ETV Bharat / state

అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్​ ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాం : మంత్రి ఉత్తమ్ - Minister Uttam on Green Energy

author img

By ETV Bharat Telangana Team

Published : May 25, 2024, 6:56 PM IST

Green Energy in Telangana : రాష్ట్రంలో అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్​ ఇవ్వడానికి కాంగ్రెస్​ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి స్పష్టం చేశారు. గ్రీన్​ ఎనర్జీ వైపు రాష్ట్రాన్ని తీసుకెళ్లడానికి కృషి చేస్తామని తెలిపారు. హైదరాబాద్​లో నిర్వహించిన క్లీన్​ ఎనర్జీ వర్క్​ షాపులో మంత్రి ఉత్తమ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Green Energy in Telangana
Green Energy in Telangana (ETV Bharat)

Minister Uttam Kumar on Green Energy : రాష్ట్రంలోని వ్యవసాయం, పరిశ్రమలు, గృహాలు తదితర అన్ని రంగాలకి 24 గంటల విద్యుత్​ ఇవ్వడానికి కాంగ్రెస్​ ప్రభుత్వం కట్టుబడి ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్​లోని ప్రెస్​ క్లబ్​ ఆధ్వర్యంలో ఓ హోటల్​లో నిర్వహించిన క్లీన్​ ఎనర్జీ వర్క్​ షాపులో మంత్రి ఉత్తమ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

బొగ్గుతో ఉత్పత్తి అయ్యే విద్యుత్​తో కాలుష్యం ఎక్కువగా వెలువడుతుందని ఈ సమావేశంలో వక్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్​ రెడ్డి తెలిపారు. అందుకే బొగ్గుతో ఉత్పత్తి అయ్యే విద్యుత్​ను క్రమంగా తగ్గిస్తూ దాని స్థానంలో సౌర, గాలి, హైడ్రో పవర్​ ఉత్పత్తి చేసేందుకు మొగ్గు చూపాలని నిపుణులు సలహాలు ఇచ్చారన్నారు. అందుకు తగ్గట్లే క్రమంగా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని నిపుణుల సూచనలు ఎప్పటికప్పుడు తీసుకుంటామని చెప్పారు.

తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్లీన్​ ఎనర్జీ వైపు ప్రయాణించే దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్​ హామీ ఇచ్చారు. పర్యావరణాన్ని రక్షించుకోవడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘటించారు. చెరువులు, కుంటలు వంటి వాటిని కూడా సంరక్షించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి తెలిపారు.

"క్లీన్​ ఎనర్జీ వర్క్​ షాపును ప్రెస్​ క్లబ్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వం అన్ని రంగాలకు 24 గంటల కరెంటు ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాము. బొగ్గు ఆధారిత విద్యుత్​ వినియోగం పర్యావరణానికి ఎలాంటి విఘాతం కలిగిస్తుందో తెలుసుకోవడానికి ఈ వర్క్​ షాపు ముఖ్య ఉద్దేశం. బొగ్గు నుంచి సోలార్​, సౌర, గాలి, హైడ్రో పవర్​ ఉత్పత్తి వైపు గ్రీన్ ఎనర్జీ వైపు మళ్లేందుకు ఈ సమావేశం ప్రధానాంశం. తప్పనిసరిగా రాష్ట్రప్రభుత్వం తరఫు నుంచి గ్రీన్​ ఎనర్జీ వైపు మళ్లేందుకు ప్రయత్నాలు చేస్తాం. పర్యావరణాన్ని కాపాడడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంది." - ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి

విద్యుత్​ వినియోగంలో తెలంగాణకు ఆరో స్థానం : రాష్ట్రంలో విద్యుత్​ వినియోగం, డిమాండ్​ రోజురోజుకీ పెరుగుతుంది. ఈ ఏడాది మార్చిలో 9,009 మిలియన్​ యూనిట్ల వినియోగంతో తెలంగాణ ఆరో స్థానంలో నిలిచింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్​ మండలి(CEA) తాజా నివేదికను వెల్లడించింది. అయితే తెలంగాణ కంటే ముందు మహారాష్ట్ర 18,795 మిలియన్​ యూనిట్లతో మొదటి స్థానంలో ఉండగా, ఆ తర్వాత గుజరాత్​ 12,948 మిలియన్​ యూనిట్లతో రెండో స్థానంలో నిలిచింది.

ఆ తర్వాత వరుసగా తమిళనాడు, ఉత్తరప్రదేశ్​, కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్​లో మాత్రం 7,358 మిలియన్​ యూనిట్ల విద్యుత్​ను వినియోగిస్తున్నారు. వినియోగం ఉన్న పలు రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో నిరంతరం నాణ్యమైన కరెంటు సరఫరా అవుతుంది. హైదరాబాద్​ నగరం రాష్ట్రంలో విద్యుత్​ వినియోగంలో ప్రథమ స్థానంలో ఉంది.

అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్​ ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాం : మంత్రి ఉత్తమ్ (ETV Bharat)

telangana thermal power plants : తెలంగాణ థర్మల్ విద్యుత్ కేంద్రాలపై 'గ్రీన్ ఎనర్జీ' భారం

BIOGAS: ఈ మార్కెట్లో కూరగాయల వ్యర్థాలతో కరెంట్‌ ఉత్పత్తిచేస్తారు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.