ETV Bharat / state

తాగునీటి పర్యవేక్షణకు ఐఏఎస్​లు - ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం - special officers for drinking water

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 3, 2024, 7:02 PM IST

IAS Officers for Water Monitering
Special Officers for Drinking Water

Special Officers for Drinking Water : వేసవి కాలంలో తాగునీటి పర్యవేక్షణ కోసం ఐఏఎస్​లను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ, రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 33 జిల్లాలకు పది మంది ఐఏఎస్​లను ప్రత్యేక అధికారులుగా ప్రభుత్వం నియమించింది. జిల్లాలో తాగునీటి సరఫరా సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Special Officers for Drinking Water : రాష్ట్రంలో ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు ప్రభుత్వం అప్రమత్తమైంది. వేసవి కాలంలో తాగునీటి పర్యవేక్షణ కోసం ఐఏఎస్​లను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ రాష్ట్రప్రభుత్వం(TG GOVT) ఉత్తర్వులు జారీ చేసింది. 33 జిల్లాలకు పది మంది ఐఏఎస్​లను ప్రత్యేక అధికారులుగా ప్రభుత్వం నియమించింది.

కరెంట్, నీరు కష్టాలు ఎలా తీరు? - ప్రస్తుత పరిస్థితులపై ప్రభుత్వం చర్యలేంటి? - Power Problems in Telangana

IAS Officers for Water Monitering : వీరిలో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు ప్రశాంత్ జీవన్ పాటిల్, కుమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాలకు కృష్ణ ఆదిత్య, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఆర్.వి.కర్ణన్, ఉమ్మడి నల్గొండ జిల్లాకు అనిత రామచంద్రన్​ను నియమించింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ఎ.శరత్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు బి.విజయేంద్ర, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు శృతి ఓజా, ఉమ్మడి వరంగల్ జిల్లాకు బి.గోపీని నియమించింది.

అలాగే ఉమ్మడి మెదక్ జిల్లాకు భారతి హొలికేరీ, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు కె.సురేంద్ర మోహన్​ను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన జిల్లాల్లో వెంటనే పర్యటించాలని ఉత్తర్వుల్లో సీఎస్ శాంతికుమారి స్పష్టం చేశారు. రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులను సమన్వయం చేసుకుంటూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ పేర్కొన్నారు. జులై చివరి వరకు ప్రత్యేక అధికారులు సెలవు పెట్టవద్దని ఉత్తర్వులు జారీ చేసింది.

Rain Shortage in Telangana : రాష్ట్రంలో గత ఆరు నెలల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పాటు ప్రస్తుత ఎండల తీవ్రత కారణంగా జలాశయాలు, భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ప్రధాన జలాశయాల్లో నీటిమట్టాలు తాగు అవసరాలకు మినహా సాగుకు ఎంతమాత్రం నీటిని ఇవ్వలేని పరిస్థితికి చేరాయి. భూగర్భ జలమట్టాలు సైతం గత పదేళ్లలో ఎన్నడూ లేనిస్థాయిలో పడిపోయాయి. దీంతో సాగునీటి కోసం రైతులు కొత్త బోర్లు వేస్తున్నా ప్రయోజనం కనిపించడం లేదు.

2023 అక్టోబరు నుంచి గడిచిన మార్చి నెలాఖరు వరకు రాష్ట్రంలో 139.9 మి.మీ. వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 59.2 మి.మీటర్ల వర్షపాతమే పడింది. దీంతో ఈ ఆరు నెలల కాలంలో 57.6 శాతం లోటు ఏర్పడింది. ఇది వివిధ రకాల వనరులపై ప్రభావాన్ని చూపుతోంది. గతేడాది మార్చి నెలతో పోలిస్తే ఈ మార్చిలో భూగర్భ జల మట్టం 2.5 మీటర్లకు పడిపోయింది. ఈ ఏడాది మొత్తంగా చూస్తే వర్షాలు కురిసినట్లుగానే కనిపిస్తున్నా.. 2023 జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు మాత్రమే భారీ వర్షాలు నమోదయ్యాయి.

నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల చేసిన అధికారులు - Sagar water release for Left Canal

వేసవిలో హైదరాబాద్​కు సరిపడా తాగు నీరు - నగరవాసులకు చల్లటి వార్త​ చెప్పిన జలమండలి - Drinking Water Crisis in Hyderabad

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.