ETV Bharat / state

జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్​ పరీక్ష - టీఎస్​పీఎస్సీ ప్రకటన

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 26, 2024, 8:40 PM IST

Updated : Feb 26, 2024, 10:15 PM IST

TSPSC Group1 Important Dates
Group-1 Prelims Dates Release

Group-1 Prelims Dates Release : గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షపై టీఎస్​పీఎస్సీ కీలక ప్రకటన చేసింది. జూన్ 9వ తేదీన పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇటీవలే టీఎస్‌పీఎస్సీ 563 పోస్టులతో గ్రూప్‌-1 కొత్త నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందుకోసం ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుండగా, మార్చి 14 చివరి తేదీ చివరితేదీ కావడం గమనార్హం.

Group-1 Prelims Dates Release : గ్రూప్ 1 ప్రిమిల్స్ కి తేదీ ఖరారైంది. జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ జరగనున్నట్టు టీఎస్​పీఎస్సీ ప్రకటించింది. పేపర్ లీకేజీ వ్యవహారం, పరీక్షల్లో సరైన నిబంధనలు పాటించని కారణగా, గతంలో జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్​ను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా నోటిఫై చేసిన 60 పోస్టులతో కలిపి 563 పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించిన టీఎస్​పీఎస్సీ(TSPSC), ఈ మేరకు ఈ నెల 19న నోటిఫికేషన్ విడుదల చేసింది.

ప్రస్తుతం ఆన్​లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగా, మార్చి 14వ తేదీ సాయంత్రం 5గంటల వరకు అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో అప్లికేషన్లను స్వీకరించనున్నట్టు టీఎస్​పీఎస్సీ ప్రకటనలో పేర్కొంది. దరఖాస్తుల్లో ఏమైనా పొరపాట్లు దొర్లితే మార్చి 23 ఉదయం 10గంటల నుంచి 27 సాయంత్రం 5గంటల వరకు సరిచేసుకోవచ్చని పేర్కొంది.

TSPSC Group1 Important Dates : అదేవిధంగా ఈ ఏడాది సెప్టెంబర్‌/అక్టోబర్‌లో మెయిన్‌ పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఈక్రమంలోనే తాజాగా జూన్ 9ని గ్రూప్ 1 పరీక్ష తేదీగా టీఎస్​పీఎస్సీ ఖరారుచేసింది. గతంలో గ్రూప్-1 కు దరఖాస్తు(Group 1 Application) చేసుకున్న వారు మరో మారు దరఖాస్తు చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేసింది. గత నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి ఫీజు నుంచి మినహాయింపు అవకాశం సైతం కల్పించింది.

గ్రూప్​ -1 పరీక్షకు నోటిఫికేషన్ వచ్చేసింది - మరి ప్రిపరేషన్​ ఎలా ఉండాలి?

Revanth Reddy on Group 1 Notification 2024 : నిరుద్యోగుల బాధ, కష్టం, వారి లక్ష్యం, ప్రభుత్వంలో వారి సేవలు తదితర అంశాలపై దృష్టి సారించిన కాంగ్రెస్ సర్కార్, ఇచ్చిన మాట మేరకు నోటిఫికేషన్ల జారీకి వడివడిగా అడుగులేస్తోంది. మేనిఫెస్టోలో ప్రకటించినట్లు ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీపై కసరత్తు ముమ్మరం చేస్తోంది. ప్రశ్నపత్రాలు లీకైనందున గతంలో నిర్వహించిన గ్రూప్‌-1 పరీక్షను రేవంత్ సర్కార్ రద్దు చేయించింది. అనంతరం 60 ఖాళీలు అదనంగా చేర్చి, కొత్త నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

అందులో భాగంగానే సరిగా 100 రోజులు కాలవ్యవధిలో ప్రిలిమ్స్ పరీక్షకు తేదీలు సైతం ఇవాళ ఖరారు చేసింది. అభ్యర్థులకు వయో పరిమితి(Candidate Age Limit) సడలింపు ఇచ్చి అందరికీ అవకాశం కల్పించారు. నియామక బోర్డుల ద్వారా అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నట్లు ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం పరీక్షలు నిర్వహించి నియామక ప్రక్రియ పూర్తిచేస్తామని ఆయన స్పష్టం చేశారు.

CM Revanth Focus on Jobs Recruitment : ఇలా రేవంత్‌ సర్కారు ఉద్యోగాల భర్తీ చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపుతుండటంతో నిరుద్యోగుల్లో కొత్తఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే ఎలాగైనా ఉద్యోగం సాధించాలని చాలామంది భాగ్యనగరానికి పయనం అవుతుండగా, మరి కొందరు జిల్లాల్లోని గ్రంథాలయాలు, శిక్షణ కేంద్రాల్లో, ఇంకొందరు ఇళ్ల దగ్గరే ఉంటూ సన్నద్ధం అవుతున్నారు.

తెలంగాణలో ప్రభుత్వ కొలువుల జాతర షురూ - ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ ఫోకస్​

టీఎస్​పీఎస్సీ కీలక నిర్ణయం - గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌ రద్దు చేసినట్లు ప్రకటన

Last Updated :Feb 26, 2024, 10:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.