ETV Bharat / state

ఛాతీలో బాణం దిగిన యువకుడికి పునర్జన్మనిచ్చిన నిమ్స్ వైద్యులు - అభినందించిన సీఎం రేవంత్​ రెడ్డి - CM Revanth Appreciation to NIMS

author img

By ETV Bharat Telangana Team

Published : May 26, 2024, 3:14 PM IST

Updated : May 26, 2024, 4:01 PM IST

CM Revanth React on Arrow Stuck in Tribal Youth Chest : గిరిజన యువకుడి ఛాతీభాగంలో దిగిన బాణాన్ని చాకచక్యంగా, అత్యంత నిపుణతతో తొలగించిన నిమ్స్ వైద్య బృందానికి సీఎం రేవంత్ ​రెడ్డి అభినందనలు తెలిపారు. ప్రాణాపాయం లేకుండా చాకచక్యంగా తొలగించారని ఎక్స్‌లో సీఎం కితాబిచ్చారు. భవిష్యత్‌లో నిమ్స్ మరింత విస్తృతంగా వైద్య సేవలు అందించాలని రేవంత్​రెడ్డి కోరారు.

CM Revanth Appreciation to NIMS Hospital
CM Revanth React on Arrow Stuck in Tribal Youth Chest (ETV Bharat)

CM Revanth Appreciation to NIMS Hospital : నిమ్స్ ఆసుపత్రి వైద్యులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా అభినందించారు. ప్రమాదవశాత్తు ఛాతీలో దిగిన బాణంతో దాదాపు 24 గంటలు విలవిలలాడుతూ నరకయాతన అనుభవించిన ఓ ఆదివాసీ యువకుడికి నిమ్స్ వైద్యులు శస్త్ర చికిత్స చేసి ప్రాణం పోశారు. ఛత్తీస్​గఢ్​కు చెందిన సోది నంద అనే 17 ఏళ్ల యువకుడికి వారం రోజుల క్రితం ప్రమాదవశాత్తు శరీరంలోకి బాణం దిగింది.

ఆ బాణం సరిగ్గా గుండె, ఊపిరితిత్తుల మధ్య దిగటంతో సోది నందను కుటుంబ సభ్యులు భద్రాచలం ఆసుపత్రికి, ఆ తర్వాత వరంగల్ ఎంజీఎంకు తీసుకువెళ్లారు. అయితే పరిస్థితి విషమించటంతో ఎంజీఎం వైద్యులు బాధితుడుని నిమ్స్ ఆసుపత్రికి పంపగా, ఇక్కడి కార్డియోథొరాసిక్ విభాగాధిపతి డాక్టర్ అమరేశ్వరరావు బృందం శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడారు.

Arrow Stuck Near Heart in Youth Chest : డాక్టర్లు తొలుత సీటీస్కాన్‌ తీశారు. లంగ్స్​ పక్క నుంచి గుండెలోని కుడి కర్ణికలోకి బాణం గుచ్చుకున్నట్లు గుర్తించారు. అప్పటికే తీవ్రంగా రక్తస్రావమైంది. దీంతో ఒకవైపు బ్లడ్​ ఎక్కిస్తూనే నాలుగు గంటలపాటు సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేసి బాణాన్ని తొలగించారు. అది చొచ్చుకుపోయిన చోట రక్తస్రావమై గడ్డకట్టడంతో ప్రాణాపాయం తప్పిందని పేర్కొన్నారు.

CM Revanth Appreciation to NIMS Hospital
Arrow Stuck Near Heart in Youth Chest (EENADU)

ప్రజల్లో నిమ్స్‌పై ఉన్న నమ్మకాన్ని మరోసారి రుజువు చేశారు : ప్రస్తుతం యువకుడు ఆరోగ్యంగా ఉన్నట్టు నిమ్స్ వైద్యులు ప్రకటించారు. ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిమ్స్ వైద్యులకు అభినందనలు తెలిపారు. సామాన్య ప్రజల్లో నిమ్స్ దవాఖానా పట్ల ఉన్న నమ్మకాన్ని మరోమారు రుజువు చేశారని కితాబిచ్చారు. భవిష్యత్తులో నిమ్స్ మరింత విస్తృతంగా వైద్య సేవలు అందించాలని, పేదల దేవాలయంగా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.

"గిరిజన యువకుడు సోది నంద ఛాతిభాగంలో దిగిన బాణాన్ని చాకచక్యంగా, అత్యంత నిపుణతతో తొలగించి నిండు ప్రాణం కాపాడిన నిమ్స్ వైద్య బృందానికి నా అభినందనలు. సామాన్య ప్రజల్లో నిమ్స్ దావాఖాన పట్ల ఉన్న నమ్మకాన్ని మరోసారి రుజువు చేశారు. భవిష్యత్​లో నిమ్స్ మరింత విస్తృతంగా వైద్య సేవలు అందించి, పేదల దేవాలయంగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను."-సీఎం రేవంత్​ ట్వీట్​

సాహసబాలుడు సాయిచరణ్​కు సీఎం రేవంత్​రెడ్డి సన్మానం - CM REVANTH APPRECIATES SAI CHARAN

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నటుడు బాలకృష్ణ

Last Updated : May 26, 2024, 4:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.