ETV Bharat / state

'పక్కనే కాలువ పోతున్నా, ఎండిపోతున్న పంటకు నీళ్లివ్వడం లేదు' - వైరల్ అవుతోన్న యువరైతు వీడియో - farmer viral video

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 5, 2024, 5:16 PM IST

Water Crisis in Telangana
Young Farmer viral video

Young Farmer viral video : పక్కనే కాలువ పోతున్నా, తడారిపోతున్న పంటకు నీళ్లు ఇవ్వండని మొరపెట్టుకున్న పట్టించుకోవడం లేదంటూ, కాంగ్రెస్ సర్కారుపై ఓ యువరైతు ఫైర్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పంటలకు చుక్కనీరు వదలడంలేదని, సాగర్ కాలువలోని నీటిని వాడుకోకుండా ఎక్కడికక్కడ ప్రభుత్వాధికారులు కాపలా కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.

'పక్కనే కాలువ పోతున్నా, ఎండిపోతున్న పంటకు నీళ్లివ్వడం లేదు' - వైరల్ అవుతోన్న యువరైతు వీడియో

Young Farmer viral video : కళ్లముందే ఎండిపోతున్న పంటకు ఒక్క తడి నీళ్లు ఇవ్వండని రైతులు మొరపెట్టుకున్న, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్(Minister Uttam) పట్టించుకోవడం లేదంటూ, కాంగ్రెస్ సర్కారుపై ఓ యువరైతు ఆగ్రహం వ్యక్తంచేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలోని పాలకవీడు మండలం ఎల్లాపురం గ్రామానికి చెందిన పేరుమల సతీష్ అనే యువకుడు సాగర్ నీటి విడుదల గురించి మాట్లాడాడు.

యాసంగిలోనూ జల కళ సంతరించుకున్న కూడవెల్లి వాగు - Kudavelly Vagu in Siddipet

Water Crisis in Telangana : ఈ వీడియోలో సదరు రైతు మాట్లాడుతూ, తన వెనక పారుతున్న కాలువను చూసి చాలా మంది ఇక్కడి ప్రాంత రైతులు అదృష్టవంతులు అనుకుంటారని కానీ, కాలువల కింద ఉన్న భూములకు చుక్క నీరు అందడం లేదని వాపోయాడు. ఎవరూ నీటిని వాడుకోకుండా కాలువ ప్రతి గేటు వద్ద పోలీసులు, ఎమ్మార్వోలను కాపలాగా ఉంచి కాంగ్రెస్ ప్రభుత్వం వంద కిలో మీటర్ల దూరంలో ఉన్న ఖమ్మం జిల్లాకు నీటిని తరలిస్తున్నారని వాపోయాడు.

ప్రతి గ్రామంలో పశువులు నీళ్లు తాగడానికి చెరువుల్లో సైతం నీళ్లు లేవని, గ్రౌండ్ వాటర్ లేకపోవడంతో గ్రామాల్లో నీటి ఎద్దడి మొదలైందన్నారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్ రెడ్డిది తమ జిల్లాయే అని, నీటిని విడుదల చేయాలని వందల మంది ధర్నాలు చేసిన పట్టించుకోవడం లేదన్నారు. ఈ యాసంగీ సీజన్​లో 15 ఎకరాల్లో పంట వేసినా, అర ఎకరం కోసే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేవడంలో కీలక పాత్ర పోషించిన పొంగులేటి కారణంగానే, నీటిని ఖమ్మం జిల్లాకు తరలిస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం రైతు మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ప్రస్తుతం సాగర్ ఎడమకాలువ ద్వారా దిగువకు నీళ్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. వేసవికాలం దృష్ట్యా తాగునీటి అవసరాలకు నాగార్జున సాగర్ నుంచి నీటిని విడుదల చేసి కింద ఉన్నటువంటి రిజర్వాయర్లను నింపుతున్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు నీటిని తరలిస్తున్నారు. పాలేరులో జలాశయంలో నీరు డెడ్​స్టోరేజీకి చేరుకున్న నేపథ్యంలో, ఖమ్మం ప్రజల దాహార్తిని తీర్చేందుకు పాలేరును నింపుతున్నారు. ప్రస్తుతం సాగర్ నుంచి 2500 క్యూసెక్కుల మేర నీటి విడుదల కొనసాగుతోంది.

సాగర్​ ఆయకట్టు రైతులకు నీటికష్టాలు - ఎండిన పంటలను తగలబెడుతున్న అన్నదాతలు

నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీరు విడుదల చేసిన అధికారులు - Sagar water release for Left Canal

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.