ETV Bharat / state

ఈ వేసవికి ఢోకా లేదు - భాగ్యనగరవాసులకు ప్రభుత్వం భరోసా - hyderabad Water board

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 7, 2024, 5:21 PM IST

Hyderabad Water Board
Jalamandali review on Drinking Water

Jalamandali review on Drinking Water : హైదరాబాద్ మహానగరంలో ఈ వేసవిలో తాగునీటికి ఎలాంటి ఢోకా లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నగరానికి నీటిని సరఫరా చేసే జలాశయాల్లో తగినంత నీటి నిల్వలున్నాయని వెల్లడించింది. గత వేసవి కంటే ఈ వేసవిలో 139 ఎంఎల్​డీల నీటిని అదనంగా సరఫరా చేస్తున్నట్లు పేర్కొంది. నాగార్జునసాగర్​లో 15 నుంచి, ఎల్లంపల్లి ప్రాజెక్టులో మే 1 నుంచి అత్యవసర పంపింగ్ ద్వారా నగరానికి తాగునీటిని సరఫరా చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

Jalamandali review on Drinking Water : రాష్ట్ర రాజధానిలో తాగునీటి సరఫరాపై విమర్శలు వెల్లువెత్తున్న నేపథ్యంలో ప్రభుత్వం స్పందించింది. నగర పౌరుల గొంతెండకుండా తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు తెలిపింది. నగర ప్రజలకు తాగునీటి సరఫరా చేయడంలో ఎలాంటి సమస్య లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు జలమండలి(Jalamandali) ద్వారా నివేదిక తెప్పించుకున్న ప్రభుత్వం, నగరంలో నీటి సరఫరా తీరు, జలాశయాల్లో నీటి మట్టాలు, అత్యవసర సరఫరాకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.

తాగునీటి పర్యవేక్షణకు ఐఏఎస్​లు - ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం - special officers for drinking water

నగరానికి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, మంజీర, కృష్ణా ఫేజ్ 1, 2, 3, గోదావరి ఫేజ్-1 ద్వారా తాగునీరు సరఫరా జరుగుతోంది. వాటిలో నుంచి ప్రస్తుతం 2 వేల 559 ఎంఎల్​డీల నీటిని సేకరిస్తున్న జలమండలి, జీహెచ్ఎంసీ(GHMC) పరిధిలో 1082.62 ఎంఎల్​డీలు, జీహెచ్ఎంసీ అవతలి ప్రాంతాలకు 1049.58 ఎంఎల్​డీలు, ఓఆర్ఆర్ వరకు ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామపంచాయతీలు, గ్రేటెడ్​ కమ్యునిటీలు, కాలనీలకు 277.21 ఎంఎల్​డీలు, మిషన్ భగీరథకు 149.47 ఎంఎల్​డీల నీటిని సరఫరా చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Hyderabad Water Board : అలాగే హైదరాబాద్ సమీపంలో ఉన్న ఉస్మాన్ సాగర్, హిమాయత్​సాగర్ జలాశయాల్లో సమృద్ధిగా నీటి లభ్యత ఉందని, వాటి నుంచి 24 ఎంఎల్​డీల నీరు మాత్రమే సరఫరా చేస్తున్నామని పేర్కొంది. వచ్చే నెలలో 40 ఎంల్​డీల వరకు జంట జలాశయాల నుంచి సేకరించేందుకు జలమండలి ప్రణాళిక రూపొందించినట్లు తెలిపింది. గతేడాది ఏప్రిల్ 3 నాటికి 2270 ఎంఎల్​డీల నీటి సరఫరా జరిగితే ఈ ఏడాది ఏప్రిల్ 3 నాటికి 2409.53 ఎంఎల్​డీల నీటిని సరఫరా చేస్తున్నామని వివరించింది.

గతంతో పోల్చితే అదనంగా మరో 139.53 ఎంఎల్​డీ నీటిని ప్రజలకు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించింది. నాగార్జున సాగర్​లో(Nagarjuna sagar) హైదరాబాద్​లో తాగునీటి అవసరాల కోసం వచ్చే 4 నెలలకుగాను 5.60 టీఎంసీల నీరు అవసరం ఉందని అంచనా. ఈ లెక్కన సాగర్​లో 136.47 టీఎంసీల నీరు ఉంది. 131.66 టీఎంసీల వరకు డెడ్ స్టోరేజీ లభ్యత ఉంది. అయినా సరే అందులో 4.81 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశం ఉంది.

అలాగే ఎల్లంపల్లి రిజర్వాయర్​లో నగర తాగునీటి అవసరాల కోసం వచ్చే 4 నెలలకు 3.33 టీఎంసీల నీరు అవసరం ఉండగా, ప్రస్తుతం 7.71 టీఎంసీల నీరు రిజర్వాయర్​లో అందుబాటులో ఉంది. డెడ్ స్టోరేజీ 3.31 టీఎంసీల వరకు వెళ్లినా నీటి లభ్యత ఉండనుంది. అందులో 4.40 టీఎంసీల నీటిని నగరానికి సరఫరా చేసుకోవచ్చని జల మండలి ప్రభుత్వానికి సూచించింది.

నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల చేసిన అధికారులు - Sagar water release for Left Canal

'పక్కనే కాలువ పోతున్నా, ఎండిపోతున్న పంటకు నీళ్లివ్వడం లేదు' - వైరల్ అవుతోన్న యువరైతు వీడియో - farmer viral video

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.