ETV Bharat / state

తల్లిదండ్రులు తిట్టారని ఇంటినుంచి బయటకొచ్చిన మైనర్ - మాయమాటలు చెప్పి అత్యాచారం చేసిన రాపిడో డ్రైవర్ - Girl Raped by Rapido Driver in ts

author img

By ETV Bharat Telangana Team

Published : May 22, 2024, 3:34 PM IST

Updated : May 23, 2024, 8:13 PM IST

Girl Raped by Bike Taxi Driver at Secunderabad : అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా నడిచి వెళ్లినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లని మహాత్మాగాంధీ చెప్పారు. కానీ ప్రస్తుత రోజుల్లో ఆడపిల్ల బయటకు వెళ్లాలంటే సంకోచించాల్సిన రోజులు వచ్చాయి. అర్ధరాత్రి కాదు పగటి పూట కూడా బయటకు వెళ్లిన కామాంధులు విడిచిపెట్టడం లేదు. తాజాగా రోడ్డుపై ఒంటరిగా వెళుతున్న బాలికకు మాయ మాటలు చెప్పి ఓ యువకుడు లాడ్జికు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ ఘటన సికింద్రాబాద్​లోని తుకారం గేట్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది.

Girl Raped by Bike Taxi Driver at Secunderabad
Girl Raped by Bike Taxi Driver at Secunderabad (ETV Bharat)

Girl Raped by Rapido Driver at Secunderabad : ఒకప్పుడు ఆడపిల్ల రాత్రి పూట రోడ్డుపై నడిచి వెళితే ఇంటికి చేరుతుందా లేదా అనే భయంతో తల్లిదండ్రులు వణికిపోయేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో పగటిపూట కూడా ఆడపిల్ల రోడ్డుపై ఒంటరిగా నడిచిన కామాంధులు గద్దల్లా తరుముతున్నారు. వారిపై అఘాయిత్యాలకు పాల్పడుతూ జీవితాలను నాశనం చేస్తున్నారు. రాష్ట్రంలో దిశా లాంటి ఘటనలు జరిగి నిందితులకు జరిగిన శిక్షలను చూసి కూడా కామాంధులు భయపడడం లేదు. తాజాగా రోడ్డుపై ఒంటరిగా వెళుతున్న బాలికకు మాయ మాటలు చెప్పి ఓ యువకుడు లాడ్జికు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ ఘటన సికింద్రాబాద్​లోని తుకారం గేట్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. ఈ ఘటనపై బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Girl Raped by Rapido Driver
నిందితుడు సందీప్​ రెడ్డి (ETV Bharat)

తుకారం గేట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తుకారం పోలీస్​ స్టేషన్​ పరిధిలో ఓ కుటుంబం నివాసం ఉంటుంది. తరుచూ ఫోన్లో మాట్లాడవద్దని తల్లిదండ్రులు కుమార్తె(16)కు చెప్పారు. ఇలా చాలాసార్లు చెప్పి మందలించాలని చూశారు. కానీ ఈ నెల 19న ఆ బాలిక ఫోన్​లో మాట్లాడతుండగా తల్లిదండ్రులు వద్దని చెప్పి మందలించారు. దీంతో ఆమె అలిగి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. అదే రోజు తల్లిదండ్రులు తుకారం గేట్​ పోలీస్​ స్టేషన్​లో తమ కుమార్తె తప్పిపోయిందని ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అదృశ్యం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

హబ్సిగూడలో వర్కింగ్​ మెన్ హాస్టల్​లో ఉండే సందీప్​ రెడ్డి(28) వృత్తిరీత్యా రాపిడో డ్రైవర్​గా జీవనం సాగిస్తున్నాడు. ఇతడు తన విధుల్లో ఉన్న సమయంలో రోడ్డుపై ఆ బాలిక ఒంటరిగా వెళ్లడం గమనించాడు. వెంటనే ఆమె వద్దకు వెళ్లి ఎక్కడికి వెళుతున్నావని అంటూ అడిగాడు. అలా బాలికను మాయమాటల్లో పెట్టిన ఆ కేడీ తనను ఆ వాహనంపై ఎక్కించుకున్నాడు. అక్కడి నుంచి కూకట్​పల్లి, కొండాపూర్​, ట్యాంక్​బండ్​ వంటి తదితర ప్రాంతాలకు తిప్పాడు. అనంతరం కాచిగూడలోని ఓ లాడ్జికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు.

పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు : అక్కడ లాడ్జిలో బాలికపై అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో బాలిక భయపడి వెంటనే తన ఇంటికి వెళ్లి జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే తుకారం గేట్​ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. మంగళవారం రిమాండ్​కు తరలించారు.

మరోవైపు ఈ ఘటనపై రాపిడో స్పందించింది. ఈ ఘటన పట్ల తాము చింతిస్తున్నామని తెలిపింది. బాధిత యువతి రాపిడో బుక్ చేసుకోలేదని, నిందితుడు కూడా ఆ సమయంలో డ్యూటీలో లేడని తెలిపింది. ఇలాంటి చర్యలను తమ సంస్థ ప్రోత్సహించదని పేర్కొంది. వినియోగదారుల భద్రతకే తమ ప్రాధాన్యం ఇస్తామని ఓ ప్రకటనలో తెలిపింది.

కన్నతల్లిపై రేప్​- కొడుకును సుత్తితో కొట్టి చంపిన పేరెంట్స్- గోనె సంచిలో కుక్కి! - PARENTS KILLED SON

నిందితుడిపై రివెంజ్​- 8నెలల గర్భిణీపై గ్యాంగ్​రేప్​, పెట్రోల్ పోసి నిప్పు

Last Updated : May 23, 2024, 8:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.