ETV Bharat / state

రాహుల్​ గాంధీ కాంగ్రెస్​లో ఉన్నంత కాలం ఆ పార్టీ అధికారంలోకి రాదు : కిషన్​రెడ్డి

author img

By ETV Bharat Telangana Team

Published : Feb 23, 2024, 7:57 PM IST

BJP Vijaya Sankalpa Yatra in Telangana : కాంగ్రెస్‌ సర్కార్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు కావాలంటే .. పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలిపించాలని అడగడమేంటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. అసలు హామీలు అమలుకు వనరులు ఎలా సమీకరిస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్రతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ వ్యాఖ్యానించారు. బీఆర్​ఎస్​కు ఎన్నికల్లో ఓట్లడిగే అర్హతే లేదని మండిపడ్డారు.

Kishan Reddy On Fires on Rahul Gandhi
BJP Vijaya Sankalpa Yatra in Telangana

రాహుల్​ గాంధీ కాంగ్రెస్​లో ఉన్నంత కాలం ఆ పార్టీ అధికారంలోకి రాదు కిషన్​రెడ్డి

BJP Vijaya Sankalpa Yatra in Telangana : పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా విజయ సంకల్ప యాత్రలతో బీజేపీ(BJP) నేతలు రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ఇప్పటికే 45 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తైనట్లు కాషాయ శ్రేణులు వివరిస్తున్నాయి. అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ మళ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లేస్తేనే అమలు చేస్తామనటం ఏంటని కొమురం భీం, కాగజ్‌ యాత్రలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి(Kishan Reddy) ప్రశ్నించారు.

కాగజ్‌నగర్‌లో రోడ్‌షో నిర్వహించిన కిషన్‌రెడ్డి బెంగాల్‌ ఎస్​పీఎమ్​ కార్మికులు, బెంగాలీ క్యాంపులోని కాందిశీకులను కలిసి సమస్యలు తెలుసుకున్నారు.విజయ సంకల్ప యాత్రతో రాజకీయ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్(Laxman) విమర్శించారు. యాత్రలకు వస్తున్న ప్రజాదారణను జీర్ణించుకోలేకే బీఆర్​ఎస్​, కాంగ్రెస్‌ దుష్ప్రచారం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మండిపడ్డారు.

విజయ సంకల్ప యాత్రతో రాజకీయ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి : ఎంపీ లక్ష్మణ్‌

"లోక్​సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్​కు ఒక్క సీటు రావడం కూడా చాలా కష్టంగా ఉంది. ఏ ప్రాతిపదికన కాంగ్రెస్​కు ఓటు వేస్తే దేశానికి మేలు జరుగుతుందో చెప్పాలి. ఇవాళ ముఖ్యమంత్రి అంటున్నారు. తెలంగాణలో 17కు 17సీట్లు గెలిస్తే దేశంలో అధికారంలోకి వస్తే రాహుల్​ గాంధీ ప్రధాని మోదీ అయితే ఇక్కడ ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని అంటున్నారు. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ పోయింది అన్నమాట. రాహుల్​ గాంధీ అస్సలు ప్రధాని మంత్రి కాలేరు. రాహుల్​ గాంధీ కాంగ్రెస్​ పార్టీలో ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు." - కిషన్​రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు

మెదక్ లోక్‌సభ అభ్యర్థ్విత్వం కోసం బీఆర్ఎస్‌లో తీవ్ర పోటీ - అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఆశావహులు

Kishan Reddy On Fires on Rahul Gandhi : 2047కల్లా దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపేలా పక్కా ప్రణాళికతో మోదీ సర్కార్‌ (Modi Govt) పనిచేస్తోందని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ(DK Aruna) తెలిపారు. బీఆర్​ఎస్​తో పొత్తు ప్రసక్తే లేదని రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో వివరించారు. రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలు గెలిచి ప్రధాని మోదీకి కానుక ఇవ్వాలని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రాజేంద్రనగర్‌ నియోజకవర్గం మైలార్‌దేవ్‌పల్లిలో పార్టీ శ్రేణులకు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) అవినీతిపై సీబీఐ విచారణ కోరకపోవటంలోని ఆంతర్యం ఏంటని ఎమ్మెల్యే మహేశ్వర్‌ రెడ్డి ప్రశ్నించారు.

"ప్రస్తుతం కాంగ్రెస్​ గ్యారంటీల హామీలు అమలు చేయకుండా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, తమ విజయ సంకల్ప యాత్రలపై ఎదురు దాడి చేస్తున్నారు. వాళ్లు రాజకీయ ప్రత్యర్థులు వాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతున్నాయి. విజయ సంకల్ప యాత్ర ప్రజలను సమాయత్తం చేస్తుంది. చైతన్య పరుస్తోంది. ఆలోచింపజేస్తుంది. ఈ రెండు పార్టీలు కూడా డైవర్షోన్​లోకి భాగంగా అబద్ధపు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ప్రజలకు తప్పదోవ పట్టిస్తున్నారు." - లక్ష్మణ్​, రాజ్యసభ సభ్యుడు

లోక్​సభ ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు గెలవడం ఖాయం : బండి సంజయ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.