ETV Bharat / state

ఎన్నో రాష్ట్రాలను ముప్పుతిప్పలు పెట్టి, తెలంగాణ పోలీసులకు చిక్కి - 'మత్తు'మాఫియా కింగ్​ పిన్​ స్టాన్లీ అరెస్ట్

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 7, 2024, 10:55 AM IST

Drug Sized in Hyderabad : దేశవ్యాప్తంగా వందలాది మంది ఏజెంట్లు. అనేక మంది మాదక ద్రవ్యాల విక్రేతలతో సంబంధాలు. ఎలాంటి మత్తు పదార్థాలైనా గుట్టుచప్పుడు కాకుండా చేరవేస్తాడు. వివిధ రాష్ట్రాల పోలీసులు గాలిస్తున్నా దొరక్కుండా తిరుగుతున్న నైజీరియాకు చెందిన మత్తు సామ్రాజ్య సృష్టికర్త తెలంగాణ టీన్యాబ్ పోలీసులకు చిక్కాడు. 40 రోజుల పాటు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి నిందితుడిని వేటాడి పట్టుకున్నారు.

Drug Sized in Hyderabad
Drug Sized
పంజాగుట్టలో డ్రగ్స్‌ విక్రయిస్తున్న నైజీరియన్‌ అరెస్టు - కోట్ల రూపాయల విలువైన డ్రగ్స్‌, 9 చరవాణులు స్వాధీనం

Drug Sized in Hyderabad : హైదరాబాద్‌లో ఏకంగా రూ.8 కోట్ల విలువైన మత్తు పదార్థాలు పట్టుబడటం, అనేక రాష్ట్రాల పోలీసులు గాలిస్తున్న నైజీరియా డ్రగ్ కింగ్ పిన్ స్టాన్లీని తెలంగాణ టీన్యాబ్‌ పోలీసులు పట్టుకోవడం సంచలనంగా మారింది. పెద్ద ఎత్తున మత్తు పదార్థాలు నగరంలో దొరకడం ఇదే తొలిసారి అని పోలీసులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా 500 పైచిలుకు మత్తు పదార్థాల కొనుగోలుదారులు విక్రయదారులతో స్టాన్లీకి సంబంధాలు ఉన్నట్లు బయటపడింది. దీంతో ఎవరెవరు ఇతని వద్ద మాదక ద్రవ్యాలు(Drugs) కొనుగోలు చేశారనే అంశంపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

98 లక్షలు కొల్లగొట్టి, క్షణాల్లోనే 11 ఖాతాలకు బదిలీ - పోలీసుల చాకచక్యంతో 85 లక్షలు సేఫ్

Rs.8 Crore Worth Drug Sized in Hyderabad : మాదక ద్రవ్యాలు స్టాన్లీ వద్ద కొనుగోలు చేసి వాడిన వారిలో హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారి వివరాలు కూడా రాబడుతున్నారు. ఎర్రమంజిల్ వద్ద పిన్‌ స్టాన్లీని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద అర కిలోకు పైగా కొకైన్‌తో పాటు హెరాయిన్ తదితర మత్తు పదార్థాలు, అమెరికాలో సాగయ్యే గంజాయి ఓషన్ గ్రీన్ కిన్నావిస్ 45 గ్రాములు లభించింది. ఇది ఒక గ్రాముకు రూ.5000 వరకు ధర ఉంటుందని పోలీసులు తెలిపారు. డ్రగ్స్ సరఫరాదారు స్టాన్లీ స్వసలం నైజీరియాలోని అనంబ్ర రాష్ట్రం. 2009లో బిజినెస్ వీసాపై ముంబయి చేరాడు.

Telangana Teenab Police Caught Ganja : అంధేరి ప్రాంతంలో మిత్రుడు జెవెల్తో కలిసి రెడీమేడ్ వస్త్ర వ్యాపారం ప్రారంభించాడు. ఏడాది తరువాత గోవా, కండోలిమ్ ప్రాంతాలకు మకాం మార్చి అక్కడా వస్త్ర వ్యాపారం నిర్వహించాడు. క్రమంగా గోవా పరిసర ప్రాంతాల్లోని నైజీరియన్లతో స్నేహం ఏర్పడింది. వారితో కలిసి మద్యం, కొకైన్ తీసుకునేవాడు. అడ్డదారిలో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదనకు డ్రగ్స్ విక్రయం వైపు మళ్లాడు. కొద్ది మొత్తంలో కొకైన్, హెరాయిన్ వంటివి కొనుగోలు చేసి పర్యాటకులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకునేవాడు. 2012లో పాస్‌పోర్ట్‌ పోగొట్టుకున్నాడు. దీంతో స్టాన్లీ అక్రమంగా నివాసం ఉంటున్నట్టు గుర్తించిన పోలీసులు అతడిని అరెస్టు చేసి 6 నెలలు జైల్లో ఉంచారు.

శంషాబాద్​ విమానాశ్రయంలో మహిళా ప్రయాణికురాలి నుంచి భారీగా హెరాయిన్​ పట్టివేత - విలువ తెలిస్తే షాక్!

జైలు నుంచి విడుదలయ్యాక నిందితుడికి భర్త నుంచి వేరుగా ఉంటున్న రాజస్థాన్‌కు చెందిన ఉపాచందేల్ పరిచయమైంది. 2014లో వీరిద్దరూ పెళ్లి చేసుకొని కిరాణా దుకాణం ప్రారంభించారు. 2017లో గోవాలో గంజాయి, కొకైన్, ఎండీఎంఏ, ఎక్సటసీ డ్రగ్స్ చేరవేస్తూ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులకు పట్టుబడి జైలుకెళ్లారు. కరోనా లాక్‌డౌన్‌తో వ్యాపారం మందగించింది. వస్తువులు కొనేందుకు దుకాణానికి వచ్చే ఇద్దరు నైజీరియన్లు స్టాన్లీకి మాదక ద్రవ్యాలు చేరవేసే అవకాశం ఇచ్చారు. రూ.2 వేల కమీషన్ ఇచ్చే ఒప్పందం కుదుర్చుకున్నారు. కరోనా లాక్‌డౌన్ అనంతరం ఇద్దరు నైజీరియన్లు సొంత దేశానికి వెళ్లటంతో ఇతడే సొంత దందా మొదలుపెట్టాడు.

Ganja Sized : నైజీరియాలో మత్తు సామ్రాజ్యంతో సంబంధాలు ఏర్పరచుకొని స్టాన్లీ కీలకంగా ఎదిగాడు. గోవాలో ఖరీదైన భవనంలో భార్యా పిల్లలతో నివాసం ఉంటున్నాడు. ఇటీవలే రూ.కోటి విలువైన కారు కొనుగోలు చేశాడు. గ్రాముల్లో సరఫరా చేసే స్టాన్లీ అనతి కాలంలోనే కిలోల కొద్దీ డ్రగ్స్ స్మగ్లింగ్ చేసే స్థాయికి ఎదిగాడు. నైజీరియాలో మత్తు పదార్థాలు తయారు చేసే ముఠాలతో నేరుగా మంతనాలు సాగించేవాడు. అక్కడి నుంచి విమాన మార్గంలో నైజీరియన్లు కడుపులో మాదకద్రవ్యాలు దాచి ముంబయి చేర్చేవారు.

గంజాయి పట్టివేత : అక్కడ వ్యాపారాలు చేసే కొందరు నైజీరియన్లను దళారులుగా మార్చి, వారి ద్వారా డ్రగ్స్, ఆర్థిక లావాదేవీలు నిర్వహించేవాడు. పుణెలోని కొరియర్ సర్వీసెస్ ద్వారా మత్తు పదార్థాలను బెంగళూరు, ముంబయి, రాజస్థాన్, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో దళారులను నియమించుకొని 500 మందికిపైగా కొనుగోలు దారులకు స్టాన్లీ సరుకు చేరవేస్తున్నాడు. ఎర్రమంజిల్ సమీపంలో స్టాన్లీని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. కొనుగోలుదారులు, విక్రేతలు, వాడకందార్ల వివరాలు సేకరించి నోటీసులు జారీ చేస్తామని తెలిపారు. స్టాన్లీతో సంబంధాలున్న పెడ్లర్స్, నైజీరియన్ల గురించి వివరాలు రాబడుతున్నారు.

చాక్లెట్లు తిని విద్యార్థుల వింత ప్రవర్తన - ఆరా తీస్తే గంజాయి ముఠా గుట్టురట్టు

రాష్ట్రంలో మరో 2 డ్రగ్స్ గ్యాంగుల పట్టివేత, అరెస్టైన వారిలో 21 ఏళ్ల యువతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.