ETV Bharat / sports

'ఇప్పట్లో నో రిటైర్మెంట్- వరల్డ్​ క్రికెట్​లో నా ఇంపాక్ట్ చూపిస్తా' - Rohit Sharma Retirement

author img

By ETV Bharat Telugu Team

Published : May 15, 2024, 3:48 PM IST

Updated : May 15, 2024, 4:38 PM IST

Rohit Sharma Retirement: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన క్రికెట్ కెరీర్​, రిటైర్మెంట్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. రీసెంట్​గా ఓ దుబాయ్ వెబ్​సైట్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షేర్ చేసుకున్నాడు.

Rohit Sharma Retirement
Rohit Sharma Retirement (Source: Associated Press)

Rohit Sharma Retirement: టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ 2024 టీ20 వరల్డ్​కప్ తర్వాత పొట్టి ఫార్మాట్​కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన రిటైర్మెంట్ గురించి 37ఏళ్ల రోహిత్ స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. జాతీయ జట్టుకు మరికొన్ని సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించాలని ఉందని అన్నాడు. తాజాగా దుబాయ్ ఐ 103.8 వెబ్​సైట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.

ఈ ఇంటర్వ్యూలో రోహిత్ పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు.'క్రికెట్ కెరీర్ ప్రారభించి 17 ఏళ్లైంది. ఈ జర్నీ అద్భుతంగా సాగుతోంది. ఇంకొన్నేళ్లపాటు ఆడుతూ, ప్రపంచ క్రికెట్​లో నా ఇంపాక్ట్ చూపించగలనన్న నమ్మకం ఉంది' అని రోహిత్ అన్నాడు. ఇక ఇదే ఇంటర్వ్యూలో కెప్టెన్సీ గురించి కూడా రోహిత్ మాట్లాడాడు.

'జాతీయ జట్టుకు సారథ్యం వహించే అవకాశం రావడం గొప్ప విషయం. నాకు కెప్టెన్సీ చేసే ఛాన్స్ వస్తుందని అనుకోలేదు. కానీ, వచ్చింది. అందరూ అంటుంటారు కదా, మంచి వాళ్లకు ఎప్పుడూ మంచి జరుగుతుందని. అందుకే నాకు ఈ గౌరవం దక్కిందనుకుంటా. నేను కెప్టెన్సీ అందుకున్నాక, జట్టును ఒక డైరెక్షన్​లో నడిపించాలనున్నా. అందరూ జట్టు కోసమే తప్పా వ్యక్తిగత రికార్డులు, గణాంకాల కోసం కాదని చెప్పాలనున్నాను. జట్టులోని 11మంది కలిస్తేనే ట్రోఫీలు సాధించగలం' అని రోహిత్ పేర్కొన్నాడు.

ఇక సౌతాఫ్రితా స్టార్ బౌలర్ డెల్ స్టెయిన్​ గురించి కూడా రోహిత్ ప్రస్తావించాడు. సౌతాఫ్రితాతో మ్యాచ్​ ఉన్నప్పుడు, క్రీజులో దిగే ముందు స్టెయిన్ బౌలింగ్​ వీడియోలను 100సార్లు చూసేవాడని చెప్పాడు. అతడి బౌలింగ్​ను ఎదుర్కోడాన్ని ఇష్టపడుతానని రోహిత్ పేర్కొన్నాడు. తమ ఇద్దరి మధ్య మ్యాచ్ ఓ వార్​ లాగా ఉంటుందని అన్నాడు.​

Rohit Sharma IPL 2024: ప్రస్తుతం ఐపీఎల్​లో బిజీగా ఉన్న రోహిత్, త్వరలో ప్రారంభం కానున్న టీ20 వరల్డ్​కప్​కు సన్నద్ధం అవుతున్నాడు. ప్రస్తుత ఐపీఎల్​ సీజన్​లో ఇప్పటివరకు 13మ్యాచ్​లు ఆడిన రోహిత్ 349 పరుగులు చేశాడు. తొలి 7మ్యాచ్​ల్లో రాణించిన రోహిత్ గత 6 మ్యాచ్​ల్లో పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇక రోహిత్ ప్రాతినిధ్యం వహిస్తున్న ముంబయి ఇండియన్స్ ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించింది.

టీ20 వరల్డ్‌కప్‌లో హార్దిక్‌ - రోహిత్‌కు ఇష్టం లేదా ? - T20 World Cup 2024 Squad

రోహిత్​కు ఇదే లాస్ట్ సీజన్​! - వైరల్ అవుతున్న వీడియో - Rohit Sharma Mumbai Indians

Last Updated : May 15, 2024, 4:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.