ETV Bharat / state

'ఇందిరమ్మ ఇళ్లు'పై ప్రభుత్వం కీలక నిర్ణయం - పట్టణ గృహాలకు కేంద్రం సాయం తీసుకోవాలని యోచన

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 9, 2024, 11:38 AM IST

Indiramma Housing Scheme in Telangana : ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి పట్టణాల్లో నిర్మించే గృహ నిర్మాణాలకు కేంద్ర సహకారన్ని తీసుకోవాలని యోచిస్తోంది.

Indiramma Housing Scheme in Telangana
పట్టణ గృహాలకు కేంద్రంతో కలిసి అడుగులు - ఇందిరమ్మ ఇళ్లపై రాష్ట్ర ప్రభుత్వ యోచన

Indiramma Housing Scheme in Telangana : తెలంగాణ ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి పట్టణాల్లో నిర్మించే గృహాలకు కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు కేంద్రం అమలు చేస్తున్న అందరికీ ఇళ్లు పథకం కింద కొంత మేర నిధులను సమీకరించడం ద్వారా ముందడుగు వేయాలని నిర్ణయం తీసుకుంది. ఇళ్ల నిర్మాణానికి కేంద్రం గతంలోనూ ఆర్థిక సాయం అందించింది. ఈ మేరకు గత సర్కారు నిర్మించిన రెండు పడకల ఇళ్ల నిర్మాణానికి 2016-17లో ఒకసారి రూ.1,100 కోట్ల మేర కేంద్రం నుంచి ఆర్థికసాయం అందింది.

Telangana Govt with Central on Houses in Town : గ్రేటర్‌ హైదరాబాద్‌(Greater Hyderabad) పరిధిలోని లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్ల సమాచారాన్ని తాజాగా కేంద్ర వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సుమారు రూ. 430 కోట్ల వరకు కేంద్రం నుంచి అందనున్నాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం మార్గదర్శకాలు వేర్వేరుగా ఉన్నాయి. పట్టణ ప్రాంతాలతో పోల్చితే గ్రామీణ ఇళ్ల నిర్మాణానికి కేంద్రం విధించిన నిబంధనలు అంత అనుకూలంగా లేవన్నది అధికారుల అభిప్రాయం. పట్టణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.లక్షన్నర వరకు సహాయాన్ని అందిస్తోంది.

గ్రామీణ ప్రాంతాల్లో ఆ మొత్తం తక్కువగా ఉండటంతో పాటు షరతులూ కూడా అధికంగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే ఇళ్లకు కేంద్రం కేవలం 72 వేల రూపాయలు మాత్రమే అందజేస్తోందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాలకు కేంద్రం నుంచి సహాయాన్ని తీసుకునే విషయంలో నిర్ణయం తీసుకోలేదని విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు వెచ్చించాలని నిర్ణయించిన సంగతి విదితమే. ఈ మేరకు పట్టణ ప్రాంతాల్లో కేంద్రం ఇచ్చే రూ.లక్షన్నర మినహాయించి మిగిలిన మూడున్నర లక్షల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం సమకూర్చాల్సి ఉంటుంది.

ఇందిరమ్మ ఇళ్లకు 4 దశల్లో సొమ్ము చెల్లింపు - మార్గదర్శకాలు ఇవే!

ఇళ్లపై రెండు లోగోలు : కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇళ్లు నిర్మించే పక్షంలో తాము రూపొందించిన లోగో(Logo)ను విధిగా ముద్రించాలన్నది కేంద్రం విధించిన షరతుల్లో ఒకటి కాగా ఇందిరమ్మ ఇళ్ల పథకం(Indiramma Illu Scheme) కోసం లోగోను తయారు చేయించాలన్న ఆలోచనలో రాష్ట్ర సర్కారు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు పట్టణ ప్రాంతాల్లో నిర్మించే ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా ఉండే గోడలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లోగోలను ముద్రించాలని యోచిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల మార్గదర్శకాల్లో కూడా ఈ అంశాన్ని పేర్కొనాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులే కీలకం : ఇందిరమ్మ ఇళ్ల పథకంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రుల పాత్ర కీలకంగా ఉంది. ఏ గ్రామంలో, మున్సిపాలిటీల్లో ఎన్ని ఇళ్లను మంజూరు చేయాలన్న అంశం నుంచి లబ్ధిదారుల ఎంపిక వరకు ఆయా జిల్లాల ఇన్‌ఛార్జి మంత్రులదే తుది నిర్ణయంగా ఉంది. ఇంటి నిర్మాణాన్ని 2 దశల్లో పరిశీలించేందుకుగాను ‘చెకర్స్‌, మార్కర్స్‌’ పేరిట తనిఖీ అధికారులను ఎంపిక చేయడంలోనూ ఇన్‌ఛార్జి మంత్రుల ఆమోదం తప్పనిసరిగా చేయాలని మార్గదర్శకాల్లో రాష్ట్ర ప్రభుత్వం పొందుపరచనున్నట్లు తెలుస్తోంది.

ఈనెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం

ఇందిరమ్మ ఇళ్ల పథకానికి హడ్కో నుంచి ప్రభుత్వానికి రూ.3 వేల కోట్ల రుణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.