'కొంతమందికి భరణంగా, చాలా మందికి ఆభరణంగా భారంగా మారిన ధరణి'

author img

By ETV Bharat Telangana Desk

Published : Feb 10, 2024, 3:07 PM IST

Telangana vote on account Budget

Minister Bhatti on Dharani Issues : బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ధరణి పోర్టల్​పై ప్రస్తావించారు. గత ప్రభుత్వం ఎంతో హడావుడిగా, ఎలాంటి అధ్యయనం చేయకుండా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ కారణంగా ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ధరణి కొంతమందికి భరణంగా, మరికొంత మందికి ఆభరణంగా చాలా మందికి భారంగా మారిందని దుయ్యబట్టారు.

Minister Bhatti on Dharani Issues : గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్​తో(Dharani Portal) సామాన్యులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఎంతో మంది తమ అవసరాల కోసం సొంత భూమిని కూడా అమ్ముకోలేకపోతున్నారని, పిల్లల పెళ్లిళ్లు చదువులకు ఇతర అవసరాలను తీర్చుకోలేక తీవ్ర ఆవేదన చెందుతున్నారని దుయ్యబట్టారు. ధరణి కొంతమందికి భరణంగా, మరికొంత మందికి ఆభరణంగా చాలా మందికి భారంగా మారిందని విమర్శించారు.

రూ.2.75 లక్షల కోట్లతో తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ - ఏ శాఖకు ఎంతంటే?

Telangana vote on account Budget : ఇదంతా లోపభూయిష్టమైన ధరణి పోర్టల్ కారణంగానే జరిగిందని. ఇప్పుడు తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రికార్డులు పరిశీలించిన మీదట, ఇది నిజమేనని తేలిందన్నారు. అందుకే ఈ సమస్యను పరిష్కరించేందుకు కాంగ్రెస్​ సర్కారు అత్యధిక ప్రాధాన్యతనిచ్చిందన్నారు. ఇచ్చిన హామీ మేరకు రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు సత్వర చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ధరణి పోర్టల్ అమలు కారణంగా వచ్చిన సమస్యలను అధ్యయనం చేయడానికి ఐదుగురు సభ్యులతో కూడిన ఒక కమిటీని నియమించామన్నారు.

ఆరు గ్యారంటీలకే బడ్జెట్​లో పెద్దపీట - మొత్తం ఎన్ని నిధులు కేటాయించారో తెలుసా?

అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఇంతటి కీలకమైన నిర్ణయం తీసుకుని నిపుణుల కమిటీకి బాధ్యతను అప్పగించడం గతంలో ఎన్నడూ జరగలేదని భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్​ను ప్రజాభవన్​గా మార్చి ప్రజా పరిపాలనకు శుభారంభం చేసిందన్నారు. ప్రతివారం రెండు రోజుల్లో ప్రజావాణి నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు 43.054 దరఖాస్తులు రాగా అందులో 8.927 భూ సమస్యల గురించి దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.

త్వరలోనే మెగా డీఎస్సీ - జాబ్​ క్యాలెండర్​ ప్రక్రియ ప్రారంభించాం : భట్టి విక్రమార్క

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.