024, 9:27 PM IST

Public_Facing_Problems_With_Damage_Roads_in_Krishna_District
Public_Facing_Problems_With_Damage_Roads_in_Krishna_District

Public Facing Problems With Damage Roads in Krishna District : అడుగుకో గొయ్యి గజానికో గుంత. కనుచూపు మేర కంకరతేలిన దారి దుమ్ము, ధూళితో కన్పించని రోడ్లు ఇదీ కృష్ణాజిల్లాలోని రహదారుల దుస్ధితి. అధ్వానంగా మారిన రోడ్లపై ఒక్క కిలోమీటర్ దూరం ప్రయాణిస్తే చాలు ఒళ్లు హూనమవ్వడం ఖాయం. అంతేనా, వర్షాకాలం వచ్చిందంటే చెరువులను తలపించే రోడ్లతో ప్రజలు ఉక్కిరి బిక్కిరి కావాల్సిందే. అప్పుడు గుంత ఎక్కుడుందో దారి ఎక్కడుందో కనుక్కోవాల్సిన పరిస్థితి. మరి, జగన్‌ ఐదేళ్ల పాలనలో ఉమ్మడి కృష్ణజిల్లా రోడ్ల దుస్థితి ఎలా ఉందో? ఇప్పుడు చూద్దాం.

అడుగుకో గొయ్యి - గజానికో గుంతో అధ్వానంగా రాష్ట్ర రహదారులు

Public Facing Problems With Damage Roads in Krishna District : జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో రాష్ట్రంలో ఒక్క ప్రాంతానికి కూడా నూతన రోడ్లు వేసిన పాపాన పోలేదు. కొత్త రోడ్ల సంగతి దేవుడెరుగు. కనీసం పాడైపోయిన రోడ్లను మరమ్మత్తులు చేయాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహారిస్తుంటే ఇక ప్రజల ప్రాణాలకు దిక్కెవరు. తాము పన్నుల రూపంలో చెల్లించిన డబ్బులతోనైనా కనీసం రెండేళ్ల కొసారైనా మరమ్మతులు, కొత్త రోడ్లు వేస్తే బాగుండని ప్రజలు అంటున్నారు.

రహదారుల ప్రాజెక్టును గాలికొదిలేసిన సర్కారు - రుణాలు ఆపేస్తామని కేంద్రం, ఎన్డీబీ హెచ్చరిక

రాష్ట్ర ప్రధాన రహదారులు మెరిసిపోతే చాలా? మండల, గ్రామీణ ప్రాంత రోడ్ల పరిస్థితి గురించి పట్టించుకోరా? అంటే మాకెందుకు అదంతా అన్నట్టు ఉంది వైసీపీ నాయకులు పని చూస్తే. ఉమ్మడి కృష్ణ జిల్లాలోని ప్రధాన రహదారులతో పాటు గ్రామీణ ప్రాంతాల రహదారులు పరిస్థితి దారుణంగా తయారైంది. అడుగడుగునా రాళ్లు తేలిన రోడ్లతో కనీసం తిరగలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఆర్భాటంగా ప్రారంభించిన ప్రధాన రాష్ట్ర రహదారుల నిర్మాణం ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వైసీపీ 5ఏళ్ల పాలనలో ధ్వంసమైన రోడ్లపై గుప్పెడు మట్టి వేసిన దాఖలాలు లేవు. గుంతలు పడినా రోడ్డుపై ప్రయాణాలు చేసి చాలామంది వాహనదారులు ప్రాణాలు కొల్పోతున్నా చూసి పట్టించుకున్న నాథుడే లేడు.

తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనాదారులు, ప్రజలు : ఉమ్మడి కృష్ణా జిల్లా అంతా న్యూడెవలప్‌మెంట్‌ బ్యాంకు నిధులతో రహదారులు చేపట్టారు. ఒకే ప్యాకేజీ కింద టెండర్లను పిలిచి పనులు అప్పగించారు. కానీ, అవి ఎక్కడిక్కడే నిలిచి పోయాయి. అధికారులు, గుత్తేదారులు ఎంత గగ్గోలుపెట్టినా పాలకులు నిద్రమత్తులో కాలయాపన చేయడంతో రహదారులు ఆధ్వానంగా మారి అభివృద్ధికి అవరోధం ఏర్పడింది. బ్యాంకు అడ్వాన్స్‌గా ఇచ్చిన రుణ మొత్తాన్నీ గుత్తేదారులకు పూర్తిగా చెల్లించకపోగా రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులు కూడా విడుదల చేయలేదు. రాష్ట్రమంతా కలిపి సగటున 31% పనులే జరిగాయంటే ఈ ప్రాజెక్టు పురోగతి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్ని జిల్లాల్లో అయితే 10 నుంచి 15 శాతంలోపే పనులు జరగడం గమనార్హం. NDB రుణంతో మండల కేంద్రాలతోపాటు వాటి నుంచి జిల్లా కేంద్రాలకు అనుసంధానంగా ఉండే సింగిల్ రహదారులను రెండు వరుసలుగా విస్తరించే ప్రాజెక్టు 2019లో రాష్ట్రానికి మంజూరైంది. ఇందులో భాగంగా 6400 కోట్లతో 2514 కిలో మీటర్ల మేర రోడ్లను 2 దశల్లో విస్తరించి, వంతెనలు నిర్మించాల్సి ఉంది. తొలి విడతలో 1887 కోట్లతో 1244 కిలో మీటర్ల మేర 119 రోడ్లను విస్తరించేలా 2021లో గుత్తేదారులకు పనులు అప్పగించారు. కానీ, పనులు చేపట్టిన కొన్ని రోజులకే ఆగిపోయాయి. దీంతో అటువైపుగా వెళ్తున్న వాహనాదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొంది.

ప్రయాణికులు పడుతున్న అవస్థలపై వార్త పత్రికల్లో కథనాలు : కృష్ణాజిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ప్రధాన రహదారులు మినహా మిగిలిన ఏ రోడ్డు చూసిన గుంతలమయమే. గ్రామాలకు వెళ్లే రహదారులు అయితే మరింత దారుణం. గుంతలు పడిన ఈ రోడ్డుపై ద్విచక్ర వాహనదారులు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ప్రమాదానికి గురి కావాల్సిందే. ఇటీవల కూచిపూడి రహదారిపై ప్రయాణికులు పడుతున్న అవస్థలపై వార్త పత్రికల్లో రావడంతో అధికారులు అప్రమత్తమై భారీగా ఏర్పడిన గుంతలు ఏదో తాత్కాలికంగా పూడ్చారు. ఆ పనులు తాత్కాలికం కావడం తిరిగి వాహనాల రాకపోకలు సాధారణంగా మారడంతో పరిస్థితి మళ్లీ మెదటికి వచ్చింది. కూచిపూడి నుంచి మొవ్వ, కొడాలి, మోపిదేవి, చల్లపల్లి ఇతర గ్రామాల వరకు రోడ్డు దారుణంగా తయారైంది. వివిధ పనుల నిమిత్తం ఎక్కువగా కూచిపూడి, మొవ్వ, అవనిగడ్డకు ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ రహదారికి మరమ్మత్తులు చేయించాలని ప్రజలు కోరుతున్న ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు.

"NDB నిధులతో చేపట్టిన రహదారుల పనుల్లో 8 ప్రారంభించగా ఐదు అసలు నిర్మాణమే చేపట్టలేదు. మచిలీపట్నం కమ్మవారి చెరువు మధ్య 12.96 కిలోమీటర్ల రోడ్డు పనులు ప్రారంభం కాగా ఇందులో 7.80కోట్ల రూపాయల విలువైన పనులు పూర్తయ్యాయి. ఇంకా 7.680 కిలోమీటర్ల మేర బీటీ వేయాల్సి ఉంది. కౌతవరం-నిడుమోలు-ఐతవరం మధ్య 16.49 కిలో మీటర్ల రోడ్డు నిర్మాణం చేయాల్సి ఉండగా 11.5 కిలో మీటర్ల WBMM పనులు మాత్రమే పూర్తి చేశారు. దీనికి 13.50కోట్ల రూపాయలు ఖర్చు అయినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ రహదారి మొత్తం నిర్మాణ వ్యయం రూ. 57.25 కోట్లు కాగా అందులో సగం కూడా పూర్తి కాలేదు. ఇవి కొన్ని మాత్రమే ఇలా జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల ఆసంపూర్తిగా పనులు రోడ్ల పనులు నిలిచి పోయాయి." - స్థానికుడు

నోట్లోకి, కళ్లలోకి వెళ్తున్న దుమ్ము, దూళి : జిల్లావ్యాప్తంగా 13 చోట్ల రోడ్డు పనులు చేపట్టగా రూ. 47.70 కోట్ల విలువైన పనులు జరిగాయి. ఇందులో రూ. 21.53 కోట్ల బిల్లులు చెల్లించారు. CMFS వద్ద రూ. 8.98 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. రూ. 17.19 కోట్లుకు ఇంకా బిల్లులు పెట్టాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఇలా ఏ నియోజకవర్గంలో నూ చేసిన పనులకు బిల్లులు చెల్లించకుండా బకాయిలు పెట్టడంతో గుత్తేదారులు పనులు నిలిపి వేస్తున్నారు. పనులు ఆగిపోవడంతో రోడ్లపై ఆధ్వాన స్థితులు నెలకొంటున్నాయి. మొవ్వ నుంచి కొండవరం పెదముతేవి, కోసూరు వరకు దాదాపు 9 కిలో మీటర్ల రహదారి 4 ఏళ్ల నుంచి అసంపూర్తిగా ఉండటంతో ఆ రోడ్డుపై ప్రయాణించే ప్రయాణికులు తీవ్రఇబ్బంది పడుతున్నారు. ఈ రహదారి నుంచే పెద్దముత్తేవి, కొండవరానికి చెందిన విద్యార్థులు మొవ్వ హైస్కూల్, కళాశాలకు వెళ్లుతుంటారు. 2019లో గత ప్రభుత్వంలో ఈ రహదారి అభివృద్దికి దాదాపు 3 కోట్లు కేటాయించింది. పనులు కూడా కొంత మేర ప్రారంభమయ్యాయి. ఈ రోడ్డు కోసం సుమారు 80 లక్షల వరకు నిధులు ఖర్చు చేశారు. తర్వాత వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో గుత్తేదారుకి బిల్లులు ఇవ్వకపోవడంతో పనులు నిలివేశారు. గుంతలు పడిన రహదారిపై వాహనాలు వెళ్లినప్పుడల్లా దుమ్ము, దూళి నోట్లోకి, కళ్లలోకి వెళ్లడంతో అనారోగ్య సమస్యలు వస్తున్నాయని వాపోతున్నారు.

మరోసారి జగన్ వివక్ష - సొంత వారికే సొమ్ములు - మిగతా వారికి గోతులు

మెుదట తల ఊపి - తరువాత తుంగలో తొక్కి : రహదారుల నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరుని మొదట్లోనే గమనించిన NDB, కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ-DEA ప్రాజెక్టు అమలుకు సంబంధించి అనేక నిబంధనలు పెట్టింది. ఈ నిధుల కోసం ప్రత్యేకంగా బ్యాంక్ ఖాతా తెరవడంతోపాటు బ్యాంక్ రుణ వాటా సొమ్ము విడుదల చేశాక వారంలోగా వాటిని ప్రత్యేక ఖాతాకు మళ్లించాలని స్పష్టం చేసింది. రాష్ట్ర వాటా 30 శాతం కూడా అందులో జమ చేసి పనులకు వినియోగించాలని ఆదేశించింది. తొలుత వాటన్నింటికీ తల ఊపిన ప్రభుత్వం నిధులు విడుదలయ్యాక మాత్రం నిబంధనలను తుంగలో తొక్కింది. గతేడాది జులైలో బ్యాంకు 230 కోట్లు విడుదల చేయగా వాటిని ప్రత్యేక ఖాతాలోకి బదిలీ చేయకుండా ప్రభుత్వం వద్దే ఉంచేసుకుంది. అందులోంచి పలు దఫాలుగా ఇప్పటివరకు గుత్తేదారులకు సుమారు 215 కోట్లు చెల్లించింది. బ్యాంకు రుణ వాటాకు రాష్ట్రం తరపున 70 కోట్లు జమ చేయాల్సి ఉన్నా ప్రభుత్వం స్పందిచనేలేదు. గన్నవరం, పెనమలూరు, గుడివాడ, పామర్రు, అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లో రహదారులను ప్రభుత్వం గాలికి వదిలేసింది.

"కృష్ణాజిల్లాలోని పామర్రు, పెనమలూరు, గుడివాడ, అవనిగడ్డ తదితర నియోజకవర్గాల్లో రహదారులు మరింత దారుణంగా ఉన్నాయి. కంకిపాడు నుంచి మెదలు పెడితే ఏ రహదారి చుద్దామనుకున్న అన్ని గోతులమయమే. పామర్రు, అవనిగడ్డ, మచిలీపట్నం ప్రాంతాల నుంచి నిత్యం వేలాది మంది వివిధ పనుల నిమిత్తం విజయవాడకు వస్తుంటారు. అవనిగడ్డ నుంచి కోడూరు వెళ్లే రహదారి అనేక సంవత్సరాలుగా అక్కడ ప్రజలకు నరకం చూపిస్తోంది. సీఎం జగన్ అవనిగడ్డ పర్యటనలో భాగంగా ఈ రహదారి అభివృద్దికి నిధులు కేటాయించినా పనులు మాత్రం ప్రారంభం కాలేదు. చినుకు పడిందంటే చాలు రహదారులపై ఉన్న గోతుల నిండా నీరు నిలిచి దారిపొడవునా రోడ్లు చిన్నపాటి చెరువులను తలపిస్తాయి. కొత్త రోడ్ల సంగతి దేవుడెరుగు కానీ ఉన్న రోడ్లను బాగు చేస్తారని జిల్లాలోని ప్రజలు ఎదురు చూశారు. కానీ ప్రభుత్వానికి బటన్ నొక్కుడుపై ఉన్న శ్రద్ద రోడ్లపై లేదు." - స్థానికుడు

విద్యార్థుల బాధలు వర్ణనాతీతం : గుంతలు పడిన రహదారులపై పెద్ద పెద్ద లారీలు, బస్సులు, ట్రాక్టర్ల వెళ్తుండటంతో రోడ్డు మెుత్తం రాళ్లు తేలాయి. ఈ రహదారి వెంట పాఠశాల, కళాశాలలకు వెళ్లాలంటే విద్యార్థుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఇక పాదచారుల ఆగచాట్లైతే చెప్పాల్సిన అవసరం లేదు. రోజు ఈ రహదారిపై వెళ్తుంటే వాహనాలు కూడా పూర్తిగా దెబ్బతింటున్నాయని వాహనదారులు గగ్గోలు పెడుతున్నారు. తమ ఖర్చులో చాలా వరకు మరమ్మత్తులకే పోతుందని వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితులను చూసి కూడా వైసీపీ ప్రభుత్వం ఓట్లను ఎలా అడుగుతుందని వాహనదారులు ప్రశ్నిస్తున్నారు. కనీసం ఐదేళ్లలో ఒక్కసారి దృష్టి పెట్టిన సరిపోయి ఉండేదని కనీసం ఆ పని కూడా చేయలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గుంతల రోడ్డుకు ప్రారంభోత్సవం - నవ్వుకుంటున్న జనం

రోడ్డు ఎక్కడుంది జగనన్న - అన్నీ గుంతలే కనిపిస్తున్నాయి! కాకినాడ -సామర్లకోట రహదారిపై ప్రయాణికుల బెంబేలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.