ETV Bharat / state

దిల్లీ మద్యం కేసు - ఈనెల 26న విచారణకు హాజరుకావాలంటూ కవితకు సీబీఐ నోటీసులు

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 21, 2024, 9:57 PM IST

Updated : Feb 22, 2024, 9:31 AM IST

CBI Summons to MLC Kavitha : దిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ సమన్లు జారీచేసింది. ఈ నెల 26న విచారణకు హాజరుకావాలని పేర్కొంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం కుంభకోణంలో గతంలో ఎమ్మెల్సీ కవితను సీబీఐ విచారించిన విషయం తెలిసిందే.

MLC Kavitha
MLC Kavitha

CBI Summons to MLC Kavitha : దిల్లీ మద్యం కేసులో బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవితకు(MLC Kavitha) సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈనెల 26న విచారణకు హాజరుకావాలని తెలిపింది. దిల్లీలో మద్యం అమ్మకాలకు సంబంధించి అక్కడి ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీలో అనేక అక్రమాలు జరిగాయని, అమ్మకందారులకు లబ్ధి చేకూర్చేలా దీన్ని రూపొందించారన్న అరోపణలపై మొదట సీబీఐ కేసు నమోదు చేసింది.

ఇందులో పెద్దఎత్తున డబ్బులు చేతులు మారినట్లు సీబీఐ పేర్కొంది. నిధుల మళ్లింపునకు సంబంధించి ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరెట్ కూడా మరో కేసు నమోదు చేసి సమాంతరంగా దర్యాప్తు జరుపుతోంది. గత సంవత్సరం ఫిబ్రవరి 26న అప్పటి దిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోదియాను అరెస్టు చేశారు. మద్యం అమ్మకాల్లో కీలకంగా మారిన సౌత్‌ కార్టల్‌ తరఫున కవిత కీలకంగా వ్యవహరించారని, మద్యం వ్యాపారులతో కలిసి పలుమార్లు సమావేశాలు నిర్వహించారని, ఇదే పనిమీద పలుమార్లు దిల్లీ కూడా వచ్చారని సీబీఐ, ఈడీలు తెలిపాయి.

Supreme Court on MLC Kavitha Petition : ఇప్పుడే ఎమ్మెల్సీ కవితకు సమన్లు జారీ చేయొద్దు.. ఈడీకి సుప్రీం కోర్టు ఆదేశం

ఈ కేసులో కవిత (MLC Kavitha) తరఫున ప్రతినిధులుగా వ్యవహరించినట్లు పేర్కొన్న మద్యం వ్యాపారి, వైసీపీ నేత, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి, అరుణ్​ రామచంద్ర పిళ్లై, శరత్​చంద్రారెడ్డి, అభిషేక్​ బోయినపల్లి, అలాగే ఆమె ఛార్టర్డ్​ ఎకౌంటెంట్​ బుచ్చిబాబులను కూడా ఈడీ అరెస్టు చేసింది. అయితే వీరిలో శరత్​ చంద్రారెడ్డి, మాగుంట రాఘవరెడ్డి అప్రూవర్​లుగా మారగా వారికి న్యాయస్థానం బెయిల్​ మంజూరు చేసింది. మరోవైపు రామచంద్ర పిళ్లై తన భార్యకు ఆరోగ్యం బాగాలేదనే అభ్యర్థన మేరకు న్యాయస్థానం అతనికి మధ్యంతర బెయిల్​ మంజూరు చేసింది.

ED investigation in Delhi Liquor Case : మిగిలిన వారు ఇంకా జైల్లోనే ఉండగా, దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు హైదరాబాద్​ వచ్చి కవితను ఆమె ఇంట్లోనే ప్రశ్నించారు. కానీ ఈడీ అధికారులు మాత్రం దిల్లీకి ఆమెను రెండు సార్లు పిలిపించి విచారించారు. అయితే మహిళను ఇంట్లోనే విచారించాలని చట్టంలో వెసులుబాటు ఉందని ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం ఈ నెల 28కి కేసును వాయిదా వేసింది. ఈలోపే సీబీఐ కవితకు నోటీసులు జారీ చేయడం(Delhi Liquor Case), విచారణకు హాజరు కావాలని పేర్కొనడం కలకలం రేపుతోంది. దీనిపై ఆమె న్యాయ నిపుణులను సంప్రదిస్తున్నట్లు సమాచారం.

దిల్లీ లిక్కర్ స్కామ్.. ఎమ్మెల్సీ కవిత సెల్​ ఫోన్లలోని డేటా సేకరణ

Delhi Liquor Scam: ఎత్తుగడలో భాగమా..! అత్యున్నతస్థాయి వ్యక్తుల ప్రోద్బలంతో శరత్‌రెడ్డి అప్రూవర్‌గా మారినట్లు ప్రచారం!

Last Updated : Feb 22, 2024, 9:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.