ETV Bharat / state

చాక్లెట్లు తిని విద్యార్థుల వింత ప్రవర్తన - ఆరా తీస్తే గంజాయి ముఠా గుట్టురట్టు

author img

By ETV Bharat Telangana Team

Published : Jan 10, 2024, 12:54 PM IST

Updated : Jan 10, 2024, 7:00 PM IST

Students Behaving Strangely by Eating Chocolates : వారంతా కొత్తూరు సమీప పరిశ్రమల్లో పనిచేసే ఒడిశా కూలీలు. డబ్బు సంపాదించాలనే ఆశతో అడ్డదార్లు తొక్కడం ప్రారంభించారు. గంజాయి చాక్లెట్లను అమ్మి సొమ్ముచేసుకుంటూ యువతకు గాలం వేస్తున్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు, పరిశ్రమల్లో పనిచేసే శ్రామికులను లక్ష్యంగా చేసుకుని మత్తు చాక్లెట్ల దందా సాగిస్తున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు ముగ్గురు నిందితులతో పాటు 8 కిలోల బరువు ఉన్న 42 చాక్లెట్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నామని శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు.

ganja chocolates kothuru
Students Behaving Strangely by Eating Chocolates

చాక్లెట్లు తిని విద్యార్థుల వింత ప్రవర్తన - ఆరా తీస్తే గంజాయి ముఠా గుట్టురట్టు

Students Behaving Strangely by Eating Chocolates : విద్యార్థులు చాక్లెట్స్​ తిని తరగతి గదిలో వింతగా ప్రవర్తిస్తున్నారు. ఉపాధ్యాయుల ఈ విషయాన్ని గమనించి ఆరా తీయగా గంజాయి కలిసిందని తెలిసింది. వెంటనే దీనిపై పోలీసులకు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేయగా అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఒడిశాకు చెందిన వ్యక్తులు చాక్లెట్​లో గంజాయి పెట్టి అమ్ముతున్నారని గుర్తించిన పోలీసులు, నిందితుల్లో ముగ్గురుని అరెస్ట్(3 Persons Arrest in Chocolate Drug Case)​ చేయగా మరో ఒక్కడు పరారీలో ఉన్నాడని తెలిపారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది.

Chocolates Drugs Case in Rangareddy : శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా షాద్​నగర్ నియోజకవర్గంలోని కొత్తూరు ప్రభుత్వ పాఠశాల సమీపంలోని పాన్​షాప్​లో విద్యార్ధులు చాక్లెట్లు(Drug Chocolates in Rangareddy) తరచూ విక్రయించారు. వాటిని తిన్న విద్యార్థులు కాసేపటికే వింతగా ప్రవర్తించారు. పాఠశాల సమీపంలోని పాన్ డబ్బాలు లభించే చాక్లెట్లను తిని తరగతి గదిలోకి వచ్చాక మత్తులోకి జారుకుంటున్నారు. ఆ పాఠశాల్లో చదువుతున్న ఉత్తర భారత దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కొద్దిరోజులుగా వింతగా ప్రవర్తించడాన్ని ఉపాధ్యాయులు గమనించారు. తీరా ఆరా తీయగా చాక్లెట్లు తిన్న తర్వాత విద్యార్థులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారని తెలుసుకున్నారు. వెంటనే ఈ విషయాన్ని స్థానిక పోలీస్ స్టేషన్​లో సమాచారం ఇచ్చారు. వెంటనే ఎస్​ఓటీ బృందం దీనిపై ఆరా తీసింది.

DCP Reaction on Chocolate Drug Case : మంగళవారం చాక్లెట్​ అమ్ముతున్న ఇద్దరు దుకాణదారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షాపు దగ్గర నుంచి చార్మినార్ గోల్డ్ మునక పేరిట 8 కిలోల బరువు ఉన్న 42 చాక్లెట్ ప్యాకెట్లను చాక్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ దాదాపు రూ.1.30 లక్షలు ఉంటుందని వెల్లడించారు. అనంతరం చాక్లెట్లలో గంజాయి కలిపినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న చుట్టు పక్కల ప్రాంతాల షాపు యజమానులు దుకాణం మూసివేసి అజ్ఞాతంలోకి వెళ్లారు. అనంతరం పూర్తిగా విచారణ చేయగా ఒడిశా నుంచి వచ్చిన నలుగురు కొత్తూరు ప్రభుత్వ పాఠశాల పరిసర ప్రాంతాల్లో స్థానికంగా ఉండే పిల్లలకు చాక్లెట్ రూపంలో డ్రగ్స్ అమ్ముతున్నరని గుర్తించారు. దీంతో ఆ నలుగురిలో దీరేంద్ర బెహరా, సోమనాథ్ బెహరా, సూర్యమని అరెస్టు చేశామని మరో వ్యక్తి పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు.

"ప్రధాన నిందితుడు దీరేంద్ర బెహెర రోజు గడిచేందుకు డబ్బుల కోసం ఒడిశా నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి కొత్తురు ప్రాంతంలో ఎక్కువ ధరకు అమ్ముతున్నాడు. నిందితులు కొత్త మార్గంలో డ్రగ్స్​ని వినియోగదారుల అందించేలా ప్రయత్నం చేశాడు. ఇటువంటి వాటిని ఉపేక్షించేది లేదు. నిందితులు ఒక్కో చాక్లేట్ రూ.30 నుంచి రూ.50 చొప్పున అమ్ముతున్నారు. కొత్తూరు మాత్రమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ డ్రగ్స్ ఉన్నట్లు సమాచారం ఉంది. విద్యార్థులు, నిరుద్యోగులను లక్ష్యంగా పెట్టుకుని అమ్ముతున్నారు. వీటిపై ప్రత్యేక నిఘా పెట్టాం."- నారాయణరెడ్డి, శంషాబాద్ డీసీపీ

టమాటా ట్రేలలో రూ.80లక్షల గంజాయి - గుట్టురట్టు చేసిన పోలీసులు

మత్తు దందాకు అడ్డాగా హైదరాబాద్‌ - గంజాయి గ్యాంగ్​ను పట్టుకునేందుకు పోలీసుల నయా ప్లాన్

Last Updated : Jan 10, 2024, 7:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.