ETV Bharat / state

మేడారం మహా జాతర నిర్వహణకు పోలీస్ శాఖ సిద్ధం : డీజీపీ రవి గుప్తా

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 19, 2024, 4:20 PM IST

DGP Ravi Gupta on Medaram Jatara : మేడారం మహాజాతర ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని తెలంగాణ డీజీపీ రవి గుప్తా అన్నారు. లక్షలాది మంది తరలివచ్చే ఈ మహా జాతరకు, తదనుగుణంగా సిబ్బందిని అందుబాటులో ఉంచామని తెలిపారు. ముఖ్యంగా ట్రాఫిక్​, నేర నియంత్రణలకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రత్యేక బలగాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ ప్రణాళికల అమలుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు.

Plastic Free Medaram Jatara
Sammakka Saralamma Jatara 2024

DGP Ravi Gupta on Medaram Jatara : మేడారం మహా జాతర ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని రాష్ట్ర డీజీపీ రవి గుప్తా అన్నారు. ఈ మహా జాతరకు కోటిన్నరకు పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామన్న ఆయన, భక్తుల రద్దీనీ(Devotees Crowd) దృష్టిలో ఉంచుకొని పది వేలకు పైగా సిబ్బందిని అందుబాటులో ఉంచామని తెలిపారు. ట్రాఫిక్, నేర నియంత్రణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు. నేడు జాతర బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం, సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మేడారం జాతరకు ఎన్ని లక్షల మంది వచ్చినా సౌకర్యాలు కల్పిస్తాం : మంత్రి పొంగులేటి

వరంగల్ జిల్లా వర్ధన్నపేట బస్సు నిలయంలో మేడారం వెళ్లే భక్తులకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. మహా జాతర నేపథ్యంలో భక్తులు తీసుకోవలసిన జాగ్రత్తలు, అప్రమత్తతపై పలు సూచనలు చేశారు. ఆభరణాలు(Jewellery) వంటి విలువైన వస్తువుల సంరక్షణతో పాటు ప్రధానంగా భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వారికి వివరించారు. లక్షలాదిమంది తరలివచ్చే మేడారం జాతరకు ప్రైవేటు వాహనాల్లో వెళ్లి ప్రమాదాలకు గురికాకుండా, సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని భక్తులకు పోలీసులు విజ్ఞప్తి చేశారు.

Plastic Free Medaram Jatara : మరోవైపు ప్లాస్టిక్ రహిత మేడారం జాతరకు, ప్రజలు సహకరించాలని ప్రపంచ పర్యావరణ సంస్థ ఛైర్మన్ డాక్టర్ హరి ఇప్పనపల్లి కోరారు. ప్రపంచ పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన, సేవ్ మేడారం(Save Medaram) క్లీన్ మేడారం- మేడారం సే నోటు ప్లాస్టిక్ గోడపత్రిక, పర్యావరణ గుడ్డ సంచులను హైదర్ గూడలో విడుదల చేశారు. రెండు కోట్ల మంది మేడారం మహా జాతరకు తరలి వస్తారని, భక్తులందరూ మేడారం పరిసర ప్రాంతాల్లో ఉన్న జీవవైవిద్యాన్ని జీవులను వృక్షాలను కాపాడుకోవాల్సిన బాధ్యత, ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

వారెవ్వా!! మేడారం వనదేవతల కథను ఎంతబాగా చెప్పారో - ఈపాటలు వింటే గూస్​బంప్స్ గ్యారంటీ

ఈ జాతరలో విచ్చలవిడిగా కాలుష్యాన్ని విడుదల చేయకుండా, ప్లాస్టిక్​ను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా మేడారం జాతరలో పసుపు, కుంకుమలు మొదలుకొని అమ్మవార్లకు సమర్పించే బెల్లం వరకు పూర్తిగా విష రసాయనాలు(Toxic Chemicals) వాడుతున్నారని తెలిపారు. అందుకే కనీసం లక్ష క్లాత్ బ్యాగులు పంచాలని తమ సంస్థ లక్ష్యంగా పెట్టుకుందన్నారు.

Sammakka Saralamma Jatara 2024 : జాతరలో ఫ్లెక్సీలను పూర్తిగా నివారించాలన్నారు. కాలుష్యరహిత మేడారం జాతర నిర్వహణ కోసం, ప్రభుత్వం ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించాలని కోరారు. తమ సంస్థ ఆధ్వర్యంలో వెయ్యి మంది వాలంటీర్లను ఏర్పాటు చేసి, ప్రతి ఒక్కరికి ప్లాస్టిక్ ఉత్పత్తుల(Plastic Products) వల్ల జరిగే అనర్థాలు, కాలుష్యంపై అవగాహన కల్పిస్తూ డాక్యుమెంట్​ ప్రదర్శించబోతున్నట్లు వెల్లడించారు.

మరోరెండ్రోజుల్లో జనజాతర - మేడారానికి బయల్దేరిన పగిడిద్దరాజు

మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఎలా వెళ్లాలో తెలుసా? - ఇదిగో రూట్ మ్యాప్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.