ETV Bharat / state

ధరణి స్పెషల్ డ్రైవ్​ను ఈ నెల 17 వరకు పొడిగించిన సర్కార్

author img

By ETV Bharat Telangana Team

Published : Mar 11, 2024, 8:11 PM IST

Dharani Application Consideration Deadline Extension : ధరణి దరఖాస్తుల పరిశీలన గడువును సర్కారు ఈనెల 17 వరకు పెంచింది. రాబోయే రెండు మూడు నెలల్లో శాశ్వత పరిష్కారం లభిస్తుందన్న ధరణి కమిటీ సభ్యులు, ఆ లోపున ఉన్న వాటిపై ప్రత్యేక డ్రైవ్‌లో మోక్షం లభించేలా కృషిచేస్తున్నట్లు వివరించారు. వికేంద్రకరణ ద్వారా అన్నదాతల అర్జీలకు మార్గం చూపేలా ప్రయత్నిస్తున్నట్లు వివరించారు.

Dharani Committee Special Drive Extended
Dharani Application Consideration Deadline Extension

ధరణి స్పెషల్ డ్రైవ్​ను ఈ నెల 17 వరకు పొడిగించిన సర్కార్

Dharani Application Consideration Deadline Extension : రాష్ట్రంలో ధరణి సమస్యల పరిష్కారంపై దృష్టిసారించిన కాంగ్రెస్ సర్కార్‌, ప్రత్యేక డ్రైవ్‌ను 17 వరకు పొడిగించింది. ఇప్పటివరకు పెండింగ్‌లో రెండున్నర లక్షల అర్జీలను క్షేత్రస్థాయిలో(Field Level) పరిశీలించి పరిష్కరించే దిశగా కార్యచరణ ముమ్మరమైంది. కొత్త దరఖాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడానికి నిరంతర ప్రక్రియగా కౌంటర్లు ఏర్పాటు చేస్తామని ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి పేర్కొన్నారు.

గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల కోటి 35 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి(Agricultural Land) చెరసాలలో పడినట్లయిందని విమర్శించారు. నిషేధిత జాబితాను అడ్డం పెట్టుకుని వేలాది మంది రైతుల భూములను అగ్గువకు లాక్కున్నారని ఆయన ఆక్షేపించారు. 75 లక్షల కర్షకుల వెతలను తీర్చే బాధ్యతను భుజానికెత్తుకున్నామన్న కోదండరెడ్డి, ధరణిని చక్కదిద్దే పనిలో ఉన్నట్లు వివరించారు.

వారం రోజుల్లో 76వేల దరఖాస్తులు పరిష్కరించాం : పొంగులేటి

Dharani Act Issues in Telangana : ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో గత ఆరేడు సంవత్సరాలుగా భూమి హక్కులు కోల్పోవటం జరిగిందని ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి తెలిపారు. అదేవిధంగా భూ కుంభకోణాలు(Land Scams) ఎన్నోపెద్ద ఎత్తున జరిగాయని, సంతోష్​ అనే ఓ రాజ్యసభ మెంబర్​, వారి కుటుంబానికి సంబంధించిన వారి పేరు మీద కూడా ఎన్నో భూములు ఉన్నాయన్నారు. ఎట్లా అంత భూమి సంక్రమించిందని ప్రశ్నించారు. 2.45 లక్షల దరఖాస్తులు పరిష్కారం చేయటానికి క్షేత్రస్థాయిలో ఆదేశాలు ఇవ్వటం జరుగుతున్నాయని ఆయన తెలిపారు.

"అధికారం లేక హక్కు లేక అల్లాడుపోతున్న రైతులు, వాళ్ల సమస్యలకు శాశ్వత పరిష్కారం కావాలంటే అంచలంచెలుగా అనేక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. దాదాపుగా అప్పటికీ 23 లక్షల ఎకరాల భూమి పార్ట్​-బీ లో పెట్టారు. కానీ దానిని అధికారికంగా చూస్తే 18 లక్షల ఎకరాలు భూమి పార్టీ-బీలోనే ఉంది. అంటే అదంతా నిషేధిత జాబితాలోనే ఉంది. ప్రతి ఎకరానికి భూమి హక్కు కల్పించే విధంగా రికార్డులు, వ్యవస్థత అందరికీ అందుబాటులో ఉండేటట్లు చేస్తామని హామీ ఇస్తున్నాం."-కోదండరెడ్డి, ధరణి కమిటీ సభ్యుడు

Dharani Committee Special Drive Extended : దేశానికే ఆదర్శవంతమైన రెవెన్యూ వ్యవస్థను(Revenue System) సర్కార్‌ తీసుకురాబోతున్నట్లు ధరణి కమిటీ సభ్యుడు సునీల్‌ కుమార్‌ అన్నారు. ప్రత్యేక డ్రైవ్‌ వల్ల లక్ష దరఖాస్తులకు నివేదికలు సిద్ధమయ్యాయన్న సునీల్‌, దశలవారీగా మిగతా అర్జీలను పరిష్కరిస్తామన్నారు. దీర్ఘకాలికంగా ధరణి మరింత ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతో ఉందని వివరించారు. ఈనెల 17 వరకు నిర్వహిస్తున్న ప్రత్యేక డ్రైవ్‌ను అన్నదాతలంతా సద్వినియోగం చేసుకోవాలని ధరణి కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు.

త్వరలోనే ధరణి పోర్టల్​పై మధ్యంతర నివేదిక : కోదండ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం - ధరణి సమస్యల పరిష్కారానికి అధికారాల బదలాయింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.