ETV Bharat / politics

ఈనెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభం

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 2, 2024, 7:18 PM IST

Updated : Mar 2, 2024, 9:00 PM IST

Indiramma Housing Scheme was Launched on March 11 : రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 11న ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్​ రెడ్డి అధికారులకు ఆదేశించారు.

Telangana Govt
Indiramma Housing Scheme was Launched on March 11

Indiramma Housing Scheme was Launched on March 11 : తెలంగాణ ప్రజలకు రాష్ట్రప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆరు గ్యారంటీల్లో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ఈనెల 11న ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రకటించారు. అర్హులైన పేదలందరికీ లబ్ధి జరిగేలా మార్గదర్శకాలు, నిబంధనలు రూపొందించాలని గృహ నిర్మాణ శాఖ అధికారులను సీఎం ఆదేశించారు. అర్హులైన పేదలకు స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షలు ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిపారు. ఎన్ని దశల్లో ఎలా నిధులు విడుదల చేయాలో మార్గదర్శకాలు తయారు చేయాలని అధికారులకు ఆదేశించారు. సచివాలయంలో సీఎం రేవంత్​ రెడ్డి గృహ నిర్మాణ శాఖ అధికారులతో చర్చించారు.

తొలి విడతలో ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కేటాయించాలని నిర్ణయించారు. దశలవారీగా అర్హులైన పేదలందరికి సొంతింటి కలను నెరవేరుస్తామని సీఎం రేవంత్​ రెడ్డి వెల్లడించారు. ప్రజాపాలన(Prajapalana)లో దరఖాస్తు చేసుకున్న వారికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సీఎం సూచించారు. సొంత జాగాలో కట్టుకునే వారి కోసం ఇంటి నమూనాలు, డిజైన్​లను తయారు చేయించాలని అధికారులకు ఆదేశించారు. లబ్ధిదారులు సొంత ఇళ్లు తమకు నచ్చినట్లుగా నిర్మించుకున్నప్పటికీ అందులో తప్పనిసరిగా వంటగది, టాయిలెట్​ ఉండేలా చూడాలని తెలిపారు.

ఇళ్లైతే ఇచ్చారు - మరి మౌలిక సదుపాయాల మాటేంటి మహాప్రభో!

Indiramma Housing Scheme in Telangana : ఇంటి నిర్మాణాలను పర్యవేక్షింటే బాధ్యతలను కలెక్టర్ల ఆధ్వర్యంలో వివిధ శాఖల ఇంజినీరింగ్​ విభాగాలకు అప్పగించాలని సీఎం సూచించారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఇంజినీరింగ్​ విభాగాలకు ఈ బాధ్యతలను ఇవ్వాలని సీఎం రేవంత్​ రెడ్డి చెప్పారు. గత ప్రభుత్వం డబుల్​ బెడ్​రూం(Double Bed Romm Hosing Scheme) ఇళ్లు నిర్మాణంలో చేసిన తప్పులు జరగకుండా చూడాలని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లపై సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎం సలహాదారుడు నరేందర్ రెడ్డి, సీఎస్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇప్పటికే ఆరు గ్యారంటీల్లో కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించారు. అలాగే గృహ జ్యోతి పథకంలో భాగంగా ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటును అందిస్తున్నారు. వరి పంటకు రూ.200లను బోనస్​గా వేశారు. మరొకవైపు మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500లకే గ్యాస్​ సిలిండర్ పథకానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లు పథకం అమలు కోసం ఈ నెల 11న మూహూర్తం ఫిక్స్​ చేశారు.

త్వరలో కొత్త రేషన్‌కార్డుల పంపిణీ : పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

‘గృహలక్ష్మి’ స్థానంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం - ఆశావహుల ఎదురుచూపులు

Last Updated :Mar 2, 2024, 9:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.