ప్రాజెక్టుల అప్పగింతపై అసెంబ్లీలో వార్ - మీరే అప్పగించారంటే మీరేనంటూ అధికార, ప్రతిపక్షాల ఫైట్

author img

By ETV Bharat Telangana Desk

Published : Feb 9, 2024, 7:03 PM IST

Updated : Feb 9, 2024, 7:46 PM IST

Telangana Assembly Sessions

Telangana Assembly Sessions Update Today : తెలంగాణ రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు హాట్​ హాట్​గా సాగాయి. ఇవాళ్టి సమావేశంలో కేఆర్ఎంబీకి ప్రాజెక్టుల అప్పగింతపై రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. ప్రాజెక్టులకు కృష్ణా బోర్డుకు మీరే అప్పగించారంటే మీరే అప్పగించారంటూ పరస్పర ఆరోపణలు చేసుకున్నారు.

ప్రాజెక్టుల అప్పగింతపై అసెంబ్లీలో వార్ - మీరే అప్పగించారంటే మీరేనంటూ అధికార, ప్రతిపక్షాల ఫైట్

Telangana Assembly Sessions Update Today : ప్రాజెక్టుల అప్పగింతకు గత ప్రభుత్వమే అంగీకరించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టుల అప్పగింత తర్వాత కేంద్రం నిర్వహణకు నిధులు కేటాయించారని తెలిపారు. కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల నిర్వహణకు రూ.200 కోట్ల చొప్పున నిధులు ఇచ్చారని ఆరోపించారు. ఈనెల 13వ తేదీన ఎమ్మెల్యేలు అందరం మేడిగడ్డకు వెళ్దామని సీఎం అన్నారు. ఎమ్మెల్యేలు అందరం మేడిగడ్డ(Medigadda Barrage)ను పరిశీలించి వస్తామని స్పష్టం చేశారు. ప్రాజెక్టు సందర్శనను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని, మేడిగడ్డ మేడిపండు గొప్పదనాన్ని అందరం చూసి వద్దామని పేర్కొన్నారు.

నాగార్జునసాగర్‌ను వెంటనే మన ఆధీనంలోకి తీసుకోవాలి: హరీశ్‌రావు

Harish Rao Counter To CM Revanth : మరోవైపు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) ఖండించారు. బడ్జెట్‌లో తాము ప్రతిపాదించిన విషయం నిజమేనని, కానీ కేఆర్ఎంబీకి కొన్ని షరతులు విధించామని, అందుకు ఒప్పుకుంటేనే బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని స్పష్టం చేశామని చెప్పినట్లు తెలిపారు. కానీ కేఆర్ఎంబీ తమ షరతులకు ఒప్పుకోకపోవడంతో ఒక్క రూపాయి ఇవ్వలేదని హరీశ్ రావు స్పష్టం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టు అధ్యయనానికి నిపుణుల కమిటీ ఏర్పాటుకు సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం

"మేం కేఆర్ఎంబీ, కేంద్రానికి కొన్ని షరతులు విధించాం. మా కండీషన్లు ఒప్పుకుంటేనే బోర్డుకు ప్రాజెక్టులు అప్పగించడానికి అనుమతిస్తామని చెప్పాం. కృష్ణాలో 50:50 నిష్పత్తిలో నీటి వాటా కోరాం. పోతిరెడ్డి పాడుకు 34 టీఎంసీల కంటే చుక్క నీరు ఎక్కువ తీసుకుపోవడానికి వీల్లేదని తేల్చి చెప్పాం. శ్రీశైలం ఎండీడీఎల్ 830 మెయింటైన్ చేయాలని, తాగునీటిలో 20 శాతం అకౌంటెబిలిటీ చేయాలని చెప్పాం. ఇవన్నీ ఒప్పుకుంటేనే బోర్డుకు ఇవ్వడానికి అభ్యంతరం లేదని చెప్పాం. అందుకే బడ్జెట్‌లో ప్రతిపాదనలు పెట్టాం. కానీ వారు మా షరతులు అంగీకరించలేదు. అందుకే మేం ఒక్క రూపాయి కూడా వారికి ఇవ్వలేదు." - హరీశ్ రావు, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి

మరోవైపు నాగార్జునసాగర్‌ (Nagarjuna Sagar Dispute)పై ఏపీ ఆక్రమణకు గత ప్రభుత్వమే కారణమని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు కరెక్టుగా ఒక్క రోజు ముందు ఏపీ పోలీసులను కేసీఆర్ సాగర్‌పై దింపారని, ఇదంతా పక్కా ప్లాన్‌తో జరిగిందని అన్నారు. వారి వల్లే ఇప్పుడు ప్రాజెక్టుకు ఇలాంటి పరిస్థితి ఉందని పేర్కొన్నారు.

'రెండింటిదీ ఉదాసీనతే - మేడిగడ్డ నిర్మాణ వైఫల్యంపై నిపుణుల కమిటీ వేయండి'

దీనిపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు స్పందిస్తూ నాగార్జునసాగర్‌పై ఏపీ పోలీసులు పోలింగ్‌కు కరెక్టుగా ఒక్క రోజు ముందు ఆక్రమణకు తెగబడ్డారని అన్నారు. అప్పుడు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, ఆ సమయంలో కేసీఆర్ రాష్ట్రానికి కేవలం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా మాత్రమే ఉన్నారని స్పష్టం చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు అవుతోందని, ఇప్పటికీ నాగార్జునసాగర్ ప్రాజెక్టు సీఆర్పీఎస్ పోలీసుల ఆధీనంలోనే ఉందని తెలిపారు. సాగర్‌ను వెంటనే మన ఆధీనంలోకి తీసుకోవాలని, వీలైనంత త్వరగా రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.

కేఆర్ఎంబీకి సాగర్, శ్రీశైలం అప్పగింత - అంగీకరించిన తెలుగు రాష్ట్రాలు

'కృష్ణా బోర్డు అనుమతి ఉంటేనే శ్రీశైలం, సాగర్‌ డ్యాంలపైకి ఇరు రాష్ట్రాల అధికారులకు అనుమతి'

Last Updated :Feb 9, 2024, 7:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.