ETV Bharat / state

డ్యామ్​కు, బ్యారేజీకి తేడా లేకుండా నిర్మాణాలు చేశారు : ఉత్తమ్ కుమార్

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 14, 2024, 5:37 PM IST

Updated : Feb 14, 2024, 10:58 PM IST

Minister Uttam Kumar on Telangana Water Projects : తెలంగాణ మూడు ఆనకట్టలపై ఎన్​డీఎస్ఏ విచారణ చేయాలని కోరినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. వారి సిఫార్సు ఆధారంగానే పోలీసులను విచారణ చేయమని కోరతామన్నారు. దుర్వినియోగం అయిన ప్రతీ పైసాను తిరిగి వసూలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు.

Minister Uttam Kumar Request to NDSA Water Projects
Minister Uttam Kumar on Telangana Water Projects

Minister Uttam Kumar on Telangana Water Projects : గత ప్రభుత్వ హయాంలో డ్యాంకు, బ్యారేజీకి తేడా లేకుండా నిర్మాణాలు చేశారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. బ్యారేజీల నిర్మాణాలకు భారీగా డబ్బులు ఖర్చు చేశారని ఆరోపించారు. మూడు ఆనకట్టలపై విచారణ చేయాలని ఎన్​డీఎస్​ఏ (National Dam Safety Authority)ను కోరినట్లు తెలిపారు. వారి సిఫార్సుల ఆధారంగానే విచారణ చేయాలని పోలీసులను కోరతామని అన్నారు.

'నీ సలహాలు చాలు అని రాష్ట్ర ప్రజలు కేసీఆర్ ను ఇంట్లో కూర్చోబెట్టారు, ఇంకా ఆయన సలహాలు ఎందుకు? రాజరికంలా డబ్బులు ఖర్చు చేశారు. విజిలెన్స్ శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా విచారణ చేయాలని పోలీసులను కోరతాం. కాళేశ్వరం, సీతారామ, సమ్మక్క, దేవాదుల ఆయకట్టు ఓవర్ ల్యాప్ అవుతున్నాయని సీడబ్ల్యూసీ వాళ్లు చెప్పారు. మేధావిలా కేసీఆర్ కట్టిన బ్యారేజ్ ఇలా అయింది, మళ్లీ ఇప్పుడు నింపాలని చెప్పడం బాధ్యతారాహిత్యం. విజిలెన్స్ నివేదికను పోలీసులకు ఇచ్చి విచారణ చేయాలని కోరతాం-' ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి

'కృష్ణా నదీ ప్రాజెక్టులపై వాస్తవాలు - కేసీఆర్‌ ప్రభుత్వ తప్పిదాలు' - అసెంబ్లీలో ప్రభుత్వం నోట్

Minister Uttam Kumar Request to NDSA Water Projects : రాష్ట్రంలో డ్యామ్, బ్యారేజీ నిర్మాణాల చేయడానికి వేల కోట్ల నష్టం జరిగిందని, దానికి బాధ్యులు ఎవరు అన్నది తేలుస్తామని తెలిపారు. కేసీఆర్ చాలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని మండిపడ్డారు. నిన్నటి వరకు కేసీఆర్ ఎందుకు నోరు విప్పలేదు? ప్రశ్నించారు. కేసీఆర్ చెప్పినట్లు నీరు నిల్వ చేసి ప్రజల ప్రాణాలను పణంగా పెట్టలేమన్నారు. తమ్మిడిహట్టి చాలా మంచి డిజైన్ ప్రాజెక్ట్​కన్నా ఆయన తక్కువ వ్యయంతో 16.5 లక్షల ఎకరాలకు నీరు వచ్చేదని తెలిపారు.

కృష్ణా ప్రాజెక్టులను కేఆర్​ఎంబీకి అప్పగించే ప్రసక్తే లేదు : మంత్రి ఉత్తమ్​

" 1500 కోట్లతో మహారాష్ట్రలో 3000 ఎకరాలు భూమి సేకరించే వాళ్లం. అవినీతికి పాల్పడాలన్న దురుద్దేశంతోనే రీ డిజైనింగ్​కు పాల్పడ్డారు. ఆయకట్టులో తేడా లేదు, వ్యయం భారీగా పెరిగింది. జరిగిన దానికి కేసీఆర్ క్షమాపణ చెప్పాలి. కేసీఆర్ హెలికాప్టర్​లో వెళ్లి మూడు బ్యారేజీలు కట్టే స్థలాలను చూపి అక్కడ కట్టండి అని చెప్పి వచ్చారు. అంచనా వ్యయాలను అడ్డగోలుగా పెంచుకుంటూ పోయారు." - ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదలశాఖ మంత్రి

నీటిపారుదల శాఖలో ప్రతి ఏటా 18,000 కోట్ల వడ్డీలు చెల్లించాలని తెలిపారు. రూ.14,500 కోట్ల బిల్లులు పెండింగ్​లో ఉన్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో సబ్ కాంట్రాక్ట్ వ్యవస్థపై విచారణ కూడా విచారణ చేస్తున్నామని చెప్పారు. మంత్రిగా కాదు, ఒక దేశభక్తి కలిగిన పౌరుడిగా తన బాధ్యత అన్నారు.

నీటిపారుదల శాఖపై శ్వేతపత్రం విడుదలకు ప్రభుత్వం సన్నద్ధం - ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం

ప్రాజెక్టుల అప్పగింతపై అసెంబ్లీలో వార్ - మీరే అప్పగించారంటే మీరేనంటూ అధికార, ప్రతిపక్షాల ఫైట్

Last Updated :Feb 14, 2024, 10:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.