ETV Bharat / state

యజమాని కారు, నగదుతో ఉడాయించిన డ్రైవర్​ అరెస్ట్​ - పెళ్లి చేసుకొని స్థిరాపడాలని చోరీ - Police Arrest Thief Driver

author img

By ETV Bharat Telangana Team

Published : Apr 8, 2024, 10:59 PM IST

Police Arrest Thief Driver
Driver Arrested for Stealing Owner Car, Money

Driver Arrested for Stealing Owner Car, Money : యాజమాని వద్ద నలభై లక్షల నగదు, కారుతో పారిపోయిన డ్రైవర్‌ విజేంద్ర సింగ్‌ను హైదరాబాద్‌ నారాయణగూడ పోలీసులు అరెస్టు చేశారు. అత్తాపూర్‌కు చెందిన వినయ్‌కుమార్‌ ఫిబ్రవరి 24న రామంతపూర్‌ వెళ్తుండగా, వాటర్ బాటిల్ కొనేందుకు షాపులోకి వెళ్లిన సమయంలో డ్రైవర్‌ కారుతో పారిపోయాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. అతని ఫిర్యాదుతో ప్రత్యేక టీమ్​తో హైదరాబాద్, రాజస్థాన్ రాష్ట్రంలో గాలించి, రాజస్థాన్​లో నిందితుడిని అదుపులోకి తీసుకొన్నట్లు పోలీసులు తెలిపారు. విజేంద్రసింగ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు, దొంగిలించిన డబ్బుతో రూ.11లక్షలు పెట్టి కారు కొని, మిగిలిన నగదుతో బిజినెస్ పెట్టి సెటిల్ అవ్వాలని అనుకున్నట్లు విచారణలో వెళ్లడైందని డీసీపీ తెలిపారు.

Driver Arrested for Stealing Owner Car, Money : మరి కొద్ది రోజుల్లో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైన ఓ దొంగ డ్రైవర్ కటకటాలపాలయ్యాడు. ఓ యాజమాని వద్ద నలభై లక్షల రూపాయల నగదు, కారుతో ఉడాయించిన డైవర్​ను హైదరాబాద్ నారాయణగూడ పోలీసులు అరెస్టు చేశారు. పెళ్లి చేసుకునే ఉద్దేశ్యంతో కొట్టేసిన నగదుతో(Stolen Money) బిజినెస్ చేసి, సెటిల్ అవుదాం అనుకున్నాడు. ఇటీవలే ఎంగేజ్​మెంట్​ చేసుకొని, మరికొద్ది రోజుల్లో పెళ్లి చేసుకొనేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండగా పోలీసులకు చిక్కాడు.

పెళ్లి పీటలు ఎక్కబోయే ఆ డ్రైవర్​ను పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. తూర్పు మండల డీసీపీ గిరిధర్ రావు వెల్లడించిన వివరాలు ప్రకారం, అత్తాపూర్‌కి చెందిన మర్చంట్​ వినయ్‌కుమార్‌ గుప్తా వద్ద రాజస్థాన్‌కు చెందిన విజేంద్ర సింగ్‌ ఏడాదిన్నర కిందట కారు డ్రైవర్‌గా(Car Driver) పనిలో చేరాడు. నమ్మకంగా ఉంటూ ఇంటి మనిషిలా మెలిగాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న వినయ్‌ రామంతపూర్‌ వెళ్తుండగా, దాహం వేయడంతో హైదర్‌గూడ నిలోఫర్‌ కేఫ్‌ వద్ద కారు ఆపి, నీళ్ల బాటిల్‌ కొనేందుకు లోపలికి వెళ్లారు.

పబ్లిక్ కేబుళ్లతో ఫోన్ ఛార్జింగ్ యమా డేంజర్​- ఈ టిప్స్ పాటించకపోతే మీ డేటా అంతా చోరీ! - Public USB Phone Charging problems

"యజమాని వినయ్​ ముందుగా రూ.3 లక్షలు నగదు, కారుతో డ్రైవర్​ ఉడాయించినట్లు తెలిపారు. మళ్లీ తరవాత రోజు వచ్చి సొమ్ము లెక్కింపు సరిగా చూసుకోలేదు. అందులో ఉన్నది మూడు కాదు నలభై లక్షల రూపాయలు ఉన్నాయని చెప్పారు. పెద్ద మొత్తంలో చోరీ ఉండే సరికి ఇంకాస్త త్వరగా ఉన్నతాధికారుల పర్మిషన్​ తీసుకొని ప్రత్యేక టీమ్​ను అలర్ట్​ చేశాం."-గిరిధర్ రావు, ఈస్ట్​ జోన్​ డీసీపీ

బయటకొచ్చే సరికి కారు, డ్రైవర్‌ విజేంద్ర సింగ్‌ కనిపించకపోవడంతో కంగుతిన్న వినయ్​ కుమార్,​ అతడికి ఫోన్‌ చేయగా స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. వెంటనే వ్యాపారి(Steel Merchant) వినయ్‌ నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారుతోపాటు అందులో ఉన్న రూ. 40లక్షల నగదును ఎత్తుకెళ్లిన్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. యజమాని వినయ్‌కుమార్‌ ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన ప్రత్యేక టీమ్​లు నిందితుడు విజేంద్రను తన స్వగ్రామమైన రాజస్థాన్‌లో అదుపులోకి తీసుకున్నారు.

విచారణలో మొదటగా దొంగలించిన డబ్బులన్నీ ఖర్చు అయ్యాయని, ఐపీఎల్ బెట్టింగ్‌లో పోగొట్టుకున్నానని బుకాయించాడు. దీంతో పోలీసులు తమదైన శైలిలో ఆరా తీయగా, అసలు విషయం బయటపెట్టాడు. త్వరలో వివాహం చేసుకోబోతున్నట్లు, దొంగిలించిన డబ్బుతో రూ.11లక్షలు పెట్టి కారు కొన్నానని, మిగతా డబ్బుతో వ్యాపారం చేయాలనుకున్నట్లు చెప్పుకొచ్చాడు. కానీ, పోలీసులు వినయ్‌ కారుతోపాటు కొత్తగా కొనుగోలు చేసిన కారు, రూ.20.70లక్షల సొమ్మును, రెండు మొబైల్‌ ఫోన్లను(Mobile phones) స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన డబ్బుతో ఇన్నిరోజులు విలాసవంతంగా గడిపినట్లు ఒప్పుకున్నట్లు డీసీపీ తెలిపారు. అతడిపై కేసు నమోదు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచిన అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.

యజమాని కారు, నగదుతో ఉడాయించిన డ్రైవర్​ అరెస్ట్​ - పెళ్లి చేసుకొని స్థిరాపడాలని చోరీ

మియాపూర్‌లోని పాఠశాలలో చెడ్డీ గ్యాంగ్‌ చోరీ - రూ.7.85 లక్షలు దోచుకెళ్లిన దుండగులు

వివాహ వేడుకలో భారీ చోరీ - 29 తులాల బంగారం అపహరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.