ETV Bharat / state

'విచారణకు హాజరు కాలేను' - సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 25, 2024, 6:06 PM IST

Updated : Feb 25, 2024, 7:14 PM IST

MLC Kavitha
MLC Kavita Wrote Letter to CBI

MLC Kavitha CBI Letter : దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఇటీవలే సీబీఐ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. వాటిపై స్పందించిన కవిత ఇవాళ సీబీఐ అధికారులకు లేఖ రాశారు. ఈనెల 26న విచారణకు హాజరు కాలేనని లేఖలో పేర్కొన్నారు.

MLC Kavitha CBI Letter : పార్లమెంటు ఎన్నికల దృష్యా సీబీఐ నోటీసులు జారీ వల్ల అనేక ప్రశ్నలకు తావిస్తోందని బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ(MLC Kavitha) కవిత పేర్కొన్నారు. ఎన్నికల ప్రచార బాధ్యతలు ఉన్నందున విచారణకు రావడం అవరోధంగా ఉందని తెలిపారు. ఈ మేరకు సోమవారం విచారణకు హాజరుకాలేనని సీబీఐకి కవిత లేఖ రాశారు.

సీఆర్పీసీ సెక్షన్​ 41ఏ(CRPC Section 41A) కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని లేదా ఉపసంహరించుకోవాలని సీబీఐకి రాసిన లేఖలో కవిత కోరారు. అలాగే పలు కీలక విషయాలను ప్రస్తావిస్తూ ఒకవేళ నా నుంచి సీబీఐకి ఏవైనా ప్రశ్నలకు సమాధానం, సమాచారం కావాలనుకుంటే వర్చువల్​ పద్ధతిలో హాజరవ్వడానికి అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు.

MLC Kavitha Letter To CBI : ముందే నిర్ణయించిన కార్యక్రమాలు ఉన్న రీత్యా ఈనెల 26న విచారణకు హాజరుకావడం సాధ్యం కాదని ఎమ్మెల్సీ కవిత తేల్చి చెప్పారు. సీఆర్పీసీ సెక్షన్​ 41ఏ కింద నోటీసులు ఇవ్వడం సబబు కాదని, 2022 డిసెంబరులో ఇదే తరహా నోటీసును సెక్షన్​ 160 కింద ఇచ్చారని గుర్తు చేశారు. గతంలో జారీ చేసిన సెక్షన్​ 160 నోటీసుకు ప్రస్తుత సెక్షన్​ 41ఏ నోటీసు పూర్తి విరుద్ధంగా ఉందని సీబీఐ(CBI)కి రాసిన లేఖలో కవిత తెలిపారు. సెక్షన్​ 41ఏ కింద ఎందుకు, ఏ పరిస్థితుల్లో నోటీసులు ఇచ్చారో స్పష్టత లేదని, నోటీసు జారీ చేసిన సందర్భం కూడా ఆలోచింపంజేస్తోందని పేర్కొన్నారు.

సుప్రీంకోర్టులో ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదు: ఎమ్మెల్సీ కవిత

Delhi Liquor Scam Case Update : పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పార్టీ కొన్ని బాధ్యతలు అప్పగించిందని, రానున్న ఆరు వారాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రచారం, సమావేశాల షెడ్యూల్​ ఖరారైనందున ఫిబ్రవరి 26వ తేదీన విచారణకు హాజరుకాలేనని కవిత పేర్కొన్నారు. పార్లమెంటు ఎన్నికల(Lok Sabha Election 2024) నేపథ్యంలో జారీ చేసిన నోటీసుల నిలిపివేతను పరిశీలించాలని సీబీఐ అధికారులకు విజ్ఞప్తి చేశారు. సీబీఐ చేస్తున్న ఆరోపణల్లో తన పాత్ర లేదని, పైగా కేసు కోర్టులో పెండింగ్​లో ఉందని గుర్తు చేశారు. ఈడీ నోటీసులు జారీ చేయగా సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు వివరించారు. ఆ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్​లో ఉండగా తనను విచారణకు పిలవబోమని అదనపు సొలిసిటర్​ జనరల్​ సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చారని లేఖలో కవిత ప్రస్తావించారు.

సర్వోన్నత న్యాయస్థానంలో హామీ సీబీఐకి కూడా వర్తిస్తుందని కవిత వ్యాఖ్యానించారు. గతంలోనూ సీబీఐ బృందం హైదరాబాద్​లోని తన నివాసానికి వచ్చినప్పుడు విచారణకు సహకరించానని వివరణ ఇచ్చారు. నియమ నిబంధనలను కట్టుబడి ఉండే దేశ పౌరురాలిగా సీబీఐ దర్యాప్తునకు ఎప్పుడైనా తప్పకుండా సహకరిస్తానన్నారు. కానీ 15 నెలల విరామం తరువాత ఇప్పుడు సీబీఐ పిలవడం, సెక్షన్ల మార్పు ఇలా అనేక అనుమానాలకు తావిస్తోందని, ప్రజాస్వామిక, రాజ్యాంగ హక్కులకు భంగం కలిగిస్తోందని సీబీఐకి రాసిన లేఖలో కవిత పేర్కొన్నారు.

దిల్లీ మద్యం కేసు - ఈనెల 26న విచారణకు హాజరుకావాలంటూ కవితకు సీబీఐ నోటీసులు

Supreme Court on MLC Kavitha Petition : ఇప్పుడే ఎమ్మెల్సీ కవితకు సమన్లు జారీ చేయొద్దు.. ఈడీకి సుప్రీం కోర్టు ఆదేశం

Last Updated :Feb 25, 2024, 7:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.