ETV Bharat / state

అల్ఫాజోలం కొకైన్​ కంటే ప్రమాదకరం - అక్రమంగా విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు : సందీప్ శాండిల్య

author img

By ETV Bharat Telangana Team

Published : Dec 25, 2023, 10:34 PM IST

TSNAB Director Sandeep Shandilya on Alprazolam Drug : మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేలా తెలంగాణ పోలీస్ యంత్రాంగం పటిష్ఠ చర్యలు చేపడుతోంది. డ్రగ్స్​ను సమూలంగా అంతమొందించేందుకు ఏర్పాటైన టీఎస్​న్యాబ్, పగడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఇటీవల కాలంలో మాదక ద్రవ్యాల్లో కొకైన్ కంటే అతి ప్రమాదకరమైన అల్ఫాజోలం వాడకాలపై దృష్టి సారించింది. అక్రమంగా విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టీఎస్​న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య హెచ్చరించారు.

NAB Director Sandeep Shandilya on Drugs
TSNAB Director Sandeep Shandilya on Alprazolam Drug

TSNAB Director Sandeep Shandilya on Alprazolam Drug : మాదక ద్రవ్యాల్లో అల్ఫాజోలం కొకైన్(Cocaine Drug) కంటే ప్రమాదకరమని, అక్రమంగా విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టీఎస్‌న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్యా హెచ్చరించారు. తెలంగాణలో అల్ఫాజోలం తలనొప్పిగా మారిందని, అల్ఫాజోలం రవాణా, పలువురి చేతులు మారటంపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఆయన తెలిపారు. ఇటీవల రూ.3.14 కోట్లు విలువ చేసే 31.42 కిలోల అల్ఫాజోలాన్ని నాగర్​కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో పట్టుకున్నారు.

TSNAB Focus on Drugs Control in Telangana : ఈ సమాచారం ఆధారంగా టీఎస్‌న్యాబ్ పోలీసులు రెండు రోజుల క్రితం సంగారెడ్డి జిన్నారంలోని మూతపడిన పరిశ్రమలో 14 కిలోల నార్డజెపమ్ డ్రగ్ పట్టుబడిందని తెలిపారు. ఈ కేసులో నలుగురుని అరెస్ట్ చేసినట్లు వివరించారు. మరో కేసులో సూరారం పరిధిలో నరేందర్ అనే వ్యక్తి నుంచి 10 కిలోల అల్ఫాజోలం స్వాధీనం చేసుకున్నామని, ఇతను విజయవాడ పరమేశ్వరా కెమికల్స్(Chemicals) ఎండీకి చెందిన కిరణ్ కుమార్ అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లు గుర్తించామన్నారు.

రాష్ట్రంలో డ్రగ్స్‌ కట్టడిపై టీఎస్‌న్యాబ్‌ ఫోకస్ - బ్రీత్ ఎనలైజర్ తరహా కిట్లతో తనిఖీలకు సమాయత్తం

Sandeep Shandilya on Drugs Control in Telangana : చర్లపల్లిలో ఓ పరిశ్రమను లీజ్​కు తీసుకుని లింగయ్య గౌడ్​తో కలిసి కిరణ్‌ అల్ఫాజోలం తయారు చేస్తున్నారన్నారు. మరో కేసులో విధుల నుంచి తొలగించబడిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ కూడా ఈ దందాలో ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. దిల్లీ నుంచి వచ్చిన పార్శిళ్లలో సైతం 34 కిలోలు పలువురి చేతులు మారినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఇలా అల్ఫాజోలం విక్రయిస్తున్న నిందితుల్లో మాజీ పోలీసులు సహా కామారెడ్డికి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ కూడా ఉన్నట్లు గుర్తించామన్నారు. హైదరాబాద్​లో ఇప్పటి వరకు 66 కేసులు నమోదు చేసినట్లు ఆయన వివరించారు.

రాష్ట్రంలో డ్రగ్స్, నకిలీ విత్తనాలు అనే పదాలు వినిపించేందుకు వీల్లేదు - పోలీసులకు సీఎం కీలక ఆదేశాలు

CM Revanth Reddy warns on Drugs Peddlers : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్స రహిత రాష్ట్రంగా మార్చడమే సంకల్పంగా బాటలు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆదివారం భూకబ్జా, డ్రగ్స్, నకిలీ విత్తనాల వంటి చర్యలకు పాల్పడుతున్న వారిని ఉక్కుపాదంతో అణచి వేయాలని పోలీసు ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. అదేవిధంగా ఫ్రెండ్లీ పోలీసింగ్​ను(Friendly Policing) దుర్వినియోగం చేస్తే ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. అలానే సామాజిక మాధ్యమాల ద్వారా వైషమ్యాలను సృష్టించే వారిపై దృష్టి పెట్టాలని సీఎం చెప్పారు.

మాదకద్రవ్యాలపై పోలీసుల ఉక్కుపాదం - ఎండీఎంఏ డ్రగ్స్ విక్రయించే ముఠా అరెస్ట్

భాగ్యనగరంలో డ్రగ్స్​ తయారీ ముఠా గుట్టురట్టు - ముగ్గురు నిందితుల అరెస్ట్

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.